Anantapur, January 13: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రానికి ఒకటే రాజధాని ఉండాలి, అది అమరావతి అయి ఉండాలి అంటూ ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ రాజధానిపై ఉధృతమైన ఆందోళనలు నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా 'అమరావతి పరిరక్షణ యాత్ర' (Amaravathi Parirakshana Yatra) చేపట్టిన ప్రతిపక్ష నేత చంద్రబాబు (Chandrababu Naidu) రాజధాని ఉద్యమానికి మద్ధతుగా భిక్షమెత్తుతూ విరాళాలు సేకరిస్తున్నారు. రోడ్ల వెంబడి జోలె పట్టుకొని నడుస్తూ, ర్యాలీలు నిర్వహిస్తూ జగన్ ప్రభుత్వం ప్రతిపాదించిన రాజధాని వికేంద్రీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా వివిధ రూపాల్లో నిరసన తెలియజేస్తున్నారు.
సోమవారం తన యాత్ర అనంతపురం జిల్లాకు చేరుకుంది. జిల్లాలోని పెనుగొండలో విరాళాలు సేకరించిన అనంతరం, బహిరంగ సభలో మాట్లాడారు. తమ హయాంలో రాజధానిగా అమరావతిని ప్రకటించినపుడు ప్రజలంతా అంగీకరించారని తెలిపారు. కానీ ఇప్పుడు నడుస్తున్న తుగ్లక్ పాలనలో మూడు రాజధానులు కడతారంట అంటూ జగన్ పాలనను చంద్రబాబు ఎద్దేవా చేశారు. తెలంగాణ నాయకులు ఆంధ్రప్రదేశ్ పరిస్థితిని చూసి జాలిపడుతున్నారంటూ కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ప్రస్తావించారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని మూడు ముక్కలవడం చేత హైదరాబాద్ బాగుపడుతుంది అందుకు ఆనందంగా ఉన్నా, ఒక భారతీయుడిగా ఆంధ్రా ప్రజల పట్ల బాధగా ఉందని రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను చంద్రబాబు ఈ సందర్భంగా కోట్ చేశారు. అదే విధంగా హైదరాబాదులో రియల్ ఎస్టేట్ వృద్ధి చెందటానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని తెలంగాణ మంత్రి హరీశ్ రావు చేసిన వ్యాఖ్యలను కూడా గుర్తు చేశారు. ముగిసిన హై పవర్ కమిటీ సమావేశం, రాజధానిపై ఏం తేల్చింది? ఆమోదం తెలుపనున్న మంత్రివర్గం!
ఒకప్పుడు హైదరాబాదును అభివృద్ధి చేశాను, ఇప్పుడు నేనేమైనా హైదరాబాద్ ఫలాలను అనుభవిస్తున్నానా? అలాగే ఇప్పుడు అమరావతిని అభివృద్ధి చేస్తానంటున్నాను. దాని ఫలాలను నేనేమైనా అనుభవిస్తానా? తాను ఏం చేసినా భావితరాల కోసమేనని చంద్రబాబు అన్నారు.
రాజధానిని మార్చాలంటే 151 వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి తిరిగి ఎన్నికలకు వెళ్లాలి. వైసీపీకి ప్రజలు అనుకూలంగా రాజధాని వైజాగ్ లో పెట్టుకోండి. వైకాపా గెలిస్తే రాజకీయాలనే వదిలేస్తా? అందుకు సిద్ధమేనా అంటూ చంద్రబాబు సవాల్ విసిరారు. అదీకాకపోతే రాజధానిపై ఓటింగ్ నిర్వహించి అమరావతా? విశాఖపట్నమా అన్నది తేల్చాలని సవాల్ చేశారు.
అమరావతిపై మీ అభిప్రాయం ఏమిటి? పోల్‌లో పాల్గొని మీ అభిప్రాయాన్ని నమోదు చేయండి
రాజధాని విషయంలో మీ సపోర్ట్ ఎవరికి వికేంద్రీకరణ జరగాలన్న ప్రభుత్వానికా? అమరావతి మాత్రమే రాజధానిగా ఉండాలంటున్న ప్రతిపక్షానికా?