AP Legislative Council: ఏపీ శాసనమండలి రద్దుకు దారులు ఏంటీ..?,ఎవరెవరు ఆమోద ముద్ర వేయాలి..?,దేశంలో ఏయే రాష్ట్రాల్లో ఉంది, ఎన్ని చోట్ల రద్దైంది..?,ఏపీ శాసనమండలి ఎప్పుడు ప్రారంభమైది,దాని చరిత్ర ఏమిటీ..? ఆంధ్రప్రదేశ్ శాసనమండలిపై ప్రత్యేక కథనం
AP CM YS Jagan AND PM Modi And Chandra babu Naidu (Photo-Facebook PTI)

Amaravathi, January 24: ఏపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకువచ్చిన వికేంద్రీకరణ బిల్లు, అలాగే ఇతర బిల్లులు అసెంబ్లీలో ఆమోదం పొందినా ఏపీ శాసనమండలిలో అవి ఆమోదం పొందలేదు. వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీ‌ఏ బిల్లును ఏపీ శాసనమండలి వ్యతిరేకించడమే కాకుండా దాన్ని సెలక్ట్ కమిటీకి పంపాల్సిందిగా శాసన మండలి ఛైర్మెన్ ఎంఎ షరీఫ్ నిర్ణయం తీసుకున్నారు. తనకు ఉన్న విశేష అధికారాలతోనే వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులను సెలెక్ట్‌ కమిటీకి సిఫార్స్ చేశానని ఏపీ శాసనమండలి ఛైర్మన్‌ షరీఫ్‌ అన్నారు.

ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకుంది. కీలక బిల్లుల తిరస్కరణతో అసహనంతో రగిలిపోతున్న ప్రభుత్వం.. మండలి రద్దుపై నాలుగు రోజుల్లో కీలక ప్రకటన వెలువడుతుందని చెప్పడంతో ఏపీ శాసనమండి రద్దు ఇప్పుడు ఏపీలో హాట్ టాఫిక్ గా మారింది.

మండలి సమావేశానికి రూ. 60 కోట్లు ఖర్చు అవుతుందని.. విడిపోయిన ఈ పేద రాష్ట్రానికి శాసన మండలి అవసరమా అన్న సీఎం జగన్‌ వ్యాఖ్యలు.. పెద్దల సభను పక్కన పెట్టేందుకు దారులను ఏర్పరస్తున్నాయి. ఏపీ సీఎం జగన్‌ వ్యాఖ్యలతో దాదాపు శాసన మండలి రద్దు ఖాయంగా కనిపిస్తుంది. ఇదే నిజమైతే ప్రభుత్వం నెక్స్ట్ ఏం చేయబోతుంది..? రద్దుకి ఎంత సమయం పడుతుంది..?... ఇప్పటిదాకా ఎవరు రద్దు చేశారు.. ఇలాంటి విషయాలు ఓ సారి చూద్దాం.

సభ నుంచి వెళ్లిపోయిన స్పీకర్ తమ్మినేని

ఆంధ్రప్రదేశ్‌లో జులై 1, 1958న శాసన మండలి ఏర్పాటు

ఆంధ్రప్రదేశ్‌లో శాసన మండలికి సుదీర్ఘమైన చరిత్ర ఉంది. జులై 1, 1958న ఆంధ్రప్రదేశ్‌లో శాసన మండలి ఏర్పాటయ్యింది. 1983 వరకూ కాంగ్రెస్‌ పార్టీనే అధికారంలో ఉండటంతో శాసససభ, మండలి కార్యకలాపాలు సజావుగానే సాగాయి. ఆ తర్వాత 1983లో ఎన్టీఆర్‌ నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడంతో.. అసెంబ్లీకి, మండలికి మధ్య వార్ మొదలైంది.

3 రాజధానుల బిల్లు చర్చకు ముందే ఎమ్మెల్సీ పదవికి డొక్కా రాజీనామా

మండలి తీరుతో విసిగిపోయిన అప్పటి సీఎం దివంగత ఎన్టీఆర్‌ దీన్ని ఆరో వేలుగానూ వర్ణించారు కూడా. అసెంబ్లీలో ఆమోదించిన బిల్లులకు శాసనమండలిలో కాంగ్రెస్ పార్టీ అడ్డు తగులుతుండటంతో అప్పటి ముఖ్యమంత్రి దివంగత ఎన్టీఆర్ ఏప్రిల్ 30, 1985న ఏపీ శాసనమండలిని రద్దు చేస్తున్నట్లు తీర్మానం చేశారు. ఆ సమయంలో అసెంబ్లీలో ఆయనకు పూర్తి మెజార్టీ ఉంది.

అమరావతిని చంపేశామని ఎవరన్నారన్న సీఎం జగన్

అప్పట్లో కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ .. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పంపిన తీర్మానాన్ని ఉభయసభల్లోనూ ఆమోదించింది. దీనికి జూన్‌1, 1985న రాష్ట్రపతి సంతకం చేయడంతో మండలి రద్దయ్యింది. అయితే, ఆ తర్వాత తిరిగి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ పార్టీ.. మళ్లీ మండలి పునరుద్ధరణకు ప్రయత్నించింది. జనవరి 22, 1990న శాసనసభలో మర్రి చెన్నారెడ్డి ప్రభుత్వం తీర్మానం చేసింది. ఈ బిల్లు రాజ్యసభలో పాస్‌ అయినా, లోక్‌సభ రద్దు కావడంతో పెండింగ్‌లో ఉండిపోయింది. ఆ తర్వాత వచ్చిన కేంద్ర ప్రభుత్వాలేవీ ఈ బిల్లును పట్టించుకోలేదు.

3 రాజధానుల బిల్లు అమోదం, టీడీపీ ఎమ్మెల్యేలపై మండిపడిన ఏపీ సీఎం వైయస్ జగన్

మళ్లీ 2004లో ఇది తెరపైకి వచ్చింది. 2004లో ఆంధ్రప్రదేశ్‌లో వైయస్ రాజశేఖర్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక మళ్లీ మండలి పునరుద్ధరణ దిశగా అడుగులు పడ్డాయి. జులై 8, 2004న మండలి పునరుద్ధరించే తీర్మానాన్ని శాసనసభలో అప్పటి రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వం ఆమోదించింది.

రాజధానిలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ వ్యవహారంపై విచారణ

2004లో ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ నేతలకు పదవులు కల్పించాలనే ఉద్దేశ్యంతో శాసనమండలిని తిరిగి పునరుద్ధరించారు. దీనికి డిసెంబర్‌ 15, 2005న ఏపీ శాసన మండలి పునరుద్ధరణకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. డిసెంబర్‌ 20, 2005న రాజ్యసభలోనూ ఆమోదం లభించింది. దీంతో.. జనవరి 10, 2006న ఏపీ శాసన మండలి పునరుద్ధరణకు అంగీకరిస్తూ రాష్ట్రపతి సంతకం చేశారు. మొత్తానికి 1985లో రద్దైన మండలి.. మార్చి 30, 2007న తిరిగి కార్యకలాపాలు ప్రారంభించింది.

ఎంత సమయం తీసుకుంటుంది ? దేశంలో ఎన్ని రాష్ట్రాల్లో అమల్లో ఉంది ?

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్నాటక, మహారాష్ట్ర, బిహార్, ఉత్తరప్రదేశ్‌లో శాసనమండలి వ్యవస్థ ఉంది. గత ఏడాది ఆర్టికల్ 370 రద్దుతో జమ్ము కశ్మీర్‌‌లో ఉన్న అసెంబ్లీతో పాటు..కౌన్సిల్ కూడా రద్దైపోయింది. అలాగే గతంలో అస్సోం, మధ్యప్రదేశ్, పంజాబ్, తమిళనాడు, పశ్చిమబెంగాల్‌లో శాసనమండలి ఉండేది.

ఆళ్ల రామకృష్ణారెడ్డి అరెస్ట్, అధికార వికేంద్రీకరణ జరగాలంటూ ర్యాలీ, అనుమతి లేదన్న పోలీసులు

ఈ రాష్ట్రాల్లో మళ్లీ దాన్ని పునరుద్ధరించాలన్న డిమాండ్‌ ఉంది. ఇక ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, ఒడిశా, రాజస్తాన్, ఉత్తరాఖండ్‌లో ఇంతవరకూ మండలి ఏర్పాటు జరుగలేదు. అయితే.. రాజకీయ అవసరాలను సర్దుబాటు చేసుకోవడానికి మండలిని ఏర్పాటు చేయాలంటూ ఈ రాష్ట్రాలు కూడా డిమాండ్ చేస్తున్నాయి.

ఆంధ్రప్రదేశ్ శాసన మండలి రద్దు? సంచలన నిర్ణయం తీసుకోనున్న సీఎం జగన్

శాసన మండలి రద్దు ప్రాసెస్‌ నెలలో పూర్తి కావొచ్చు.. లేదంటే పదేళ్లు పట్టొచ్చు. లేదా మండలి రద్దు వారం రోజుల్లో కూడా జరగొచ్చు. ఇంత కాలం అని నిర్దిష్ట గడువని ఏం లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సయోధ్యను బట్టి అది ఆధారపడి ఉంటుంది. ఎన్టీఆర్‌ హయాంలో కేవలం నెల రోజుల వ్యవధిలోనే మండలి రద్దు చేయగలిగారు.

ఆర్టికల్ 169 ఏం చెబుతోంది ?

ఏ రాష్ట్రంలోనైనా శాసనమండలి ఏర్పాటు కావాలన్నా రద్దు చేయాలన్నా దానికి రాజ్యాంగపరమైన అనుమతి ఆర్టికల్ 169 ప్రకారం అవసరం. అయితే దీనిని రాజ్యాంగసవరణ బిల్లుగా పరిగణించరు. మండలి రద్దు లేదంటే ఏర్పాటు కావాలని కోరుతున్న రాష్ట్రాల అసెంబ్లీ తీర్మానం సరిపోతుంది. అయితే దానికి పార్లమెంట్ ఆమోదం.. ఆ తర్వాత.. రాష్ట్రపతి సంతకం కూడా తప్పనిసరి.

