AP Capital-Foot March: అమరావతిలో ఉద్రిక్తత, మహిళలపై లాఠీచార్జ్, పలువురికి గాయాలు, గుంపులుగా రావడంతోనే వారిని నిలువరించామన్న పోలీసులు, ఫేక్ వీడియోలు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తప్పవన్న ఎస్పీ, వేడెక్కిన టీడీపీ, వైసీపీ సోషల్ మీడియా వార్
Ap Capital-Foot March (Photo-ANI)

Amaravathi, Januray 10: అమరావతిలో(Amaravathi) ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రాజధానిని (AP Capital) అమరావతిలోనే కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ.. 29 గ్రామాల రైతులు, ప్రజలు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. దీంతో రాజధాని గ్రామాల్లో పోలీసులను భారీగా మోహరించారు.  ఈ నేపథ్యంలోనే  ఉద్దండరాయునిపాలెం(Uddandrayuni Palem) నుంచి విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం (Kanakadurga temple) వరకు మహిళలు నిర్వహించ తలపెట్టిన పాదయాత్రను పోలీసులు అడ్డుకున్నారు.

పాదయాత్రకు అనుమతి లేదని... 144 సెక్షన్‌,( 144 Section)30 యాక్ట్‌ అమలులో ఉందని పోలీసులు చెప్పడంతో ఇద్దరి మధ్యా వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలోనే తుళ్లూరు వద్ద మహిళలపై పోలీసులు దాష్టీకం చెలాయించారంటూ మీడియాలో కథనాలు వచ్చాయి. దీనిపై జాతీయ మహిళా కమిషన్ (National Women Commission) కూడా స్పందించి ఘటనను సుమోటోగా స్వీకరించింది.

Here's ANI Tweet

పోలీసుల తీరుపై మహిళలు ఆగ్రహం

విజయవాడ కనకదుర్గమ్మకు సారె, నైవేద్యం సమర్పించేందుకు పాదయాత్రగా వెళ్లేందుకు సిద్ధమైన మహిళలు, రైతులను పోలీసులు అడ్డుకున్నారు.ఈ సందర్భంగా పోలీసులు, గ్రామస్తుల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట చోటుచేసుకున్నాయి. దీంతో పోలీసులు లాఠీలకు పని కల్పించారు. మహిళల చేతిలోని అమ్మవారి చిత్రపటాలను కూడా పోలీసులు లాక్కున్నారు. ఈ క్రమంలో, పలువురు మహిళలకు గాయాలయ్యాయి.

రాజమండ్రిని నాలుగవ రాజధానిగా చేయమన్న మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథ రాజు

పోలీసుల వలయాన్ని దాటుకునే వారంతా ముందుకు కదులుతున్నారు. ఈ సందర్భంగా పోలీసుల తీరుపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము ఏపీలో ఉన్నామా? లేక పాకిస్థాన్ లో ఉన్నామా? అని ప్రశ్నించారు. రాజధానికి స్వచ్ఛందంగా భూములను ఇచ్చిన తమను శిక్షిస్తారా? అని మండిపడ్డారు. మహిళలు అని కూడా చూడకుండా లాఠీఛార్జి చేశారని మండిపడ్డారు. అమ్మవారి దీక్షలో ఉన్న తమపై దాడి చేస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎవరిపైనా దాడి చేయలేదు : ఎస్పీ విజయరామారావు

అయితే, తాము ఎవరిపైనా దాడి చేయలేదని ఎస్పీ విజయరామారావు స్పష్టం చేశారు. తుళ్లూరు ఘటనపై స్పందిస్తూ, శాంతిభద్రతలను కాపాడడం తమ విధి అని, చట్టవిరుద్ధంగా గుంపుగా రావడంతో వారిని నిలువరించామని వెల్లడించారు. అప్పటికే అక్కడ 30 పోలీస్ చట్టం, 144 సెక్షన్ అమలులో ఉన్నాయని ప్రకటించామని, అయినప్పటికీ ఒకేసారి అంతమంది వచ్చారని వివరించారు. కానీ తాము దాడి చేసినట్టు ఫేక్ వీడియోలతో ప్రచారం చేస్తున్నారని ఎస్పీ ఆగ్రహం వ్యక్తం చేశారు. తుళ్లూరు ఘటనపై దుష్ప్రచారం చేస్తున్న వారిపై కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు.

భద్రతను పెంచాలనే ఆలోచనలో ఏపీ ప్రభుత్వం

అమరావతి ప్రాంతంలో రైతులు, మహిళలు చేపట్టిన ఆందోళనల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అక్కడ భద్రతను పెంచాలని భావిస్తోంది. ప్రధానంగా, నిరసనల్లో భారీ ఎత్తున పాల్గొంటున్న మహిళలను నియంత్రించడంకోసం అధిక సంఖ్యలో మహిళా పోలీసులు, హోంగార్డులను వినియోగించాలని పోలీసు విభాగం నిర్ణయించింది.

అమరావతిని రాజధానిగా గుర్తించవద్దని రాష్ట్రపతికి లేఖ

ఈ నేపథ్యంలో అక్కడ ఉన్న మహిళా పోలీసులకు తోడుగా మహిళా హోంగార్డులను అమరావతి ప్రాంతానికి తరలించారు. అమరావతి చేరుకున్న హోంగార్డులు వీధుల్లో కవాతు చేశారు. ఆందోళనలు అమరావతి ప్రాంత గ్రామాలకు విస్తరించడంతో మహిళల హోంగార్డులను రంగంలోకి దించినట్లు తెలుస్తోంది.

ఏపీలో మరో రెండు కొత్త పథకాలు, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన

ఫేక్ వీడియోలతో సోషల్ మీడియా వార్

ఏపీ రాజధాని అంశం తీవ్రస్థాయిలో రగులుతున్న నేపథ్యంలో అధికార, విపక్షాల మధ్య సోషల్ మీడియా వార్ జరుగుతోంది. తాజాగా, టీడీపీ సోషల్ మీడియా విభాగంపై వైసీపీ విమర్శనాస్త్రాలు సంధించింది. నారా లోకేశ్ ఆధ్వర్యంలో నడుస్తున్న టీడీపీ సోషల్ మీడియా విభాగం నీచాతినీచంగా మారిందని ఆరోపించింది. అంతేగాకుండా, ఓ వ్యక్తి విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ పైకి ఎక్కి ఆత్మహత్యకు ప్రయత్నిస్తుండగా, కింద ఉన్న వాళ్లు అతడ్ని వారిస్తున్న ఓ వీడియోను కూడా వైసీపీ ట్విట్టర్ లో షేర్ చేసింది.

విద్యార్థులకు శుభవార్త, 'అమ్మ ఒడి' పథకాన్ని ప్రారంభించిన ఏపీ సీఎం జగన్

సోషల్ మీడియా వార్

ఆ వీడియోలో ట్రాన్స్ ఫార్మర్ ఎక్కిన వ్యక్తి చివరికి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ వీడియోను పచ్చ మీడియా ప్రచారం చేస్తోందని వైసీపీ ఆరోపించింది. ఎక్కడో తమిళనాడులో జరిగిన ఘటనకు సంబంధించిన వీడియోను ఏపీ రాజధాని కోసం జరిగిన సంఘటన అంటూ విష ప్రచారం చేస్తున్నారని మండిపడింది.

ట్విట్టర్లో చంద్రబాబు ఫైర్

ట్విట్టర్లో చంద్రబాబు ఫైర్

గుడికొచ్చిన మహిళలను పోలీసులు అడ్డుకోవడం ఏంటి? వాళ్ల గ్రామ దేవతలని పూజించుకోవడానికి పోలీసుల అనుమతి తీసుకోవాలా? శుక్రవారం గుడికి వెళ్లకపోతే మీలాగా కోర్టుకు వెళ్లమంటారా? రైతులు గుడికే వెళ్తుంటే దౌర్జన్యంగా అరెస్టు చేస్తారా? ఆంధ్రప్రదేశ్ లో మానవ హక్కులు ఉన్నాయా?’ అని చంద్రబాబు ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు.