Amaravathi, January 13: వైసీపీ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిని(YSRCP MLA Alla Ramakrishna Reddy) పోలీసులు అరెస్ట్ చేశారు. అధికార వికేంద్రీకరణ జరగాలని కోరుతూ వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే(MLA RK) మంగళగిరిలో ర్యాలీని చేయాలని నిర్ణయించారు. మంగళగిరి (Mangalagiri) నుంచి తాడేపల్లిలోని(Tadepalli) ముఖ్యమంత్రి జగన్ (CM Jagan)నివాసం వరకూ ర్యాలీ చేసేందుకు సిద్ధమయ్యారు. పెద్దయెత్తున వైసీపీ శ్రేణలు మంగళగిరికి చేరుకున్నాయి. అయితే పోలీసులు ర్యాలీకి అనుమతి లేదని చెప్పారు. అయినా ర్యాలీకి ఆళ్ల రామకృష్ణారెడ్డి సిద్దమవడంతో పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు.
రాష్ట్రంలో అధికార వికేంద్రీకరణ జరిగి, సమగ్ర అభివృద్ధి జరగాలని కోరుతూ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే) ఆధ్వర్యంలో సోమవారం గుంటూరు జిల్లా పెనుమాక నుంచి తాడేపల్లి భారతమత విగ్రహం వారకు భారీ ర్యాలీ తలపెట్టారు. ర్యాలీలో పాల్గొనేందుకు భారీ సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. అభివృద్ధి కావాలి.. వికేంద్రీకరణ జరగాలి అంటూ పెద్ద ఎత్తున ప్లకార్డులు ప్రదర్శించారు. అధికార వికేంద్రీకరణకు మద్దతుగా నినాదాలు చేశారు. అయితే నిషేధాజ్ఞలు ఉన్నందున ర్యాలీకు అనుమతి లేదని పోలీసులు అంటున్నారు.
చంద్రబాబుకు బిగిస్తున్న ఉచ్చు, వైసీపీ ఎంపీ లేఖపై స్పందించిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా
ర్యాలీ నేపథ్యంలో భారీగా పోలీసులను మొహరించారు. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యే ఆర్కేను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. ఆయనకు మద్దతుగా వచ్చిన మహిళలు, నాయకులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిని విడుదల చేయాలని కోరుతూ వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, స్థానికులు పెద్ద ఎత్తున పోలీస్ స్టేషన్‌కు చేరుకుంటున్నారు.
అమరావతిలో భూమి విలువ కోటీ నుంచి రూ.10 లక్షలకు పడిందన్న చంద్రబాబు
కాగా, రాష్ట్రంలో పాలన, అభివృద్ధి వికేంద్రీకరణకు మద్దతుగా ఓ వైపు, అలాగే అమరావతి రాజధానిగా మరో వైపు రాష్ట్రవ్యాప్తంగా ప్రదర్శనలు, ర్యాలీలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే రాజధాని అమరావతితో పాటు విశాఖపట్నం, కర్నూలులను రాజధానిగా మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి నిరసనగా ప్రధాన ప్రతిపక్ష పార్టీ టిడిపి కొంతకాలంగా నిరసన వ్యక్తం చేస్తోంది.