GN Rao Committee Full Report: అమరావతిలోనే అసెంబ్లీ..రాజభవన్, విశాఖలో సచివాలయం,సీఎంఓ,వేసవి అసెంబ్లీ,హైకోర్టు బెంచ్, కర్నూలులో హైకోర్టు, సంచలన విషయాలను బయటపెట్టిన జీఎన్ రావు కమిటీ

గత కొంతకాలంగా ఉత్కంఠగా మారిన ఏపీ రాజధాని అమరావతిపై (AP Capital Amaravathi) ఏర్పాటు చేసిన జీఎన్ రావు నిపుణుల కమిటీ (GN Rao Committee) తన నివేదికను ఎట్టకేలకు సీఎం జగన్ కు (CM YS Jagan) సమర్పించింది. అమరావతిలోనే అసెంబ్లీ( Assembly In Amaravathi), రాజ్‌భవన్‌ (Rajbhavan)..మంత్రుల క్వార్టర్స్ (minister Quarters)ఏర్పాటు చేయాలని....విశాఖలో(Visakhapatnam) సీఎం క్యాంపు ఆఫీస్, సచివాలయం, వేసవి అసెంబ్లీ, హైకోర్టు బెంచ్.. కర్నూలు(Kurnool)లో హైకోర్టు ఏర్పాటు చేయాలని నివేదికలో సూచించామని తెలిపింది.

GN Rao Committee Full Report: అమరావతిలోనే అసెంబ్లీ..రాజభవన్, విశాఖలో సచివాలయం,సీఎంఓ,వేసవి అసెంబ్లీ,హైకోర్టు బెంచ్, కర్నూలులో హైకోర్టు, సంచలన విషయాలను బయటపెట్టిన జీఎన్ రావు కమిటీ
AP Capital gn-rao-committee-recommendations-on-capital-and-overall-development-of-state (Photo-Twitter)

Amaravathi, December 20: గత కొంతకాలంగా ఉత్కంఠగా మారిన ఏపీ రాజధాని అమరావతిపై (AP Capital Amaravathi) ఏర్పాటు చేసిన జీఎన్ రావు నిపుణుల కమిటీ (GN Rao Committee) తన నివేదికను ఎట్టకేలకు సీఎం జగన్ కు (CM YS Jagan) సమర్పించింది. అమరావతిలోనే అసెంబ్లీ( Assembly In Amaravathi), రాజ్‌భవన్‌ (Rajbhavan)..మంత్రుల క్వార్టర్స్ (minister Quarters)ఏర్పాటు చేయాలని....విశాఖలో(Visakhapatnam) సీఎం క్యాంపు ఆఫీస్, సచివాలయం, వేసవి అసెంబ్లీ, హైకోర్టు బెంచ్.. కర్నూలు(Kurnool)లో హైకోర్టు ఏర్పాటు చేయాలని నివేదికలో సూచించామని తెలిపింది.

కర్నూలులో హైకోర్టు... అమరావతి, విశాఖలలో హైకోర్టు బెంచ్‌లు... ఉండాలని ఈ నివేదిక సూచించింది. శ్రీబాగ్‌ ఒప్పందంలో ఉన్నట్టు... హైకోర్టు కర్నూలులో ఉండాలని కమిటీ స్పష్టం చేసింది. మహారాష్ట్ర, శ్రీనగర్‌లో ఉన్నట్టుగా విశాఖపట్టణం, అమరావతి నుంచి లెజిస్లేచర్‌ వ్యవస్థ పనిచేయొచ్చని, ప్రతిదానికి రాజధానికి రావాల్సిన అవసరం ఉండదని తాము సూచించామని ప్రభుత్వానికి నివేదిక సమర్పించిన జీఎన్‌రావు తెలిపారు.

రాజధానిలో ఉన్న విభాగాలను వికేంద్రీకరణ పద్ధతిలో ఏ ప్రాంతాల్లో ఏం ఉండాలన్నది తమ సూచనల్లో ఉన్నాయన్న జీఎన్ రావు, ఈ అంశంపై 2 వేల మంది రైతులతో నేరుగా మాట్లాడామన్నారు. తమకు 35 వేల సిఫారసులు వచ్చాయని చెప్పారు. ప్రజాభిప్రాయ సేకరణకు అనుగుణంగా నివేదిక ఇచ్చాం. రాష్ట్రంలో చాలా ప్రాంతీయ అసమానతలు ఉన్నాయి. కొన్ని ప్రాంతాలు చాలా వెనకబడి ఉన్నాయి. మరి కొన్ని ప్రాంతాలు అభివృద్ధిలో దూసుకుపోతున్నాయి. వీటి మధ్య సమతూకం సాధించాలి. దీని కోసం రెండు అంచెల వ్యూహాన్ని సూచించాం.

సీఎం జగన్ చేతిలోకి రాజధాని రిపోర్ట్ 

అలాగే ఆంధ్రప్రదేశ్‌కు సుదీర్ఘమైన తీర ప్రాంతం ఉంది. అలాగే నదులు, అడవులు ఉన్నాయి,. అభివృద్ధి వల్ల పర్యావరణం పాడవకుండా సూచనలు చేశాం. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి. అభివృద్ధి అంటే పర్యావరణాన్ని పాడు చేసుకోవడం కాదు. అన్ని ప్రాంతాలను దృష్టిలో ఉంచుకుని సూచనలు ఇచ్చాం. వరద ముంపులేని రాజధాని ఉండాలని సూచనలు చేశాం. సుమారు 10,600 కిలోమీటర్లు తిరిగాం.

రాజధాని, అభివృద్ధి అంశాలపై అధ్యయనం చేశాం. అంతా ఒకేచోట కాకుండా అందరికీ అన్నీ అనుకూలంగా ఉండేలా సూచనలు చేశాం. సమగ్రమైన పట్టణాభివృద్ధి, ప్రణాళిక కోసం ప్రయత్నించాం. తుళ్లూరు ప్రాంతానికి వరద ముప్పు ఉంది. పరిపాలనా సౌలభ్యం కోసం రాష్ట్రాన్ని నాలుగు రీజియన్‌లుగా విభజించాలని సూచనలు చేశాం. ఉత్తరాంధ్ర, మధ్య కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమ రీజియన్లు విభజించి అభివృద్ధి చేయాలని సూచించామని తెలిపారు.

రాష్ట్రాన్ని నాలుగు రీజియన్లుగా చూడాలి

ఉత్తరాంధ్ర : శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం

మధ్య కోస్తా : ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా

దక్షిణ కోస్తా : గుంటూరు, ప్రకాశం, నెల్లూరు

రాయలసీమ : చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలు

కర్ణాటక తరహాలో రీజియన్‌ కమిషనరేట్లు ఏర్పాటు చేయాలి. పాలనా వ్యవహారాలు విశాఖలో పెట్టాలి. శ్రీబాగ్‌ ఒప్పందాన్ని దృష్టిలో పెట్టుకుని కర్నూలులో హైకోర్టు

(The above story first appeared on LatestLY on Dec 20, 2019 07:37 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).