Amaravathi, January 17: రాజధానిపై గత కొంత కాలంగా ఏపీలో రాజకీయ పరిస్థితులు వేడెక్కిన విషయం అందరికీ విదితమే. ఇప్పటికే బోస్టన్ కమిటీ, (Bostan Committee) జీఎన్ రావు కమిటీలు(GN Rao Committee) సీఎం జగన్ కు నివేదికలు సమర్పించాయి. ఇక రాజధానిపై హైవర్ కమిటీ (AP High Power Committee)మాత్రమే నివేదిక ఇవ్వాలి. ఈ నేపథ్యంలొ ఈ రోజు సీఎం జగన్(CM YS Jagan)తో హైపవర్ కమిటీ భేటీ అయింది.
తాడేపల్లిగూడెంలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌తో కమిటీ సభ్యులు భేటీ అయ్యారు. కీలక అంశాలపై చర్చించారు. గంటన్నర పాటు ఈ సమావేశం జరిగింది. అయితే ఈ బేటీలో రాజధానిపై (AP Capital) నిర్ణయం ఓ కొలిక్కి రాకపోవడంతో మరోసారి.. సీఎం జగన్ తో హైపవర్ కమిటీ భేటీ కానుంది.
మా బతుకులకే గ్రహణం పట్టింది'! అమరావతి ప్రాంతంలో కొనసాగుతున్న నిరసనలు
నేడు జరిగిన సమావేశంలో జీఎన్ రావ్, బోస్టన్ గ్రూప్ కమిటీలు ఇచ్చిన నివేదికలపై సీఎం జగన్ తో హైపవర్ కమిటీ సభ్యులు చర్చించారు. కమిటీ సభ్యులు సీఎం జగన్ కు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.
AP CMO Tweet
Hon'ble Chief Minister Sri YS Jagan Mohan Reddy held a meeting with members of the High Power Committee at the Tadepalli Camp office today. pic.twitter.com/IpcQ0GHlgk
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) January 17, 2020
విద్యార్థులకు శుభవార్త, 'అమ్మ ఒడి' పథకాన్ని ప్రారంభించిన ఏపీ సీఎం జగన్
అయితే 3 రాజధానులపై ఇవాళ ఫుల్ క్లారిటీ వస్తుందని అంతా అనుకున్నారు. కానీ ఎటూ తేల్చకుండా ప్రభుత్వం సస్పెన్స్ (AP Govt Suspence)కంటిన్యూ చేసింది.రాజధానిపై హైపవర్ కమిటీ సభ్యులు తుది నివేదిక రూపకల్పన చేసే పనిలో ఉన్నారు. రెండు రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నారు.
దమ్ముంటే 21మందితో రాజీనామా చేసి రెఫరెండంకి రా
ప్రజల మనోభావాలకు అనుగుణంగా సమగ్ర ప్రణాళికతో ముందుకెళ్తామని హైపవర్ కమిటీ తెలిపింది. మూడు సార్లు సమావేశమై వివిధ అంశాలపై చర్చించినట్టు తెలిపారు. రాజధాని రైతులకు మరింత మేలు చేసేలా సీఎం జగన్ సూచనలు చేశారని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు.
పోలీసుల తీరును తప్పు బట్టిన ఏపీ హైకోర్టు
రాజధాని కోసం ఆందోళన చేస్తున్న మహిళల పట్ల ఏపీ పోలీసులు వ్యవహరిస్తున్న తీరును ఏపీ హైకోర్టు (AP High Court) తీవ్రస్థాయిలో తప్పు పట్టింది. ఏపీ రాజధాని అమరావతి గ్రామాల్లో 144 సెక్షన్ అమలు, పోలీస్ యాక్ట్ 30 అమలు, విజయవాడలో ధర్నా చేసిన మహిళల పట్ల పోలీసులు ప్రవర్తించిన తీరు పట్ల హైకోర్టు తప్పు పట్టింది.
ఈ నెల 20న అసెంబ్లీ సమావేశంలో స్పష్టత వచ్చే అవకాశం
అమరావతి రైతులు, న్యాయవాదులు,మహిళలు హై కోర్టులో దాఖలు చేసిన పిటీషన్లపై శుక్రవారం విచారణ జరిపారు. పోలీసులు దాడులు చేశారని చూపిస్తున్నవి ఫేక్ ఫోటోలు అని ఏజీ వాదించారు. కాగా అడ్వకేట్ వాదనలతో పిటీషనర్ తరుపు న్యాయవాది విభేదించారు.