రాజధాని అంశంలో కీలక మలుపు

దీని ప్రకారం శాసనమండలిని ఏర్పాటు చేయడమే కాదు, రద్దు చేసే అధికారాన్ని కూడా రాజ్యాంగం శాసనసభలకే కల్పించిందని చెప్పవచ్చు. ఆర్టికల్‌ 169 (1) ప్రకారం శాసనసభ 2/3 వంతు మెజార్టీతో ప్రత్యేక తీర్మానం చేయాల్సి ఉంటుంది. ఆ తీర్మానాన్ని పార్లమెంట్‌ ఉభయ సభలు ఆమోదించిన తర్వాత.. రాష్ట్రపతి సంతకంతో అమల్లోకి వస్తుంది.

దమ్ముంటే 21మందితో రాజీనామా చేసి రెఫరెండంకి రా

మండలిని రద్దు చేయాలంటే ముందుగా శాసన సభలో తీర్మానం ప్రవేశపెట్టాలి. సభ ఆమోదించిన తీర్మానాన్ని కేంద్రానికి పంపాలి. అక్కడ ముందుగా లోక్‌సభలోనైనా రాజ్యసభలోనైనా ప్రవేశపెట్టొచ్చు. రెండు సభల్లో రద్దు తీర్మానం ఆమోదం పొందితే ఫర్వాలేదు. రెండింటిలో ఏ ఒక్క సభ తిరస్కరించినా బిల్లు మళ్లీ రాష్ట్రానికి చేరుతుంది.

అమరావతా లేక మూడు రాజధానులా..

ఇక్కడ మరోసారి శాసనసభలో తీర్మానం చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మళ్లీ కేంద్రానికి పంపించాలి. ఒకవేళ అప్పుడు లోక్‌సభ, రాజ్యసభలో ఆమోదం పొందితే అక్కడినుంచి రద్దుకు సంబందించిన ఆమోదప్రతి రాష్ట్రపతికి చేరుకుంటుంది. రాష్ట్రపతి ఆమోదముద్ర వేస్తే ఆ క్షణం నుంచి పూర్తిగా ఏపీ శాసన మండలి రద్దు కానుంది.

కేంద్రం సహకరిస్తుందా..?

ఏపీ సీఎం జగన్ శాసనమండలిని రద్దు చేయాలని భావిస్తే..ఇప్పుడు కేంద్రం సహకరిస్తుందా అనేది సస్పెన్స్ ని తలపిస్తోంది. అయితే ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సత్సంబంధాలే ఉన్నాయి. దీంతో రద్దుకి ఎక్కువ టైమ్‌ పట్టకపోవచ్చనేది విశ్లేషకుల మాట. మరోవైపు ఇప్పటికే మండలి రద్దు నిర్ణయాన్ని ప్రధాని మోడీ దృష్టికి జగన్‌ తీసుకెళ్లారని.. అందుకు ఆయన అభ్యంతరం తెలపలేదనే ఉహాగానాలు కూడా వినిపిస్తున్నాయి.

ఏపీలో హైటెన్సన్, సీఎం జగన్ ఇంటి దగ్గర భారీ బందోబస్తు

ఇదే నిజమైతే ఏపీ మండలి అతి త్వరలోనే కనుమరుగు అయినా ఆశ్చర్యపోనవసరం లేదు. అయితే ఏపీ బీజేపీ నుంచి దీనిపై వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో మండలి రద్దు నిర్ణయానికి ఏపీ బీజేపీ కేంద్రానికి తన అభ్యంతరాలను వ్యక్తం చేసే అవకాశాన్ని కూడా కొట్టి పారేయలేం.

టీడీపీ దారెటు..?

ఈ పరిస్థితులు ఇలా ఉంటే.. మండలి రద్దుకు సంకేతాలిచ్చిన జగన్‌.. నాలుగు రోజుల సమయం ఎందుకు తీసుకున్నారనేది హాట్‌ టాపిక్‌గా మారింది. వైసీపీ అధికారంలోకి వచ్చాక చాలామంది పదవులు ఆశిస్తున్నారు. వాళ్లందర్ని సంతృప్తి పరచాలంటే ఖచ్చితంగా పదవులు కట్టబెట్టాల్సిందేనని పలువురు వాదిస్తున్నారు.

ఏపీలో హైటెన్సన్, సీఎం జగన్ ఇంటి దగ్గర భారీ బందోబస్తు

అదే సమయంలో టీడీపీని ఇరకాటంలో పడేసాలా ఈ గడువు తీసుకున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఎమ్మెల్సీల్లో చాలామంది టీడీపీ సభ్యులే ఉన్నారు. ఒకవేళ రద్దు చేస్తే వాళ్లందరి పదవులు పోవడం ఖాయం. వాళ్లు యూటర్న్ తీసుకునేలా గడువు పెట్టారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఏం జరుగుతుందనే దానిపై మరి కొంత కాలం వేచి చూడక తప్పదు.