Amaravathi, January 21: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ (Andhra Pradesh Assembly) సమీపంలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యేలను(TDP MLSs) సస్పెండ్ చేసిన తర్వాత.. మార్షల్స్ బలవంతంగా వారిని బయటకు తీసుకొచ్చారు. దీంతో అసెంబ్లీ గేటు ( Assembly Gate) దగ్గర టీడీపీ ఎమ్మెల్యేలు నిరసన తెలపగా అధినేత చంద్రబాబు(Chandrababu Naidu) కూడా మద్దతిచ్చారు.
అనంతరం అక్కడి నుంచి ఎమ్మెల్యేలతో కలిసి జగన్(YS Jagan) కాన్వాయ్ ముందు బైఠాయించగా వారిని అడ్డుకున్నారు. తర్వాత రైతులకు(Farmers) సంఘీభావం తెలిపేందుకు చంద్రబాబు, టీడీపీ ఎమ్మెల్యేలు కలిసి పాదయాత్రగా అసెంబ్లీ నుంచి మందడం బయల్దేరారు. కొద్ది దూరం వెళ్లిన తర్వాత అనుమతి లేదని పోలీసులు అడ్డుకున్నారు.
మందడంలో 144 సెక్షన్, పోలీస్ యాక్ట్ 30 యాక్ట్ అమల్లో ఉందని చెప్పారు. పాదయాత్రకు అనుమతి లేదని చెప్పారు. తర్వాత చంద్రబాబుతో పాటూ ఎమ్మెల్యేలను పోలీసులు అరెస్ట్ చేసి మంగళగిరి పోలీస్ స్టేషన్ కి తరలించారు.
Here's ANI Tweet
#UPDATE Andhra Pradesh: Telugu Desam Party (TDP) Chief N Chandrababu Naidu, who was detained outside the state assembly has been released in Mangalagiri town. Chandrababu Naidu, along with his convoy has left for his residence. https://t.co/YYrZmPWIBF pic.twitter.com/elk5eNy7M5
— ANI (@ANI) January 20, 2020
నిన్న మూడు రాజధానుల బిల్లుపై ఏపీ అసెంబ్లీలో హాట్ హాట్‌గా చర్చ జరిగింది. ప్రతిపక్ష, అధికార పక్ష సభ్యుల మధ్య మాటల తూటాలు పేలాయి. ప్రతిపక్ష సభ్యులు, అధికారపక్ష సభ్యులు మాట్లాడిన అనంతరం సీఎం జగన్ మాట్లాడారు. అంతకంటే ముందు..బాబు సుదీర్ఘంగా మాట్లాడడంపై జగన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. అనంతరం బాబు మైక్‌ను కట్ చేశారు స్పీకర్. దీంతో సీఎం జగన్ మాట్లాడేందుకు ప్రయత్నించారు.
ఆంధ్రప్రదేశ్ శాసన మండలి రద్దు?
దీనికి టీడీపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ..పోడియం ఎదుట ఆందోళనకు దిగారు. మార్షల్ పిలిచి సభ్యులను బయటకు పంపించాలని సీఎం జగన్ సూచించారు. ఏపీ మంత్రి బుగ్గన మార్షల్‌ను పిలిపించారు. మూడు రాజధానులు వద్దు..అమరావతే ముద్దు..అంటూ నినాదాలు చేశారు. ఆందోళన సద్దుమణగకపోవడంతో వారిని 17 మంది సభ్యులను ఒకరోజు సస్పెన్షన్ చేస్తున్నట్లు మంత్రి బుగ్గన ప్రతిపాదించారు. ఒక రోజు సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ వెల్లడించారు.
దమ్ముంటే 21మందితో రాజీనామా చేసి రెఫరెండంకి రా
సస్పెన్షన్ అయిన ఎమ్మెల్యేలు
అచ్చెన్నాయుడు, కరణం బలరాం, నిమ్మల రామానాయుడు, ఆదిరెడ్డి భవాని, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, చిన రాజప్ప, వెంకటిరెడ్డి నాయుడు, వాసుపల్లి గణేశ్, జోగేశ్వరరావు, పయ్యావుల కేశవ్, గద్దె రామ్మోహన్, వెలగపూడి రామకృష్ణ, అనగాని సత్యప్రసాద్, ఏలూరు సాంబశివరావు, గొట్టిపాటి రవి, మంతెన రామరాజు, బాల వీరాంజనేయ స్వామి.
ఇదిలా ఉంటే టీడీపి చేస్తున్న ఆందోళనను వైసీపీ సభ్యులు ఖండించారు. సీఎం జగన్ ప్రసంగం ప్రజలకు తెలియకుండా నాటకాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఐదు మంది టీడీపీ సభ్యులు మాట్లాడారని, బాబు గంటన్నరసేపు మాట్లాడారనే విషయాన్ని గుర్తు చేశారు. తమ పార్టీకి 151 మంది ఎమ్మెల్యేలుంటే..కేవలం 7 మంది సభ్యులు మాత్రమే మాట్లాడరని తెలిపారు. సభలో జరిగిన దానిపై బాబు క్షమాపణలు చెప్పాలని మంత్రి అనీల్ డిమాండ్ చేశారు .