Amaravati, January 22: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మూడో రోజు సమావేశాలు (AP Assembly Session) బుధవారం కొనసాగుతున్నాయి. అయితే శాసన సభలో చర్చ సందర్భంగా టీడీపీ సభ్యులు (TDP MLAs) వ్యవహరించిన తీరు పట్ల స్పీకర్ తమ్మినేని సీతారాంతో పాటు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి (CM YS Jagan) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు భరోసాపై సభలో చర్చ జరుగుతుండగా టీడీపీ ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియంను చుట్టుముట్టి ఆందోళన చేశారు. పోడియం పైకి ఎక్కి 'జై అమరావతి, 'ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్లాలి' అంటూ నినాదాలు చేశారు.
అయితే సభలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం పట్ల సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రజాస్వామ్యాన్ని టీడీపీ అపహాస్యం చేస్తుంది. స్పీకర్‌నూ టీడీపీ అగౌర పరుస్తుంది. సంస్కారం లేని టీడీపీ సభ్యులు సభకు ఎందుకు వస్తున్నారో అర్థం కాదు. వారు పది మంది ఉన్నారు. రౌడీల్లా వ్యవహరిస్తున్నారు. ఇలాంటి వీధి రౌడీలను ఏరివేయకపోతే వ్యవస్థ మారదు అంటూ జగన్ ఫైర్ అయ్యారు.
తమ 151 మంది ఎమ్మెల్యేలు ఓపికగా ఉంటే, 10 మంది టీడీపీ ఎమ్మెల్యేలు పోడియం వద్దకు వస్తున్నారు. ప్రజా సమస్యలపై చర్చించడం టీడీపీ సభ్యులకు ఇష్టం లేదు, సలహాలు ఇవ్వకుండా సమస్యలు సృష్టిస్తున్నారు. అనవసర కామెంట్లు చేస్తూ, రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తే ఎలా? మళ్ళీ తమ పైనే దాడి చేస్తున్నారంటూ టీడీపీ అనుకూల మీడియాలో దిక్కుమాలిన వార్తలు రాసుకుంటారు. టీడీపీ ఒక దిక్కుమాలిన పార్టీ అని ధ్వజమెత్తారు. 3 రాజధానుల బిల్లుకు ఏపీ అసెంబ్లీ అమోదం
అనంతరం అమరావతిలో ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగింది అంటూ మంత్రి సుచరిత ఇచ్చిన తీర్మానంపై చర్చ జరిగింది. అమరావతిలో 4,070 ఎకరాలలో ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగిందని మంత్రి పేర్కొన్నారు. దీనిపై సమగ్ర విచారణకు ప్రభుత్వం ఆదేశిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ శాసన మండలి రద్దు, నిర్ణయం తీసుకున్న జగన్
కాగా, సభలో వైసీపీ ఎమ్మెల్యేలు తమపై భౌతిక దాడులకు దిగుతున్నారు, సీఎం జగనే స్వయంగా వారిని ప్రోత్సహిస్తున్నారు. స్పీకర్ కూడా ఏం చేయడం లేదంటూ టీడీపీ సభ్యులు గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు.