AP CM YS Jagan| ( File Photo)

Amaravati, April 22: గత కొన్ని రోజుల క్రితం ఏపీలో ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం (English Medium in Govt Schools) అమలు చేస్తూ జగన్ సర్కారు ఇచ్చిన జీవోలను హైకోర్టు (AP High Court) రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం బోధనకు సంబంధించి హైకోర్టు ఆదేశాల అమలుపై ఏపీ సర్కార్ (AP Government)దృష్టిసారించింది. ఇందులో భాగంగా రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలు 2020–21 విద్యా సంవత్సరం నుంచి ఏ మీడియంలో చదవాలని భావిస్తున్నారో తెలుసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇంగ్లీష్ మీడియం జీవోను కొట్టివేసిన హైకోర్టు, ఇంగ్లీష్ మీడియంలో బోధనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపిన ఏపీ విద్యాశాఖా మంత్రి

2019–20 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు విద్యార్థుల తల్లిదండ్రులు/ సంరక్షకుల అభిప్రాయాలను తెలుసుకుని నివేదించాల్సిందిగా పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ను ఆదేశించింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి బి.రాజశేఖర్‌ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఒకటి నుంచి ఆరు వరకే ఇంగ్లీష్ మీడియం, తెలుగు సబ్జెక్ట్ తప్పనిసరి

ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేద విద్యార్థులు మెరుగైన అవకాశాలు అందిపుచ్చుకునేలా 2020–21 విద్యా సంవత్సరం ఒకటి నుంచి ఆరో తరగతి వరకు ఇంగ్లిష్‌ మీడియం ప్రవేశపెట్టాలని ప్రభుత్వం గతంలో నిర్ణయించింది. అనంతరం ప్రతి ఏటా ఒక్కో తరగతి పెంచుకుంటూ నాలుగేళ్లలో పదవ తరగతి విద్యార్థులు బోర్డు పరీక్షలను ఇంగ్లిష్‌ మీడియంలో రాసేలా తీర్చిదిద్దాలని భావించింది. ఇదే సమయంలో అన్ని పాఠశాలల్లోనూ తెలుగును తప్పనిసరి సబ్జెక్టుగా కూడా చేసింది. ఈ మేరకు ప్రతి మండల కేంద్రంలోనూ ఓ తెలుగు మీడియం పాఠశాల కొనసాగించాలని నిర్ణయించింది. ఏపీ అసెంబ్లీలో ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం (English Medium)పై చర్చ

అయితే ప్రభుత్వ ఉత్తర్వులను వ్యతిరేకిస్తూ కొందరు కోర్టులో కేసు వేశారు. తమ పిల్లలు ఏ మీడియంలో చదవాలో నిర్ణయించుకునే హక్కు తల్లిదండ్రులకే ఉందని కోర్టు తీర్పు చెప్పింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తల్లిదండ్రుల అభిప్రాయాలను తెలుసుకోవాలని నిర్ణయించింది. 1 నుండి 5వ తరగతులు చదివే విద్యార్థుల తల్లిదండ్రుల అభిప్రాయాలను ప్రభుత్వం సేకరించనుంది. ఏ మీడియం కావాలో తెలపాలని తల్లిదండ్రులను ప్రభుత్వం కోరనుంది. అభిప్రాయ సేకరణ తర్వాత ఈ అంశంపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

ఇంగ్లీష్ మీడియంపై హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళతామని ఏపీ మంత్రి తెలిపారు. ఈ నేపథ్యంలో ముందుగా తల్లి తండ్రులు ఏమనుకుంటున్నారు అనే విషయం తెలుసుకోవడం ముఖ్యమని ఏపీ సర్కార్ భావిస్తోంది. ఆ తర్వాతే దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కాగా ఏపీ సర్కార్ ఈ విషయంలో వెనక్కితగ్గే ఆలోచన చేయడం లేదని అర్ధం చేసుకోవచ్చు.