AP Capital-Political Stir: అమరావతిలో భూమి విలువ కోటీ నుంచి రూ.10 లక్షలకు పడిందన్న చంద్రబాబు, బాబుకు సలహాలిచ్చేది చిట్టినాయుడే అంటున్న విజయసాయి రెడ్డి, తిరుపతిలో చంద్రబాబు ర్యాలికి అనుమతిని నిరాకరించిన పోలీసులు, రాజధానిపై కొనసాగుతున్న సస్పెన్స్
Mp vijaya sai reddy and chandra babu (photo-Facebook)

Amaravathi, January 11: రాజధాని అంశం (Ap Capital Issue) మీద ఓ పక్క నిరసనలు, మరో పక్క స్వాగతిస్తూ ర్యాలీలు జరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం (AP GOVT)నుంచి ఏపీ రాజధాని అంశంపై ఇంకా అధికారికంగా ఎటువంటి ప్రకటన రాలేదు. అయితే ఎవరికి వారు తమ అబిప్రాయాలతో ఏపీలో (AP) వేడిని పుట్టిస్తున్నారు.

టీడీపీ నేతలు (TDP) అమరావతే రాజధానిగా (Amraravathi) ఉండాలంటూ ధర్నాలు నిరసనలు చేస్తుంటే దీనికి భిన్నంగా వైసీపీ నేతలు(YSRCP) మూడు రాజధానులకు (3 Capitals) అనుకూలంగా ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ రాజధానిపై (AP Capital) సస్పెన్స్ అలాగే కొనసాగుతోంది. మరి రాజధానిపై ఎవరు ఏం అంటున్నారో ఓ సారి పరిశీలిస్తే..

ఏపీ సీఎం చంద్రబాబు

ఏపీలో తుగ్లక్ పాలన నడుస్తోందని రాష్ట్రానికి మూడు రాజధానులు కావాలని ఎవరైనా అడిగారా అని చంద్రబాబు(Chandra babu) ప్రశ్నించారు. రాష్ట్రం ఏమైనా వైసీపీ వాళ్ల బాబు జాగీరా, వైసీపీ సర్కార్ ఖబర్దార్ అంటూ హెచ్చరించారు. రాజధాని అంటే పేకాటలో మూడు ముక్కలాట అనుకున్నారా అంటూ మండిపడ్డారు చంద్రబాబు. జీవితంలో తొలిసారిగా అమరావతి కోసం జోలె పట్టానని, వైసీపీ పాలన చూస్తుంటే రక్తం మరిగిపోతోందని చంద్రబాబు మండిపడ్డారు.

తొలిసారిగా అమరావతి కోసం జోలె పట్టాను : చంద్రబాబు

రాజమహేంద్రవరంలో అమరావతి పరిరక్షణ సమితి సభలో మాట్లాడుతూ.. కోటి విలువైన భూమిని రూ.10లక్షలకు పడిపోయేలా చేసిన పెద్దమనిషి జగన్‌ అంటూ విరుచుకుపడ్డారు. అందరికీ ఆమోదయోగ్యమైన రాజధాని అమరావతిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందని అన్నారు. వైసీపీకి చెందిన 151 మంది ఎమ్మెల్యేలనూ తానొక్కడినే ఎదుర్కోగలనని.. జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.

వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి

టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేశ్‌పై వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ( YSRCP MP Vijaya sai reddy)వ్యంగ్యాస్త్రాలు సంధించారు. చంద్రబాబు నాయుడి ముఖ్య సలహాదారు చిట్టి నాయుడే అయి ఉంటాడని అనుకుంటున్నారంతా. గాజులు, ఉంగరాల సేకరణ నుంచి జోలె పట్టుకునే దాకా రాజు గారి దేవతా వస్త్రాల కథ గుర్తుకొస్తోంది. తుపాన్లతో వేల కోట్ల నష్టం వాటిల్లినప్పుడు సైతం చేతులు చాపని వ్యక్తి ఇంతగా రగిలి పోవడం అలాగే అనిపించట్లేదూ?' అంటూ ట్విటర్‌ వేదకగా విజయసాయిరెడ్డి విమర్శించారు.

Here's Vijayasai Reddy  Tweet

 

మరో ట్వీట్‌లో.. 'చంద్రబాబు నాయుడి స్వభావం మొదటి నుంచి అంతే. ప్రజా ధనాన్ని తన సొత్తు అన్నట్టుగా అడ్డగోలుగా లూటీ చేస్తాడు. అడ్డం తన్నగానే తన బాధ ప్రజల బాధగా చిత్రీకరిస్తాడు. ఎల్లో మీడియా మోత మోగించే రోజుల్లో అయితే ఆడింది ఆటగా సాగేది? సోషల్ మీడియా సూర్యుడు పొడిచాక చీకటి చుక్కలు అదృశ్యమయ్యాయి' అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

తిరుపతి ర్యాలీకి నిరాకరణ

ఇదిలా ఉంటే తిరుపతి చంద్రబాబు ర్యాలీకి అనుమతి లేదంటున్నారు పోలీసులు. సంక్రాంతి పండుగ సీజన్‌ కావడంతో ర్యాలీకి అనుమతి ఇవ్వలేమని తిరుపతి అర్బన్‌ ఎస్పీ చెబుతున్నారు. మరోవైపు పోలీసులు చంద్రబాబు పర్యటన నేపథ్యంలో తిరుపతిలో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ఏర్పాట్లు చేశారు. జిల్లా వ్యాప్తంగా పలువురు టీడీపీ నేతల్ని సైతం హౌస్ అరెస్ట్ చేశారు. జిల్లాలో పలువురు తెదేపా నేతలను గృహనిర్బంధంలో ఉంచారు.

