Amaravathi, January 20: రాజధాని అంశం(AP Capital) ఏపీలో తీవ్ర ఉత్కంఠను రేపుతోంది. ఈ నేపథ్యంలో అమరావతిలో(Amaravathi) టెన్షన్ వాతావరణం నెలకొంది. ఓవైపు పోలీసులు, మరోవైపు జేఏసీ (Amaravathi JAC) నేతలు, ఇంకోవైపు రైతులు.. ఇలా అమరావతిలో ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్నాయి.
ఏపీ ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు (andhra assembly special session) మరి కొద్ది సేపట్లో ప్రారంభం కానున్న నేపథ్యంలో..మూడు రాజధానులపై జగన్ ప్రభుత్వం నేడు అధికారిక ప్రకటన చేస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ముందు కేబినెట్ భేటీ, ఆ తర్వాత అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో మరోవైపు అసెంబ్లీ ముట్టడికి అమరావతి జేఏసీ పిలుపునిచ్చింది. దీంతో అమరావతి ప్రాంతం పోలీసుల పహారాలో ఉంది.
ప్రభుత్వం ఆదేశాలతో పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. అసెంబ్లీ, సచివాలయం దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. అదే సమయంలో ఆర్టీసీ బస్సులు (APSRTC Buses) రద్దు చేయాలని పోలీసులు ఆదేశించారు. పోలీసుల ఆదేశాల మేరకు విజయవాడ నుంచి గుంటూరు వెళ్లే బస్సులను ఆర్టీసీ అధికారులు రద్దు చేశారు.
ఏపీలో హైటెన్సన్, సీఎం జగన్ ఇంటి దగ్గర భారీ బందోబస్తు, తేలిపోనున్న ఏపీ రాజధాని వ్యవహారం
పోలీసులు ఆదేశాలతోనే రద్దు చేశామని తెలిపారు. తదుపరి ఆదేశాలు వచ్చాకే బస్సులను పునరుద్ధరిస్తామని ఆర్టీసీ అధికారులు తెలిపారు. అసెంబ్లీ ముట్టడి ఉన్నందును ఆర్టీసీ బస్సులను అమరావతికి ఈ రోజు నిలిపివేయాలని పోలీసులు సూచించినట్లుగా తెలుస్తోంది.