Amaravathi, January 10: ఏపీ రాజధానిగా అమరావతినే (Amaravati) కొనసాగించాలంటూ తుళ్లూరు, మందడం గ్రామాల్లో నిరసన ప్రదర్శన చేస్తున్న మహిళా రైతులపై పోలీసులు దాడి చేసిన ఘటనను జాతీయ మహిళా కమీషన్ (National Women Commission) సుమోటోగా స్వీకరించింది. శనివారం నిజ నిర్ధారణ కమిటీని(Fact-Finding Committee ) అమరావతికి పంపుతామని జాతీయ మహిళా కమీషన్ చైర్ పర్సన్ రేఖా శర్మ (Rekha Sharma)ట్విట్టర్ లో తెలిపారు.
రాజధాని అమరావతి ప్రాంతంలోని 29 గ్రామాలలో గడిచిన 24 రోజులుగా నిరసన తెలుపుతున్న మహిళల పట్ల పోలీసులు దురుసుగా వ్యవహరించారని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై మహిళలు ట్విట్టర్ ద్వారా, ఆన్ లైన్ ద్వారా జాతీయ మహిళా కమీషన్‌కు చేసిన ఫిర్యాదుపై రేఖాశర్మ స్పందించారు. నిజ నిర్ధారణ కమిటీ నివేదిక సమర్పించిన అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటామని ఆమె పేర్కోన్నారు.
Here's Tweet
Sending a fact finding team tomorrow https://t.co/lBZh6UcmFP
— Rekha Sharma (@sharmarekha) January 10, 2020
కాగా పోలీసులకు..గ్రామస్తులు..గ్రామ మహిళలకు మధ్య వాగ్వాదాలతో అమరావతి వేడెక్కింది.పోలీసులకు అలాగే మహిళలకు జరిగిన తోపులాటలో కొంతమంది మహిళలు సొమ్మసిల్లిపడిపోయారు. ఈ నేపధ్యంలోనే ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ దగ్గరకు ర్యాలీగా వెళేందుకు సిద్దమైన మహిళలను పోలీసులు అడ్డకున్నారు. మహిళలు అమరావతిలోనే రాజధాని ఉండాలని నినదిస్తున్నారు.
రాజమండ్రిని 4వ రాజధానిగా చేయమన్న మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథ రాజు
నారా లోకేష్‌ని అదుపులోకి తీసుకున్న పోలీసులు
ఇదిలా ఉంటే గుంటూరు జిల్లా కాజ టోల్ ప్లాజా వద్ద టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్( Nara Lokesh) టీడీపీ ఏపీ అధక్షుడు కళా వెంకటరావులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాజధాని ప్రాంతంలో పర్యటించటానికి అనుమతి లేదని చెపుతూ వారికి నోటీసులు జారీ చేశారు.
దీంతో లోకేష్ పోలీసులపై ఆగ్రహం వెలిబుచ్చారు. తాను ఏమీ చట్టాన్ని ఉల్లంఘించలేదని ఎవర్నీ రెచ్చగొట్టే ప్రయత్నం చేయటం లేదన్నారు.మందడం, వెంకటపాలెంలో మృతి చెందిన రైతుల కుటుంబాలను కళావెంకట్ర్రావు, లోకేష్ పరామర్శించాల్సి ఉంది. ఈక్రమంలోనే వీరిని పోలీసులు అడ్డుకున్నట్లు తెలుస్తోంది.