amaravathi-farmers-maha-padayatra (photo-Twitter)

Amaravathi, January 6: మూడు రాజధానుల ప్రకటనకు( 3 Capital Issue) నిరసనగా అమరావతి గ్రామాల్లో రైతుల ఆందోళనలు(Farmers Protest) కొనసాగుతున్నాయి. రాజధానిగా అమరావతిని(Amaravathi)కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ అమరావతి రైతులు చేపట్టిన నిరసన దీక్షలు సోమవారానికి 20వ రోజుకు చేరుకున్నాయి. తుళ్లూరు నుంచి 10 వేల మంది రైతులు, యువకులు, మహిళలతో మందడం వరకు మహా పాదయాత్రను(Maha Padayatra) నిర్వహించారు. తమ పాదయాత్రను ఎవ్వరూ అడ్డుకోలేరని రైతులు స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా నిరసనకారులు మాట్లాడుతూ, జీఎన్ రావు కమిటీ (GN Rao Report), బీసీజీ రిపోర్టులు(BCG Report) ప్రభుత్వ జిరాక్స్ కాపీలేనని విమర్శించారు. హైపర్ కమిటీ నివేదిక కూడా మరో కలర్ జిరాక్స్ తప్ప మరొకటి కాదని అన్నారు. తమ పాదయాత్రను ఎవరూ అడ్డుకోలేరని చెప్పారు. రాజధాని కోసం 33 వేల ఎకరాలను స్వచ్ఛందంగా ఇచ్చిన రైతుల త్యాగాలను అవహేళన చేస్తున్నారని మండిపడ్డారు.

Here's Video

ఇదిలా ఉంటే రాజధానిలో రైతుల పాదయాత్రకు అనుమతి లేదని, నిరసనలు తెలిపే హక్కు అందరికీ వున్నా ఇతరులకు ఇబ్బందులు కలిగించవద్దని పోలీసులు అంటున్నారు. రాజధాని రైతులు రోడ్డుమీదకు రావడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.

ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ పోలీసులు అనుమతి నిరాకరించినా.. ర్యాలీని జరిపితీరుతామని, ఎవరూ అడ్డుకోలేరని అన్నారు. టెంట్‌ వేసుకునేందుకు పోలీసులు అనుమతి నిరాకరించారని, రహదారిపైనే బైఠాయించి ఆందోళన తెలుపుతామని స్పష్టం చేశారు. రాజధాని తరలింపు, పరిహార ఖర్చులు కలిపి సుమారు రూ.75వేల కోట్లు అవుతాయని, ఆ మొత్తాన్ని ప్రభుత్వం ఎక్కడనుంచి తెస్తుందో చెప్పాలని రైతులు డిమాండ్ చేశారు.