Thalapathy Vijay to go on Padayatra: తమిళ స్టార్ హీరో విజయ్ రాజకీయరంగ ప్రవేశానికి సంబంధించిన ఓ విషయం ప్రకంపనలు పుట్టిస్తోంది. గతకొన్ని రోజులుగా విజయ్ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వనున్నారంటూ వార్తలు వస్తోన్న విషయం తెలిసిందే. తాజాగా త్వరలోనే ఆయన పాదయాత్ర చేయబోతున్నారనే ప్రచారం పెద్ద ఎత్తున సాగుతోంది. తన అభిమాన సంఘం 'విజయ్ మక్కల్ ఇయక్కం' సభ్యులతో విజయ్ తరచుగా సమావేశమవుతుంటారు. నిన్న కూడా వారితో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
ఈ సమావేశంలో పాదయాత్రకు సంబంధించిన నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. నిన్న జరిగిన ‘విజయ్ మక్కల్ ఇయక్కం’ మీటింగ్‌కు వెళ్లే సమయంలో విజయ్ ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించారు. దీంతో ట్రాఫిక్ పోలీసులు ఆయనకు రూ.500 జరిమానా విధించారు. తన తాజా చిత్రం 'లియో' విడుదల కంటే ముందుగానే తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేయాలనుకుంటున్నారని తెలుస్తోంది. ఈ చిత్రం అక్టోబర్ 19న విడుదల కానుంది. ఈ లోగానే తన నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించనున్నారని సమాచారం.
జవాన్ ప్రివ్యూ ఇదిగో, సమాజంలోని తప్పులను సరిదిద్దడానికి బయలుదేరే వ్యక్తి పాత్రలో షారూఖ్ ఖాన్
మరోవైపు ఇటీవలే విజయ్ రాష్ట్రంలోని నియోజకవర్గాల వారీగా టెన్త్, ఇంటర్ పరీక్షల్లో ఎక్కువ మార్కులు వచ్చిన విద్యార్థులను సన్మానించారు. చెన్నైలో జరిగిన ఈ కార్యక్రమంలో మెరిట్ విద్యార్థులకు సర్టిఫికెట్స్, నగదు ప్రోత్సాహాన్ని అందించారు. ఇదంతా కూడా రాజకీయ అరంగేట్రంలో భాగమేనని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
సినిమాల విషయానికొస్తే.. లోకేశ్ కనగరాజ్ (Lokesh Kanagaraj) దర్శకత్వంలో విజయ్ ‘లియో’ (Leo)లో నటించారు. ఇటీవలే దీని చిత్రీకరణ పూర్తయింది. దీని తర్వాత వెంకట్ ప్రభుతో ఓ సినిమాను ఓకే చేశారు. అలాగే తాజాగా దర్శకుడు శంకర్‌తో ఓ మూవీ చేయడానికి చర్చలు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరోవైపు రానున్న ఎన్నికల్లో ఆయన పోటీచేయనున్నారనే వార్తలు కూడా జోరుగా ప్రచారమవుతున్నాయి.