AP CM YS Jaganmohan Reddy | Photo Credits: ANI

Amaravathi, January 23:  శాసన మండలి (Andhra Pradesh Legislative Council) లో చోటు చేసుకున్న పరిణామాలు తనను ఎంతగానో బాధించాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి (CM YS Jagan) పేర్కొన్నారు. శాసనసభ (Assembly) ఆమోదించిన బిల్లులను మండలి చైర్మన్ సెలెక్ట్ కమిటీకి సూచించడం దురదృష్టకరమని అన్నారు.  కౌన్సిల్ లో బుధవారం జరిగిన పరిణామాలపై అసెంబ్లీలో గురువారం చర్చ జరిగింది. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ 2019 ఎన్నికల్లో 175 స్థానాలకు గాను 151 స్థానాలు గెలిచాం, ప్రజల మాటే వేదంగా అసెంబ్లీలో అడుగుపెట్టాం. ప్రజల చేత, ప్రజల యొక్క ప్రజల కొరకు ఏర్పడిన ప్రభుత్వం తమదని జగన్ అన్నారు. ఏడున్నర నెలలుగా ప్రజల సంక్షేమం కోసమే కష్టపడుతున్నాం. అవినీతికి అడ్డుకట్ట వేయడానికే అధికారం ఉపయోగించాం. చట్ట సభల్లో భాగమైన శాసనమండలి చట్టబద్ధంగా వ్యవహరిస్తుందని నమ్మాం. కానీ నిన్న జరిగిన పరిణామాలు దాన్ని వమ్ము చేశాయి.  వైఎస్ జగన్ వ్యూహాత్మక తప్పిదం, చంద్రబాబు చిరునవ్వులు, ఇక ముందు జరగబోయేదేమిటి

అసెంబ్లీలో ఆమోదం పొందిన 'వికేంద్రీకరణ బిల్లు' మండలిలో చర్చించి దానిని ఆమోదించవచ్చు లేదా తిరస్కరించవచ్చు కానీ చంద్రబాబు ఆదేశాలతో చైర్మన్ దానిని సెలెక్ట్ కమిటీకి పంపడం చట్టవిరుద్ధం. చైర్మన్ తనకు లేని విచక్షణాధికారాన్ని వినియోగించి ప్రజాస్వామ్యానికి విలువ లేకుండా చేశారు. నిస్పక్షపాతంగా మండలి కొనసాగే అవకాశాలు లేవు. ఇక ముందు మండలి కొనసాగింపుపై విస్తృతమైన చర్చ జరగాల్సి ఉందని సీఎం జగన్ నొక్కి చెప్పారు. నిస్పక్షపాతంగా మండలి కొనసాగే అవకాశాలు లేవు. ఇక ముందు మండలి కొనసాగింపుపై విస్తృతమైన చర్చ జరగాల్సి ఉందని సీఎం జగన్ నొక్కి చెప్పారు.

రాష్ట్రానికి కౌన్సిల్ యొక్క అవసరాన్ని సీఎం ప్రశ్నించారు, ఇది సంవత్సరానికి 60 కోట్ల ప్రజా ధనాన్ని ఖర్చు చేస్తుంది.  దేశంలోని 28 రాష్ట్రాల్లో కేవలం ఆరు రాష్ట్రాల్లో మాత్రమే శాసన మండళ్లు ఉన్నాయని చెప్పారు. మండలి కొనసాగింపుపై సోమవారం చర్చించాలని జగన్ అన్నారు. ఇటు డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్ కూడా సీఎం మాటలతో ఏకీభవించారు. చైర్మన్ స్థానంలో ఉన్నవారే చట్టాలను ఉల్లంఘిస్తే ఎవరికి చెప్పుకోవాలని సభలో ప్రశ్నించారు. మండలిని రద్దు చేయాలని ఆయన ప్రతిపాదించారు.   వీధిరౌడీలను ఏరివేస్తే గానీ వ్యవస్థ మారదు. -సీఎం జగన్

అసెంబ్లీలో గురువారం జరిగిన చర్చను బట్టి చూస్తే సోమవారం రోజే అసెంబ్లీలో శాసనమండలి రద్దుకు తీర్మానం చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది.