Amaravathi, January 20: గత కొద్ది కాలంగా ఏపీలో(Andhra Pradesh) ప్రకంపనలు రేపుతున్న ఏపీ రాజధాని (AP Capital)వ్యవహారం తుది దశకు చేరింది. నేడు రాజధానిపై అటు క్యాబినెట్ భేటీ, ఇటు అసెంబ్లీలో(Assembly) అమోదం వంటి కీలక విషయాలకు ముహుర్తం ఫిక్స్ అయింది. సోమవారం ఉదయం 9 గంటలకు కేబినెట్ సమావేశం(Cabinet Meeting) నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో బిల్లుపై చర్చించి.. మంత్రివర్గంలో ఆమోదించనున్నారు. పాలన వికేంద్రీకరణ బిల్లును ఉభయ సభల్లో ప్రవేశపెట్టి.. ఆమోదం పొందేందుకు అధికారపక్షం రెడీ అయినట్లుగా తెలుస్తోంది.
అమరావతిలో జరిగిన నిరసనలపై పోలీసుల తీరును తప్పుబట్టిన హైకోర్టు
కేబినెట్ సమావేశం తర్వాతఉదయం 10 గంటలకు బీఏసీ సమావేశం(BAC Meeting) జరుగుతుంది. 11 గంటలకు అసెంబ్లీ (Assembly Special Session)మొదలవుతుంది.. సభలో ఈ పాలనా వికేంద్రీకరణ బిల్లు ప్రవేశపెట్టనున్నారు. బిల్లుపై చర్చించే అవకాశం ఉంది.ప్రభుత్వం కూడా పరిస్థితులకు తగ్గట్లుగా మూడు రోజుల పాటూ అసెంబ్లీ నిర్వహించే అవకాశం కనిపిస్తోంది.
Here's ANI Tweet
#AndhraPradesh: Heavy security presence at Prakasam Barrage in Vijawada; Section 144 of CrPc imposed in Vijaywada and Guntur areas to facilitate smooth functioning of the State Assembly and movement of public representatives. pic.twitter.com/6PbMc2qshx
— ANI (@ANI) January 20, 2020
విద్యార్థులకు శుభవార్త, 'అమ్మ ఒడి' పథకాన్ని ప్రారంభించిన ఏపీ సీఎం జగన్
కాగా అమరావతి పరిరక్షణ జేఏసీ ఛలో అసెంబ్లీకి పిలుపునిచ్చింది. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.. ఎలాంటి అనుమతులు లేవని.. 144 సెక్షన్, 30 యాక్ట్ అమల్లో ఉన్నాయని చెబుతున్నారు. అంతేకాదు రైతులు, విపక్ష పార్టీల నేతలకు ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. ర్యాలీలు, ఆందోళనలు, నిరసనలకు అనుమతులు లేవని.. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. టీడీపీ నేతల్ని రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు ముందస్తుగానే హౌస్ అరెస్ట్ చేశారు. ఇదిలా ఉంటే ఎన్ని అరెస్ట్‌లు చేసినా.. అసెంబ్లీని ముట్టడిస్తామని విపక్ష పార్టీలు, జేఏసీ నేతలు చెబుతున్నారు.
మా బతుకులకే గ్రహణం పట్టింది'! అమరావతి ప్రాంతంలో కొనసాగుతున్న నిరసనలు
ఇటు అమరావతి ప్రాంతంలో హైటెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. రాజధాని గ్రామాల్లో భారీగా పోలీసుల్ని మోహరించారు.. దాదాపు 5వేలమంది పోలీసులతో భద్రత కల్పిస్తున్నారు. సెక్రటేరియట్, అసెంబ్లీ దగ్గర సెక్యూరిటీని కట్టుదిట్టం చేశారు. ముఖ్యమంత్రి జగన్ కాన్వాయ్ వెళ్లే దారిలో కూడా పోలీసుల్ని భారీగా మోహరించారు. ఇటు ప్రకాశం బ్యారేజీపైన కూడా ఆంక్షలు విధించారు.. ప్రభుత్వ ఉద్యోగులు తప్ప ఎవర్నీ అనుమతించేది లేదని విజయవాడ సీపీ ద్వారకా తిరుమలరావు ప్రకటించారు.
