ap-govt-issues-notification-for-implementation-of-english-medium-from-next-year (Photo-Twitter)

Amaravathi : ఏపీ(Andhra Pradesh)లో ఈ మధ్య ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం అనే అంశం బాగా ట్రెండ్ అయింది. చాలామంది దీనిని స్వాగతిస్తుండగా మరికొందరు దీన్ని వ్యతిరేకిస్తున్నారు. తెలుగు భాష దెబ్బతింటుందని చాలామంది దీనిని వ్యతిరేకిస్తున్నారు. అయితే ఏపీ ప్రభుత్వం (The Government of Andhra Pradesh) దీనిపై కొన్ని సవరణలు చేస్తూ జీవో జారీ చేసింది. దీని ప్రకారం..ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2020 నుంచి ప్రభుత్వ స్కూల్స్ లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టనున్నారు.

ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నవంబర్ 20, 2019న ఇంగ్లీష్ మీడియంపై ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం 1వ తరగతి నుంచి 6 వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం (from 1 to 6 will be converted into English medium ) ప్రవేశపెట్టనున్నారు. ఆ తర్వాత ప్రతీ ఏడాది నుంచి ఒక్కో సంవత్సరం పెంచుతూ పదో తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం అమలు చేయనున్నారు.

గతంలో ఇచ్చిన 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం (English Medium) జీవోలో మార్పు చేశారు. తెలుగు లేదా ఉర్దూ సబ్జెక్ట్ కచ్చితంగా ఉంచాలని ఉత్తర్వులు ఇచ్చారు. అలాగే ఇంగ్లీష్ బోధనలో ప్రావీణ్యం ఉన్న టీచర్లను నియమించాలని ప్రభుత్వం సూచించింది. ఇంగ్లీష్ మీడియం అమలు కోసం టీచర్ల నియామకాలు, శిక్షణ చేపట్టేలా విద్యాశాఖ కమిషనర్ కు ఆదేశాలు జారీ చేశారు.

ఇంగ్లీష్ మీడియం అమలుకు వీలుగా టీచర్ల హ్యాండ్ బుక్ లు, శిక్షణా కార్యక్రమాలు రూపొందించాలని ఎస్ఈఆర్ఈటీకి ఆదేశించారు. టీచర్ల నైపుణ్యాల అభివృద్ధికి ఎస్ఈఆర్టీతో సమన్వయం చేసుకోవాలని విద్యాశాఖ కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేశారు.