Amaravathi, January 31: పరిపాలనలో దూసుకుపోతున్న ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి (AP CM YS Jagan) మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే పలు పథకాలను ప్రవేశపెట్టిన ఏపీ సీఎం నాయీ బ్రాహ్మణులకు కూడా ఆర్థిక సాయం అందించేందుకు రెడీ అయినట్లుగా తెలుస్తోంది. ఇందులో భాగంగానే నాయీ బ్రహ్మణులకు, టైలర్లకు, రజకులకు ఆర్థిక సాయం అందించాలనే ఉద్దేశ్యంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ‘జగనన్న చేదోడు’ (Jagananna Chedodu Programme) కార్యక్రమాన్ని త్వరలో ప్రారంభించనున్నట్లు సమాచారం.
పెద్దల సభ రద్దుకు అసెంబ్లీ ఆమోదం
ఈ కార్యక్రమం ద్వారా ప్రతీ ఏడాది రూ. 10వేల చొప్పున ఐదేళ్లపాటు వారికి ఆర్థిక సాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నాయీ బ్రహ్మణులకు, టైలర్లకు, రజకులకు ప్రతి ఏడాది రూ. 10వేల చొప్పున అందిచాలని సంక్షేమ శాఖ ఉత్తర్వులు ఇచ్చినట్లు సమాచారం.
ఏపీ శాసనమండలి రద్దుకు దారులు ఏంటీ..?,ఎవరెవరు ఆమోద ముద్ర వేయాలి
మండలి రద్దు బిల్లు (AP Legislative Council Abolished Bill) కేంద్రానికి పంపిన విషయం విదితమే. అయితే ఈ బిల్లుకు కేంద్రం నుంచి క్లియరన్స్ రాకముందే ఏపీ ప్రభుత్వం (Andhra Pradesh Government) మంత్రుల శాఖలను మార్చేసింది.
ఏపీ శాసనమండలి రద్దుకు ఏకగ్రీవ తీర్మానం
వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులే లక్ష్యంగా మంత్రి మోపిదేవి (Mopidevi) వద్దనున్న మార్కెటింగ్‌శాఖను, అలాగే మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి (Goutham Reddy) వద్దనున్న ఫుడ్ ప్రాససింగ్ శాఖను వ్యవసాయ, సహకార శాఖలను చూస్తున్న మంత్రి కె.కన్నబాబుకు (Kanna babu) అప్పగించింది. పరిపాలనా పరమైన సౌలభ్యంతో పాటు మరింత మేలు జరిగే ఉద్దేశంతో ఈ మేరకు చర్యలు తీసుకున్నట్టు అధికార వర్గాలు వెల్లడించాయి.
మూడు రాజధానులపై ఏపీ గవర్నర్ కీలక వ్యాఖ్యలు
మంత్రి మోపిదేవి వద్ద ప్రస్తుతం పశుసంవర్థక, మత్స్యశాఖలు ఉన్నాయి. మరో శాఖను మోపిదేవికి అప్పగించాలని సీఎం యోచిస్తున్నారు. దీనికి సంబంధించి రెండు రోజుల్లో ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. అలాగే బదలాయించిన ఫుడ్ ప్రాసెసింగ్ పోనూ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి వద్ద పరిశ్రమలు, వాణిజ్యం, ఐటీ శాఖలున్నాయి. కొద్దిరోజుల కిందటే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న స్కిల్‌డెవలప్‌మెంట్ శాఖను మంత్రి గౌతంరెడ్డికి అప్పగించిన సంగతి తెలిసిందే.
బిల్లులను సెలక్ట్ కమిటీకి పంపలేదన్న శాసనమండలి స్పీకర్
మండలి రద్దు విషయంలో కేంద్రం నుంచి క్లియరెన్స్ రాగానే రాజీనామా చేయడానికి సిద్దమేనని మోపిదేవి ఇప్పటికే వెల్లడించారు. టీడీపీ వాళ్లు చెబితే రాజీనామాలు చేస్తామా అంటూ ఇప్పటికే ప్రశ్నించిన మోపీదేవి, టీడీపీ తరహాలో తాము పదవుల కోసం అర్రులు చాచే రకం కాదని అన్నారు ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.