Amaravathi, January 20: ఏపీ రాజధాని(AP Capital) విషయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. రాజధాని అంశంపై హై పవర్ కమిటీ (High Power Committee)నివేదిక నివేదికను అందజేసింది. హై పవర్ కమిటీ నివేదికకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం(AP Cabinet) ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి (CM YS Jagan)అధ్యక్షతన సమావేశమైన కేబినెట్ భేటీ కొద్దిసేపటి క్రితం ముగిసింది.
అయిదు అంశాలపై చర్చించిన మంత్రివర్గం... పరిపాలనా వికేంద్రీకరణ, అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధి బిల్లుపై చర్చించి ఆమోద ముద్ర వేసింది. అలాగే రాజధాని రైతుల పరిహారంపై Amaravathi Farmers)కూడా కేబినెట్‌లో జరిగింది. కాగా సీఆర్‌డీఏ రద్దు (CRDA Cancel), వికేంద్రీకరణ బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది.
అమరావతా లేక మూడు రాజధానులా..?,కీలక ఘట్టానికి వేదిక కానున్న ఏపీ అసెంబ్లీ
ఈ సందర్భంగా రైతులకు ఇచ్చే పరిహారాన్ని పెంచుతూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. రూ.2500 నుంచి రూ.5000కు పరిహారం పెంచుతూ, 10 ఏళ్ల నుంచి 15 ఏళ్ల వరకూ ఇవ్వాలని నిర్ణయించింది.
CMO Andhra Pradesh Tweet
ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన సోమవారం సచివాలయంలో మంత్రివర్గం సమావేశమైంది. ఈ భేటీలో అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నబిల్లులు, అభివృద్ధి, పాలన వికేంద్రీకరణలో భాగంగా రాష్ట్రంలోని 13 జిల్లాల సమగ్రాభివృద్ధికి ఉద్దేశించిన బిల్లులపై చర్చ జరిగింది. pic.twitter.com/lqbxFOYC1s
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) January 20, 2020
అలాగే రాష్ట్రంలో11వేలకు పైగా రైతు భరోసా కేంద్రాల ఏర్పాటుకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక సీఆర్‌డీఏను అమరావతి మెట్రో పాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథార్టీగా మార్చుతూ నిర్ణయం తీసుకుంది.
అసెంబ్లీ ముట్టడికి అమరావతి జేఏసీ పిలుపు
ఈ సమావేశంలో శాసన రాజధానిగా అమరావతిని, జ్యుడిషియల్ రాజధానిగా కర్నూలును, ఎగ్జిక్యూటివ్ రాజధానిగా విశాఖపట్నంను కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకరణ అన్ని చోట్లా జరగాలని అందుకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నామని ఏపీ క్యాబినెట్ తెలిపింది.
Here's ANI Tweet
#AndhraPradesh Cabinet approves four bills to be placed in the House. The cabinet also gives nod to the recommendations of the high power committee on state's all round development and decentralization of governance. pic.twitter.com/e6TyoOh249
— ANI (@ANI) January 20, 2020
భారీ బందోబస్తు మధ్య ఏపీ ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు
మంత్రివర్గం భేటీ అనంతరం స్పీకర్ అధ్యక్షతన జరిగిన బీఏసీ సమావేశానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, చీఫ్ విప్ శ్రీకాంత్‌రెడ్డి, ఇక టీడీపీ తరఫున ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు హాజరయ్యారు. మూడు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని బీఏసీ సమావేశంలో నిర్ణయం జరిగింది.
కాగా ఈ సమావేశంలో అధికార విపక్షాల మధ్య వాడివేడి చర్చ జరిగింది. ఈ సందర్భంగా ప్రభుత్వ నిర్ణయాన్ని అడ్డుకున్న టీడీపీ... సీఆర్డీఏ రద్దుకు అంగీకరించబోమని స్పష్టం చేసింది. దీంతో, అభివృద్ధి వికేంద్రీకరణకు మీరు వ్యతిరేకమా? అని వైసీపీ ప్రశ్నించింది.ఈ సమావేశానికి స్పీకర్ తమ్మినేని సీతారాం అధ్యక్షత వహించారు.