ఆళ్ల రామకృష్ణారెడ్డి అరెస్ట్, అధికార వికేంద్రీకరణ జరగాలంటూ ర్యాలీ, అనుమతి లేదన్న పోలీసులు
ఏ కారణంగా బెజవాడ ర్యాలీలో పాల్గొన్న 610 మందిని అరెస్టు చేశారని ధర్మాసనం ప్రశ్నించింది. రాజధాని గ్రామాల్లో మహిళను బూటు కాలితో మగ పోలీస్ తన్నడంపై వివరణ అడిగింది. మహిళ నోరు ఎందుకు బలవంతంగా నొక్కరని హైకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది.
నిరసన కారులు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించారని ఏజీ కోర్టుకు వివరణ ఇచ్చారు. విజయవాడ బందరు రోడ్డులో శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా రైతులను అడ్డుకున్నట్లు ఏజీ (Advocate General)కోర్టుకు తెలిపారు.
క్లైమాక్స్‌లో రాజధాని అంశం, ఈ నెల 20న అసెంబ్లీ ప్రత్యేక సమావేశం
రాజధాని ప్రాంత గ్రామాల్లోని వీధుల్లో పోలీసులు మార్చ్ ఫాస్ట్...పరేడ్ చేయాల్సిన అవసరం ఏంటని ధర్మాసనం ప్రశ్నించింది. అమరావతిలో ప్రశాంత పరిస్థితులు ఉన్నాయని ఏజీ చెప్పారు. ఏజీ సమాధానంతో సంతృప్తి చెందని హైకోర్టు.. మరి ఎందుకు పోలీసు బలగాలు మోహరించారని ప్రశ్నించింది.
జీఎన్ రావు,బీసీజీ రిపోర్టులను భోగి మంటల్లో తగలబెట్టిన చంద్రబాబు
అత్యవసర పరిస్థితులు ఉంటే తప్ప 144 సెక్షన్, పోలీస్ యాక్ట్ 30 అమలు చేయవద్దన్న సుప్రీంకోర్టు ఆదేశాలను ఎందుకు ఉల్లంఘిస్తున్నారని హైకోర్టు బెంచ్ అడిగింది. అయితే.. 2014 నుంచి రాజధాని గ్రామాల్లో 144 సెక్షన్, పోలీస్ యాక్ట్ 30 అమల్లో ఉన్నాయని వాటిని కొనసాగిస్తున్నామని, కొత్తగా అమల్లోకి తేలేదని అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ ధర్మాసనం ముందు వివరణ ఇచ్చుకున్నారు.
వైకాపా గెలిస్తే రాజకీయాలనుంచి తప్పుకుంటానని సవాల్ విసిరిన చంద్రబాబు
రాజధాని వీధుల్లో పోలీసులు మార్చ్ ఫాస్ట్, పరేడ్ చేయాల్సిన అవసరం ఏంటని ధర్మాసనం పోలీసు ఉన్నతాధికారులను నిలదీసింది. అయితే.. అమరావతిలో ప్రశాంత పరిస్థితులు వున్నాయంటూ ఏజీ శ్రీరామ్ సమాధానమివ్వడంతో ‘‘ అయితే పోలీసు బలగాల మోహరింపు ఎందుకు ’’ అని హైకోర్టు ఎదురు ప్రశ్న వేసింది. మగ పోలీసులు మహిళను ఎందుకు అరెస్టు చేశారని హైకోర్టు ప్రశ్నించింది.
సీఎం జగన్ 3 రాజధానుల ప్రకటనను వ్యతిరేకిస్తున్న అమరావతి రైతులు
ముందు జాగ్రత్త చర్యగా అల్లర్లు జరగకుండా పోలీసులు మోహరించారని ఏజీ సమాధానమిచ్చారు. కాగా దీనిపై సమగ్రంగా అఫిడవిట్ సమర్పించమని కోర్టు ఆదేశించింది. అందుకు కొంత సమయం కావాలని ఏజీ కోరగా....తదుపరి విచారణను న్యాయస్ధానం సోమవారానికి వాయిదా వేసింది. విచారణలో సుమారు గంటపాటు అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ వాదనలు వినిపించారు.