దమ్ముంటే 21మందితో రాజీనామా చేసి రెఫరెండంకి రా
శాసనసభ గౌరవం, ప్రతిష్టకు భంగం కలిగించేందుకు ప్రయత్నిస్తే రాజ్యాంగం మేరకు కఠినచర్యలు తీసుకుంటామని శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం హెచ్చరించారు. సభ ముట్టడికి గానీ.. సభకు హాజరయ్యే సభ్యుల్ని అడ్డుకునేందుకు గానీ ప్రయత్నించేవారిని ఏమాత్రం ఉపేక్షించమని స్పష్టం చేశారు. శాసనసభ నియమావళి 354, 355, 356 ప్రకారం ఆగంతకులు సభా ప్రాంగణంలోకి ప్రవేశించడం, సభా కార్యక్రమాలను అడ్డుకునేందుకు యత్నించడం వంటివి శిక్షార్హమైన నేరాలని చెప్పారు. అలాంటి చర్యలకు పాల్పడేవారికి జైలుశిక్ష పడ్డ ఉదంతాలు ఉన్నాయని తమ్మినేని తెలిపారు.
ఆళ్ల రామకృష్ణారెడ్డి అరెస్ట్, అధికార వికేంద్రీకరణ జరగాలంటూ ర్యాలీ, అనుమతి లేదన్న పోలీసులు
అసెంబ్లీ ముట్టడికి అమరావతి జేఏసీ పిలుపునివ్వడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. ప్రస్తుతం అమరావతి ప్రాంతం పోలీసుల భద్రతా వలయంలో ఉంది. నగరంలో 2వేల 500 మంది పోలీసులు పహారా కాస్తున్నారు. సీఎం జగన్ (CM YS Jagan)కాన్వాయ్ వెళ్లేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సీఎం నివాసం (CM House) నుంచి సచివాలయం వరకు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
జీఎన్ రావు,బీసీజీ రిపోర్టులను భోగి మంటల్లో తగలబెట్టిన చంద్రబాబు
ఇదిలా ఉంటే టీడీఎల్పీ( TDLP) సమావేశానికి ఐదుగురు ఎమ్మెల్యేలు గైర్హాజరయ్యారు. ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాస్, వాసుపల్లి గణేష్, అశోక్, అనగాని, భవాని సమావేశానికి హాజరు కాలేదు. వ్యక్తిగత కారణాలతో సమావేశానికి రాలేకపోయామని గైర్హాజరైన నేతలు చెప్పారు.శాసన మండలిలో తమకున్న బలాన్ని సద్వినియోగం చేసుకోవడంపై టీడీపీ (TDP)అధిష్టానం దృష్టి పెట్టింది. శాసన మండలిలో టీడీపీ ఎమ్మెల్సీల సంఖ్యా బలం ఎక్కువగా ఉంది కాబట్టి రాజధానిపై ప్రభుత్వం ఏ విధంగా వెళ్లినా అడ్డుకునేందుకు టీడీపీ వ్యూహ రచన చేస్తోంది. పలువురు న్యాయ నిపుణులతో ఈ అంశంపై చర్చిస్తున్నారు.
కొత్త బాస్ వచ్చేశాడు, సీబీఐ జేడీగా మనోజ్ శశిధర్, 1994 గుజరాత్ కేడర్ ఐపీఎస్ అధికారి
ఒక రాష్ట్రం.. ఒకే రాజధాని అన్న దిశగా అసెంబ్లీలో తమ వాదన బలంగా వినిపించాలని టీడీపీ నిర్ణయించింది. రాజధానిని అమరావతి నుంచి మార్చడానికి ప్రభుత్వం తీసుకొచ్చే ప్రతిపాదనల్ని గట్టిగా వ్యతిరేకించేందుకు సిద్ధమైంది. ప్రాంతాలకు అతీతంగా పార్టీ ఎమ్మెల్యేలందరూ ఇదే వాణిని వినిపించాలని చంద్రబాబు (Chandrababu)దిశానిర్దేశం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి కొనసాగాలని తెలుగుదేశం పార్టీ శాసనసభాపక్ష సమావేశం తీర్మానించింది. రాజధాని మార్పు నిర్ణయాన్ని ఆపడానికి సర్వశక్తులూ ఒడ్డాలని నిర్ణయించింది.