YSR Lifetime Achievement Awards: ఏడాదికి రెండు సార్లు వైఎస్సార్‌ లైఫ్‌ టైం ఎచీవ్‌మెంట్‌ అవార్డులు, ఎంపిక కోసం హైపవర్‌ స్క్రీనింగ్‌ కమిటీని ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వం, ఆగస్టు 15, జనవరి 26వ తేదీన అవార్డుల ప్రదానోత్సవం
Government appoints High Power Screening Committee to select winners of YSR Lifetime Achievements Awards(Photo-Twitter)

Amaravathi, January 13: దివంగత వైఎస్ఆర్ పేరిట లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డులను (YSR Lifetime Achievement Awards)ఏటా రెండు సార్లు ఇవ్వాలన్న కీలక నిర్ణయాన్ని ఏపీ కేబినెట్ (AP Cabinet)తీసుకున్న సంగతి విదితమే. ఈ వైఎస్సార్‌ లైఫ్‌ టైం ఎచీవ్‌మెంట్‌ అవార్డుల ఎంపిక కోసం రాష్ట్ర ప్రభుత్వం(AP Government) హైపవర్‌ స్క్రీనింగ్‌ కమిటీ ఏర్పాటు చేసింది.

ఈ మేరకు ప్రభుత్వం సోమవారం జీవో జారీ చేసింది. ప్రజా సేవా కార్యక్రమాలు చేసేవారికి అవార్డుల ఎంపికలో ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వం జీవోలో పేర్కొంది.

ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి (Government advisor Sajjala Ramakrishna Reddy)నేతృత్వంలో కమిటీ సభ్యులుగా సలహాదారులు దేవుపల్లి అమర్‌, కె.రామచంద్రమూర్తి, జీవీడీ కృష్ణమోహన్‌, ఐఏఎస్‌ అధికారులు ప్రవీణ్‌ ప్రకాష్‌, కె.దమయంతి, ఉషారాణి, కోన శశిధర్‌, జేవీ మురళి, ఐఐఎస్‌ అధికారి టి.విజయకుమార్‌ రెడ్డి నియమితులయ్యారు.

ముగిసిన హై పవర్ కమిటీ సమావేశం, రాజధానిపై ఇంకా రాని స్పష్టత

ప్రతి ఏడాది ఆగస్టు 15, జనవరి 26వ తేదీన వైఎస్సార్‌ లైఫ్‌ టైం ఎచీవ్‌మెంట్‌ అవార్డులు ప్రదానం చేయనున్నారు. అవార్డు కింద రూ.10 లక్షల నగదు, జ్ఞాపిక అందించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది.