AP Capital Issue: రాజమండ్రిని నాలుగవ రాజధానిగా చేయమన్న మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథ రాజు, గ్రేటర్ రాయలసీమను ఇవ్వకుంటే ఉద్యమం చేస్తామన్న కేంద్ర మాజీ మంత్రి కోట్ల, రాజధాని కోసం జోలె పట్టిన చంద్రబాబు, నేతలు ఏమన్నారంటే..
Ap capital Issue rajahmundry-should-be-made-4th-capital Minister Sriranganatha Raju (File pic)

Amaravathi, January 10: ఏపీలో మూడు రాజధానులు అంశం (AP 3 Capital issue) వేడెక్కిస్తోంది. రాజధాని ప్రాంతాల్లో ప్రజలు రోడ్లెక్కి ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో మూడు రాజధానులు వద్దు..నాలుగు రాజధానులు కావాలని మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథ రాజు (Minister Sriranganatha Raju) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజమండ్రిని (Rajamandri) 4వ రాజధాని చేయాలని. సాంస్కృతిక రాజధానిగా దాన్ని చేయాలని, వచ్చే కేబినెట్, అసెంబ్లీ సమావేశాల్లో సీఎం జగన్ (CM Jagan) దృష్టికి తీసుకెళుతామని ఆయన అన్నారు.

అమరావతిని రాజధానిగా కొనసాగించడం చాలా కష్టమని స్పష్టం చేశారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు తన స్వార్థం కోసం రైతులను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. ఆయన చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారని, అమరావతిలో (Amaravathi)రాజధానిని నిర్మించాలంటే..లక్షా ఐదు వేల కోట్ల ఖర్చవుతుందని మండిపడ్డారు. ఆర్థికంగా ఇబ్బందులు కలుగుతున్నాయనే ఉద్దేశ్యంతో సీఎం జగన్ పలు నిర్ణయాలు తీసుకున్నారని తెలిపారు.

విద్యార్థులకు శుభవార్త, 'అమ్మ ఒడి' పథకాన్ని ప్రారంభించిన ఏపీ సీఎం జగన్

గ్రేటర్ రాయలసీమ ఉద్యమం

ఇదిలా ఉంటే రాయలసీమ నేతలు ఇప్పుడు ప్రత్యేక వాదాన్ని తెర ముందుకు తెచ్చారు. రాజధానిగా అమరావతిని కొనసాగించాలని, లేకపోతే గ్రేటర్‌ రాయలసీమ (Greater Rayalaseema) ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు. విశాఖను పరిపాలనా రాజధానిగా చేయడం వల్ల.. రాయలసీమ ప్రజలు అంత దూరం వెళ్లడం కష్టమవుతుందనే వాదాన్ని వినిపిస్తున్నారు.

అమరావతిని రాజధానిగా గుర్తించవద్దని రాష్ట్రపతికి లేఖ

హైకోర్టును అమరావతి నుంచి తీసుకొచ్చి కర్నూలులో పెడతామనేంత వరకు ఓకే కానీ.. పరిపాలన రాజధానిని విశాఖకు తీసుకెళ్తామనడమే ఏం బాగోలేదంటున్నారు. ఈ నేపథ్యంలో అమరావతిని రాజధానిగా ఉంచకపోతే గ్రేటర్ రాయలసీమ ఉద్యమం చేస్తామని కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి హెచ్చరించారు.

జోలె పట్టిన చంద్రబాబు

రాజధాని అంశంపై వినూత్న పద్ధతుల్లో అమరావతి పరిరక్షణ సమితి (amaravathi parirakshana samithi) నిరసన తెలియజేస్తోంది. ఈ నేపథ్యంలోనే జేఏసీ నేతలతో కలిసి చంద్రబాబు (Chandra babu) మచిలీపట్నంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన జోలె పట్టారు. వ్యాపార్తులు, ప్రజల నుంచి విరాళాలు సేకరిస్తూ..ప్రభుత్వ విధానాలను ఎండగట్టారు. కోనేరు సెంటర్ నుంచి వద్ద నడుచుకుంటూ విరాళాలు సేకరించారు.

Here's Chandrababu Speech

ఏపీలో మరో రెండు కొత్త పథకాలు, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన

బాబు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణతో సహా నేతలు నిర్వహించిన ప్రజా చైతన్య యాత్రలో విద్యార్థులు, యువకులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మచిలీపట్నంకు చేరుకున్న బాబుకు మహిళలు హరతులు పట్టారు. అమరావతికి అనుకూలంగా నినాదాలు చేస్తూ..ప్ల కార్డులు ప్రదర్శించారు. రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేశారు.

అమరావతి పరిరక్షణ సమితి  నిరసన

బంగారు బాతును చంపేశారు : చంద్రబాబు

అమరావతిని కదిలించే శక్తి ఎవరికైనా ఉందా ? ఇది ప్రజా రాజధాని..జగన్ రాజధాని కాదు...అడ్డొస్తే ఎవరినైనా వదిలిపెడదామా అని మచిలీపట్నంలో అమరావతి పరిరక్షణ సమితి జేఏసీ నిర్వహించిన సభలో టీడీపీ చీఫ్ బాబు ప్రశ్నించారు.

రాజధాని విషయంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను నిరసిస్తూ..విరాళాలు సేకరించడం జరిగిందని, రూ. 3 లక్షలు, ఒక రింగ్ వచ్చిందని..ఈ డబ్బును రాజధాని పరిరక్షణ సమితికి ఇవ్వడం జరుగుతోందన్నారు. తన జీవితంలో అమరావతిని కట్టి..హైదరాబాద్ ధీటుగా అమరావతిని ఇవ్వాలని కలలు కని..శ్రీకారం చుట్టామన్నారు. కానీ బంగారు బాతును చంపేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

మాజీ మంత్రి చిన రాజప్ప

రాష్ట్రాన్ని తగులబెట్టాలనే ఉద్దేశ్యం సీఎం జగన్‌లో ఉందని, దీన్ని ఆపేందుకు జేఏసీ ఆధ్వర్యంలో టీడీపీ పోరాటాలు చేస్తోందని మాజీ మంత్రి చిన రాజప్ప తెలిపారు. ప్రజలను కన్ఫ్యూజ్ చేయడానికి డ్రామాలు ఆడుతున్నారని ఎద్దేవా చేశారు. వైజాగ్‌లో భూములు కొనుక్కొన్నారని, దీని వాల్యూ పెంచుకోవడానికి ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారని వివరించారు.

ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్

అన్ని ప్రాంతాల వారికి అనుకూలంగా ఉంటుందనే చంద్రబాబు అమరావతిని క్యాపిటల్ చేశారని ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్ గుర్తు చేశారు. వికేంద్రీకరణ అభివృద్ధిలో జరగాలి గానీ.. రాజకీయంగా కాదని విమర్శించారు. రాజధానిని అమరావతిలోనే ఉంచాలని, లేకపోతే కర్నూలుకు రాజధానిని మార్చాలని డిమాండ్ చేశారు.

జేసీ దివాకర్‌రెడ్డి

రాజధానిని ముక్కలు చేసుకుంటూ పోతే ప్రత్యేక రాయలసీమ ఉద్యమం వస్తుందని జేసీ దివాకర్‌రెడ్డి అన్నారు. కావాలంటే కడప, లేదా పులివెందులలో రాజధాని పెట్టుకోవాలని సూచించారు. విశాఖ వెళ్లాలంటే రాయలసీమ వాసులకు ఇబ్బందన్నారు.

శైలజానాధ్‌ 

రాజధానిని మార్చడం అంత సులభం కాదని చెప్పారు. కర్నూలులో హైకోర్టు వరకైతే స్వాగతిస్తామని.. అలాగని రాజధానిని అమరావతి నుంచి తరలిస్తే ఊరుకోబోమని శైలజానాధ్‌ తెలిపారు. రాజధానిని మార్చాల్సి వస్తే రాయలసీమలోనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.