Amaravati Parirakshana Samithi: జీఎన్ రావు,బీసీజీ రిపోర్టులను భోగి మంటల్లో తగలబెట్టిన చంద్రబాబు, రాజధానిగా అమరావతి తరలింపును నిరసిస్తూ విజయవాడలో ధర్నా, సంక్రాంతి వేడుకలకు దూరంగా ఉంటామన్న అమరావతి రైతులు
Chandrababu Naidu burns 3 Capitals reports in Bhogi bonfires (Photo-ANI)

Amaravathi, January14: ఆంధ్రప్రదేశ్(AP) రాజధాని అమరావతి(Amaravathi) తరలింపును నిరసిస్తూ విజయవాడ(Vijayawada) బెంజిసర్కిల్ వద్ద ఈ తెల్లవారుజామున భోగి మంటలు వేశారు. టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు,(TDP leader N Chandrababu Naidu) అఖిలపక్షం నేతలు, జేఏసీ ప్రతినిధులు, అమరావతి పరిరక్షణ సమితి నేతలు( Amaravati Parirakshana Samithi) ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా జీఎన్ రావు, ( GN Rao Committee report)బోస్టన్ కమిటీ నివేదికలను భోగి మంటల్లో వేసి తగలబెట్టారు.

రాజధాని రైతులు, మహిళలు, యువత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. సంక్రాంతి వేడుకలకు దూరంగా ఉంటామని గతంలోనే ప్రకటించిన రాజధాని రైతులు.. మరోమారు ఆ విషయాన్ని పునరుద్ఘాటించారు. రాజధాని తరలింపును అంగీకరించేది లేదని, ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఈ సందర్భంగా రైతులు డిమాండ్ చేశారు.

Here's ANI Tweet

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు రాజధానులు నిర్మించేందుకు ఇప్పటివరకు వచ్చిన రిపోర్ట్‌లను భోగి మంటల్లో తగలెయ్యాలంటూ తెలుగుదేశం అధినేత చంద్రాబాబు పిలుపు ఇచ్చిన సంగతి విదితమే.. ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం నాయకులు నేతలు ఆ రిపోర్ట్‌లను భోగి మంటల్లో కలుస్తున్నారు.

ఏడాదికి రెండు సార్లు వైఎస్సార్‌ లైఫ్‌ టైం ఎచీవ్‌మెంట్‌ అవార్డులు

విశాఖను రాజధానిగా సూచించిన బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్.. జీఎన్‌రావు కమిటీ రిపోర్టులను భోగి మంటల్లో కాల్చివేశారు. రాజధాని పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో విజయవాడ బెంజిసర్కిల్‌ సమీపంలోని ప్రైవేట్‌ స్థలంలో నేతలు భోగి మంటలను ఏర్పాటు చేశారు.

వైకాపా గెలిస్తే రాజకీయాలనుంచి తప్పుకుంటానని సవాల్ విసిరిన చంద్రబాబు

ఈ కార్యక్రమానికి తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు, కేశినేని నాని, గద్దె రామ్మోహన్‌రావు, దేవినేని ఉమ, బోడె ప్రసాద్‌, బచ్చుల అర్జునుడు, అశోక్‌ బాబు, వర్ల రామయ్య, పంచుమర్తి అనురాధ, ఐకాస కన్వీనర్‌ ఆళ్ల శివారెడ్డి, కోకన్వీనర్లు గద్దె తిరుపతిరావు, ఆర్‌.ఎల్‌.స్వామి, కాంగ్రెస్‌ ఉపాధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ, జనసేన నాయకురాలు రజని, మాజీ జడ్పీ ఛైర్‌పర్సన్‌ గద్దె అనురాధ హాజరయ్యారు, పెద్ద ఎత్తున మహిళలు, విద్యార్థులు తరలివచ్చారు.

ముగిసిన హై పవర్ కమిటీ సమావేశం, రాజధానిపై ఏం తేల్చింది? ఆమోదం తెలుపనున్న మంత్రివర్గం!

ఈ సందర్భంగా ఆంధ్రులంతా ఒక్కేటే.. రాజధాని అమరావతి ఒక్కటే అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మూడు రాజధానుల ప్రతిపాదనలు విరమించుకోవాలని వారు డిమాండ్‌ చేశారు. ఏపీలోని పలు జిల్లాల్లో కూడా భోగి మంటలు ఏర్పాటు చేసి జీఎన్‌రావు కమిటీ, బోస్టన్‌ నివేదిక ప్రతులను అందులో వేసి నిరసనలు తెలుపుతున్నారు. ఈ సంధర్భంగా మన సంప్రదాయం ప్రకారం ఇంట్లో ఉన్న చెత్తను అంతా క్లీన్ చేసి చెత్తను భోగి మంటల్లో వేస్తామని, అలాగే ఈ చెత్త రిపోర్ట్ లు భోగిలో వేశామని చంద్రబాబుల అన్నారు.