AP Special Assembly session Day 2 speaker-tammineni-hurted-and-left-assembly-session (Photo-Youtube Grab)

Amaravathi, January 21: ఏపీలో అసెంబ్లీ సమావేశాలు(AP Special Assembly session) రెండో రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా సభ ప్రారంభం కాగానే టీడీపీ సభ్యులు(TDP MLAs) నిరసనకు దిగారు. జై అమరావతి (Amaravathi) అంటూ సభలో నినాదాలు చేశారు. ఈ నిరసనల మధ్యనే సాంఘిక సంక్షేమ మంత్రి పినిపే విశ్వ రూప్ ఎస్టీ సంక్షేమ బిల్లును (ST,SC Bill) ప్రవేశపెట్టారు.

ఈ బిల్లు చర్చ సంధర్భంగా అసెంబ్లీలో ఆందోళన జరిగింది. టీడీపీ సభ్యులు జై అమరావతి అంటూ నినాదాలు చేస్తూ సభకు ఆటంకం కలిగించారు. వైసీపీ నాయకులు (YCP MLAs) రోజాతో సహా పలువురు బిల్లుకు సహకరించమని టీడీపీని కోరినప్పటికీ టీడీపీ సభ్యులు శాంతించలేదు.

టీడీపీ తీరుపై మండిపడ్డ స్పీకర్ తమ్మినేని, రాజధానిలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ వ్యవహారంపై విచారణ జరపాలని సీఎంకు విజ్ఞప్తి

ఈ నేపథ్యంలో ఈ బిల్లును కావాలనే వివక్ష చూపిస్తూ మాట్లాడేందుకు అవకాశమివ్వడం లేదని వైసీపీ నాయకులు వాదించారు. అయినప్పటికీ వేరెవ్వరినీ మాట్లాడనివ్వకుండా టీడీపీ సభ్యులు స్పీకర్ (Tammineni Sitaram) వరకూ వెళ్లి జై అమరావతి అంటూ ముట్టడి ప్రయత్నం చేశారు.

Here"s ANI Tweet

రాజధాని గ్రామాల్లో బంద్, అమరావతి పరిధిలోని 29 గ్రామాలు బంద్‌లోకి..

దీనిపై విసుగు చెందిన స్పీకర్ తమ్మినేని 'ఐ యామ్ ప్రొటెస్టింగ్ ద అటిట్యూడ్ ఆఫ్ టీడీపీ ఎమ్మెల్యేస్' అని కుర్చీలోంచి వెళ్లిపోయారు. టీడీపీ ఎమ్మెల్యేల ప్రవర్తనకు నిరసన తెలియజేస్తున్నా. నిజంగా నేను హర్ట్ అయ్యా' అని చెప్పి వెళ్లిపోయారు. టీడీపీ సభ్యలు గొడవతో సభను రన్ చేయలేనని ఆయన అసహనం వ్యక్తం చేశారు.

చంద్రబాబు అరెస్ట్, 3 రాజధానుల బిల్లు అమోదం

తనను అసభ్య పదజాలంతో దూషించడం ఏంటని ఆయన ప్రశ్నించారు. స్పీకర్ చైర్ ను అగౌరవ పరుస్తున్న తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు సిగ్గు పడాలని అన్నారు. కీలక చట్టాలను చేస్తున్న సమయంలో విపక్షాలకు ఉన్న సంఖ్యాబలంతో పోలిస్తే, తాను అధిక ప్రాధాన్యం ఇస్తున్నానని, అయినా, చైర్ ను అవహేళన చేస్తున్నారని ఆయన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సమాజానికి ఆదర్శంగా నిలబడాల్సిన సభలో ఈ పరిస్థితిని తాను ఊహించలేదని అన్నారు. స్పీకర్ చైర్ ను వదిలి వెళ్లడంతో సభలో తీవ్ర గందరగోళ పరిస్థితి ఏర్పడింది.

అమరావతిని చంపేశామని ఎవరన్నారన్న సీఎం జగన్

మరోవైపు నిన్న కూడా స్పీకర్ సభలో టీడీపీ సభ్యుల తీరుపై ఆగ్రహించారు. అమరావతిలో జరిగిన భూకుంభకోణాలపై విచారణ జరపాలంటే ఏకంగా సభ సాక్షిగా సీఎం జగన్ మోహన్ రెడ్డికి ఆయన విజ్ఞప్తి చేశారు. ఆ తర్వాత సోమవారం సభలో జగన్ మాట్లాడుతున్న సమయంలో టీడీపీ ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ‘జై అమరావతి.. జైజై అమరావతి. మూడు రాజధానులు వద్దు. ఒక్క రాజధాని ముద్దు’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