అఖిల భారత హిందూ మహాసభ ప్రతినిధులు లేఖ

ప్రధాని మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు అఖిల భారత హిందూ మహాసభ ప్రతినిధులు లేఖ రాశారు. రాజధానులను మార్చడం ద్వారా సీఎం జగన్ విపరీత పోకడలకు నాంది పలికారని తెలిపారు. రైతులు, మహిళలు, చిన్నారులు తమ నిరసనలను తెలుపుతున్నారని పేర్కొన్నారు.

అమరావతిని అంగుళం కూడా కదల్చలేరు, బీజేపీ ఎంపీ సుజనా చౌదరి 

పోలీసులు, ఇతర వ్యవస్థలతో జగన్ ఆధిపత్య ధోరణిని ప్రదర్శిస్తున్నారని చెప్పారు. ఈ వేధింపులను అడ్డుకునేందుకు, ప్రజలు ఆకాంక్షలను నెరవేర్చేందుకు ఒక పరిశీలన బృందాన్ని కేంద్రం నుంచి పంపాలని అభ్యర్థించారు.

25వరోజుకు చేరిన నిరసనలు

మూడు రాజధానులు వద్దు... అమరావతే ముద్దు... అంటూ రాజధాని అమరావతిలో నిరసనలు 25వ రోజుకు చేరుకున్నాయి. నేటి నిరసన దీక్షలో భాగంగా రాజధాని గ్రామాల్లోని ఎస్సీ, ఎస్టీ రైతులు బైక్ ర్యాలీ నిర్వహించబోతున్నారు. మందడం నుంచి విజయవాడలోని గుణదల వరకు ర్యాలీకి సిద్ధమయ్యారు.

అమరావతిలో ఉద్రిక్తత, మహిళలపై లాఠీచార్జ్

అయితే... ర్యాలీలకు అనుమతి లేదంటున్నారు పోలీసులు. 144 సెక్షన్ అమలులో ఉన్నందున నిరసనలు, ఆందోళనలు, ర్యాలీలు జరపవద్దని సూచిస్తున్నారు. ముందుజాగ్రత్తగా అమరావతి గ్రామాలన్నింటిలో భారీగా పోలీసులను మోహరించారు. బైక్‌ ర్యాలీని అడ్డుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు.

నిజ నిర్ధారణ కమిటీ

రేఖాశర్మ నేతృత్వంలోని ఫాక్ట్ ఫైండింగ్ కమిటీ (నిజ నిర్ధారణ కమిటీ) ఇవాళ(11 జనవరి 2020) అమరావతిలో పర్యటన చెయ్యబోతుంది. ఇదే విషయాన్ని ఆమె ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. రాజధానిని తరలించవద్దంటూ ఆందోళన చేస్తున్న మహిళలపై పోలీసుల దాడిని జాతీయ మహిళా కమిషన్‌ (ఎన్‌సిడబ్ల్యు) సీరియస్‌గా తీసుకున్నది. మహిళలను టచ్‌ చేసే అధికారం ఎవరిచ్చారని ఆమె ప్రశ్నిస్తున్నారు.

రాజమండ్రిని 4వ రాజధానిగా చేయమన్న మంత్రి చెరుకువాడ 

మూడు రాజధానులకు అనుకూలంగా ర్యాలీలు

ఇదిలా ఉంటే మూడు రాజధానులకు అనుకూలంగా వైసీపీ శ్రేణులు అలాగే మిగిలిన 11 జిల్లాల వాసులు ర్యాలీలు నిర్వహిస్తున్నారు. విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా చేయడం ద్వారా ఉత్తరాంధ్ర అభివృద్ధికి బాటలు వేయాలన్న నినాదాలు ఉత్తరాంధ్రలో హోరెత్తాయి.

అనుకూలంగా ర్యాలీ

 

పాలన వికేంద్రీకరణతోనే అన్ని ప్రాంతాల అభివృద్ధి సాధ్యమన్న శివరామకృష్ణన్, జీఎన్‌రావు కమిటీలు, బోస్టన్‌ కన్సల్టింగ్‌ గ్రూప్‌ నివేదికలను అమలు చేయాల్సిందేనని రాయలసీమలో డిమాండ్లు వినిపిస్తున్నాయి.. బాబు తీరును నిరసిస్తూ అటు అనంతపురం నుంచి ఇటు శ్రీకాకుళం వరకు అన్ని వర్గాల ప్రజలు రోడ్డెక్కారు. తీరు మారకపోతే మా ప్రాంతాల్లో అడుగు పెట్టలేరంటూ హెచ్చరించారు. ప్రాంతాల మధ్య చిచ్చులు పెట్టి రాజకీయంగా లబ్ధి పొందాలని చూడటం సబబుకాదని హితవు పలికారు.