Andhra pradesh AP Capital Expert Committee Press Meet on capital (Photo-Twitter)

Amaravathi, December 20: ఏపీ రాజధాని, (Andhra pradesh Capital)ఏపీ సమగ్రాభివృద్ధిపై అధ్యయనం కోసం ఏర్పాటైన జీఎస్‌రావు కమిటీ (GN Rao Committee)ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డికి (AP CM YS Jagan)తుది నివేదిక అందజేసింది. సచివాలయంలో సీఎం జగన్‌తో సమావేశమైన జీఎస్‌‌రావు కమిటీ సభ్యులు తాము తిరిగిన ప్రాంతాలు, అధ్యయనం చేసిన అంశాలను వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో పర్యటించిన జీఎస్‌రావు కమిటీ సభ్యులు ప్రజల నుంచి సూచనలను సలహాలు అభిప్రాయాలను సేకరించారు.

విశాఖ,(Visakhapatnam) కర్నూలు, (Kurnool), అమరావతితో(Amaravathi)పాటు ఇతర ప్రాంతాల్లో పరిస్థితిని పరిశీలించి ఏది ఎక్కడ అనువుగా ఉంటుందనే కోణంలో అధ్యయనం చేశారు. అలాగే, రాష్ట్రవ్యాప్తంగా తమకు అందిన 40వేలకు పైగా వినతులను కమిటీ పరిశీలించింది. ఈ కమిటీ ఏపీ రాజధాని అంశంపై సీఎం జగన్ కు నివేదిక ఇచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడింది.

సీఎం జగన్ చేతిలోకి రాజధాని రిపోర్ట్ 

సెప్టెంబర్ నుంచి శోధించిన అంశాలపై నివేదిక రూపొందించామని, దాన్ని సీఎంకు ఇచ్చామని కమిటీ సభ్యులు తెలిపారు. ప్రధానంగా రెండు అంశాలు (రాజధాని, అభివృద్ధి) పై తాము అధ్యయనం జరిపామని, మూడు ప్రాంతాల ప్రజల అభిప్రాయాలు తెలుసుకున్నామని కమిటీ సభ్యులు వివరించారు.

ఏపీలో ప్రాంతీయ అసమానతలు ఉన్నట్టు తాము గుర్తించామని, మూడు ప్రాంతాల సమస్యలపై తాము పరిశీలన చేశామన్నారు. రాష్ట్ర అభివృద్ధి ఏ విధంగా జరగాలి, అందుకోసం ఏం చేస్తే బాగుంటుంది అనే సూచనలు నివేదికలో పొందుపరిచామని కమిటీ సభ్యులు చెప్పారు. పరిపాలన సౌలభ్యం కోసం రాష్ట్రాన్ని 4 రీజియన్ లుగా విభజించాలని తాము సూచించామని కమిటీ సభ్యులు తెలిపారు. ఉత్తర, మధ్య, దక్షిణ కోస్తా, రాయలసీమ రీజియన్‌లుగా విభజించాలని కోరామన్నారు.

రాజధానిపై జీఎన్ రావు కమిటీ సిఫార్సులను ఓ సారి పరిశీలిస్తే..

1. పరిపాలన సౌలభ్యం కోసం ఏపీని 4 రీజియన్‌లుగా విభజించాలి. ఉత్తర, మధ్య, దక్షిణ కోస్తా, రాయలసీమ రీజియన్ లుగా విభజించి అభివృద్ధి చేయాలి.

2. పరిపాలన రాజధానిగా విశాఖ ఉండాలి. విశాఖలో సీఎం క్యాంపు ఆఫీస్, సచివాలయం, వేసవి అసెంబ్లీ, హైకోర్టు బెంచ్ వంటివి ఏర్పాటు చేయాలి.

3. అమరావతిలో అసెంబ్లీ, రాజ్ భవన్, మంత్రుల క్వార్టర్స్, హైకోర్టు బెంచ్ ఉండాలి.

4. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలి.

5. తుళ్లూరులో అసెంబ్లీ సమావేశాలు. వేసవిలో అసెంబ్లీ సమావేశాలు విశాఖలో నిర్వహించాలి.

6. తుళ్లూరులో కొన్ని జోన్లు వరద ప్రభావానికి గురవుతాయి. ఆ ప్రాంతాల్లో తప్పు మిగతా ప్రాంతాల్లో అభివృద్ధి చేయాలని సూచించాం. వరద ముంపులేని ప్రాంతంలో రాజధాని ఉండాలని సూచించాం.  సహజ వనరులు అన్ని ప్రాంతాలకు అందాలి