Eluru, January 03: వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం (YSR Aarogyasri Scheme) పైలట్ ప్రాజెక్టుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి (Chief Minister YS Jagan Mohan Reddy) పశ్చిమ గోదావరి జిల్లాలో శ్రీకారం చుట్టారు. ఏలూరు (Eluru) ఇండోర్ స్టేడియంలో వైఎస్సార్ ఆరోగ్య శ్రీ పైలట్ ప్రాజెక్టును (YSR Arogyasri Pilot Project) ఆయన ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పలు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న ఆరోగ్యశ్రీ లబ్ధిదారులతో ముఖ్యమంత్రి మాట్లాడారు. ఆరోగ్య శ్రీ పథకంలో ప్రస్తుతం 1,059 వ్యాధులకు చికిత్స అందిస్తుండగా అదనంగా మరో 1000 చేర్చి మొత్తం 2,059 వ్యాధులకు సేవలందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
తేలిపోనున్న మూడు రాజధానుల సంగతి
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి (YS Rajasekhar reddy)కూడా ఆరోగ్యశ్రీ పథకాన్ని (Aarogyasri Scheme) 2007 ఏప్రిల్ 1న ఏలూరు వేదికగా ప్రారంభించారు. ఇప్పుడు ఆయన కుమారుడు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కూడా ఇదే ఏలూరు వేదికపై నుంచి ఆరోగ్యశ్రీ పథకం ప్రారంభించారు.
Here's CMO Andhra Pradesh Tweet
ఏలూరు ఇండోర్ స్టేడియంలో ఆరోగ్యశ్రీ లో 1000 వ్యాధులను చేర్చే పైలెట్ ప్రాజెక్టు ప్రారంభించి బహిరంగ సభలో ప్రసంగిస్తున్న ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్. pic.twitter.com/7Y0YdiXN2Q
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) January 3, 2020
ఈ ప్రాజెక్టు అమల్లో అనుభవాలు, ఇబ్బందుల్ని బేరీజు వేశాక రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ప్రతి నెలా ఒక్కో జిల్లాలో 2,059 రోగాలకు ఈ పథకాన్ని విస్తరిస్తూ వెళతారు. అప్పటి నుంచే ఆయా జిల్లాల్లో.. చికిత్స వ్యయం రూ.1,000 దాటితే ఆరోగ్యశ్రీ వర్తించడం ప్రారంభమవుతుంది.
రైతుల ఖాతాల్లోకి పీఎం సమ్మాన్ యోజన నిధులు
ఫిబ్రవరి మొదటి వారం నుంచి క్యాన్సర్ రోగులకు (cancer treatment)ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా ఆరోగ్య శ్రీ ద్వారా ఉచిత చికిత్స అందించనున్నారు.
ప్రతి ఇంటి గడపకు పాలనే లక్ష్యంగా వైఎస్‌ఆర్ నవశకం
ఈ సందర్భంగా సీఎం వైయస్ జగన్ మాట్లాడుతూ..పేద ప్రజలకు ఉచిత వైద్యం అందించే సంకల్పంతో ‘వైఎస్సార్ ఆరోగ్యశ్రీ’ పథకాన్ని ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు. తనకు ఎంతో సంతృప్తికరమైన పథకం ఆరోగ్యశ్రీ అని పేర్కొన్నారు.
ఎంఎస్‌ఎంఈలకు రక్ష వైయస్సార్ నవోదయం
నూతన సంవత్సరంలో తమ ప్రభుత్వం ప్రారంభించిన రెండో సంక్షేమ కార్యక్రమం ఆరోగ్య శ్రీ అని తెలిపారు (మొదటిది ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం). వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చే విధంగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆరోగ్య శ్రీ పథకాన్ని ప్రవేశపెట్టారని గుర్తుచేశారు.
రూ. 560 కోట్లతో వైయస్సార్ 'కంటి వెలుగు' స్కీమ్
సంవత్సర ఆదాయం రూ.5లక్షలు ఉన్నవారికి కూడా ఆరోగ్య శ్రీ వర్తింపజేస్తున్నట్లు సీఎం ప్రకటించారు. అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి గ్రామ సచివాలయాల ద్వారా కార్డుల పంపీణి చేస్తామని తెలిపారు.
రాళ్లు పడిన చోటే పూల వర్షం, విశాఖలో ఏపీ సీఎం వైయస్ జగన్‌కి ఘన స్వాగతం
ఏ కేన్సర్ అయినా రూపాయి ఖర్చు లేకుండా వైద్యం అందిస్తామన్నారు. అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి గ్రామ సచివాలయం ద్వారా ఆరోగ్యశ్రీ కార్డులు(Arogyasri cards) పంపిణి చేస్తున్నామని తెలిపారు.
చేనేత కార్మికులకు ఏడాదికి రూ. 24 వేలు
కార్డులకు క్యూఆర్ కోడ్‌ను ప్రవేశపెడతామని.. ఆరోగ్యశ్రీ కింద కోటి 42 లక్షల కార్డులను అందజేయనున్నట్లు తెలిపారు. చికున్ గున్యా, మలేరియా, డెంగీ, వడదెబ్బకు కూడా ఆరోగ్యశ్రీని అమలు చేస్తామని చెప్పారు.
వైయస్సార్ వాహన మిత్ర స్కీమ్ ప్రారంభం, ఆర్థిక భద్రత కోసం ఏటా రూ.10 వేలు
అలాగే డయాలసిస్, తలసేమియా, బోధకాలు, పక్షవాతం, కుష్టు వ్యాధిగ్రస్తులకు సాయం అందిస్తున్నామని తెలిపారు. అలాగే 1060 కొత్త అంబులెన్సులను కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు.
ఏప్రిల్ 1వ తారీకు నుంచి అంతర్జాతీయ ప్రమాణాలతో మందులను ప్రవేశ పెడతామన్నారు. మార్చి నెలాఖరుకల్లా 1060 .. '108 , 104' అంబులెన్సులు అందుబాటులో ఉంటాయని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెలిపారు. ఈనెల 9వ తారీఖున అమ్మఒడి కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని ప్రకటించారు.
నెల్లూరు జిల్లా వేదికగా వైయస్సార్ రైతు భరోసా
రాష్ట్రంలోని ప్రతి గవర్నమెంటు పాఠశాలలను ఇంగ్లీష్ మీడియం స్కూళ్లుగా మార్పు చేయబోతున్నట్టు సీఎం స్పష్టం చేశారు. నాడు- నేడు తో పాఠశాలల ఆధునీకరణ చేపట్టామని సీఎం వెల్లడించారు.
పేదలకు భరోసానిచ్చే వైఎస్సార్ ఆరోగ్య ఆసరా
ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రులు ఆళ్ల నాని, నారాయణ స్వామి, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత, గృహ నిర్మాణ శాఖా మంత్రి చెరుకువాడ శ్రీ రంగనాథ రాజు, ఎంపీలు కోటగిరి శ్రీధర్, రఘురామకృష్ణమ రాజు, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు,పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.