వైసీపీ ఎమ్మెల్యే రోజా

టీడీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్‌ను సర్వనాశనం చేశారని వైసీపీ ఎమ్మెల్యే రోజా మండిపడ్డారు. ఈ రోజు అసెంబ్లీలో ఆమె మాట్లాడుతూ.. అమరావతిలో శాశ్వత నిర్మాణాలు ఎందుకు చేపట్టలేదని ప్రశ్నించారు. 'పయ్యావుల కేశవ్ గారు పెద్ద పెద్దగా అరుస్తూ మాట్లాడుతున్నారు. రాజధానిపై ప్రేమ ఉంది అందుకే ఇక్కడ ఇల్లు కట్టుకున్నానని అంటున్నారు. మరి అప్పట్లో హైదరాబాద్‌లో ఆయన ఎందుకు ఇల్లు కట్టుకోలేదు? అక్కడ ఇన్ సైడర్ ట్రేడింగ్‌కి అప్పట్లో అవకాశం లేదు కాబట్టే కట్టుకోలేదా?' అని ప్రశ్నించారు.

ఆంధ్రప్రదేశ్ శాసన మండలి రద్దు?

'రాయలసీమకు బుల్లెట్ రైల్ తీసుకొస్తున్నామని చంద్రబాబు అప్పట్లో అన్నారు. ఆ బుల్లెట్ రైల్ ఎక్కడికి పోయింది అధ్యక్షా? దానితో లోకేశ్ ఆడుకుంటున్నాడా? రెయిన్ గన్లతో కరవు లేకుండా చేశామన్నారు. ఎక్కడ ఉన్నాయి రెయిన్ గన్లు? వాటితో దేవాన్ష్ ఆడుకుంటున్నాడా అధ్యక్షా?' అని రోజా ప్రశ్నించారు.

దమ్ముంటే 21మందితో రాజీనామా చేసి రెఫరెండంకి రా

ఆంధ్రప్రదేశ్ మంత్రి కన్నబాబు

చర్చ జరుగుతుంటే టీడీపీ నేతలు అడ్డుపడుతున్నారని ఆంధ్రప్రదేశ్ మంత్రి కన్నబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ... అమరావతిని మార్చుతామని ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఎక్కడా అనలేదని చెప్పారు. టీడీపీ నేతలు ఉద్దేశపూర్వకంగానే ప్రతి చర్చను అడ్డుకుంటున్నారని ఆయన అన్నారు.

రాజధాని అంశంలో కీలక మలుపు

అమరావతిని కాపాడతామని సీఎం జగన్ స్పష్టం చేశారని, అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని చెప్పారని కన్నబాబు తెలిపారు. టీడీపీకి రియల్ ఎస్టేట్ ప్రయోజనాలే ముఖ్యమని ఆయన ఆరోపించారు. నిన్న కూడా అసెంబ్లీలో చంద్రబాబు డ్రామా చేశారని ఆయన విమర్శించారు.

మంత్రి అనిల్ కుమార్ యాదవ్

ఈ రోజు అసెంబ్లీలో మంత్రి అనిల్ కుమార్ యాదవ్ టీడీపీ ఎమ్మెల్యేలపై విరుచుకుపడ్డారు. టీడీపీ నేతలకు సవాల్ విసిరారు. పొత్తులు లేకుండా టీడీపీ ఏనాడు కూడా ఎన్నికల్లో పోటీ చేయలేదని మంత్రి అనిల్ అన్నారు. పొద్దున లేచినప్పటి నుంచి పొత్తుల కోసం పాకులాడే పార్టీ టీడీపీ అన్నారు.

''మీ పార్టీ నెక్ట్స్ ఏ పార్టీ చంక ఎక్కబోతోంది. బీజేపీనా, సీపీఎమ్మా, సీపీఐయా, జనసేనా.. ఇంకొకటా.. పొత్తు లేనిదే ముద్దు దిగదు. మీరు కూడా మాట్లాడుతున్నారు.. పొద్దున లేస్తే ఏ పార్టీ అధికారంలో ఉందా? ఏ పార్టీ చంక ఎక్కుదామా? ఏ పార్టీ కాళ్లు మొక్కుదామా? రాహులా? మోడీయా? ఆఖరికి ట్రంపా..? మీరు కూడా కేపిటల్ గురించి మాట్లాడుతున్నారంటే సిగ్గు ఉండాలి.

వైసీపీ, జగన్ మాత్రం మీలా కాదు. జగన్ సింహంలా సింగిల్ గా పోతాం తప్ప.. పొత్తుల కోసం పోయే పార్టీ కాదు మాది. 2024లో పొత్తు లేకుండా సింగిల్ గా ఎన్నికల్లో పోటీ చేస్తామని చెప్పే ధైర్యం మీకుందా? చాలెంజ్.. సింగిల్ గా పోతామని చెప్పడానికి ఒక్క టీడీపీ ఎమ్మెల్యేకి కూడా దమ్ము లేదు.

మేము చెబుతున్నాం.. సింగిల్ గానే వెళతాం..'' అని అనిల్ అన్నారు. చంద్రబాబు.. మొత్తం రాష్ట్రాన్ని దోచుకున్నారని మంత్రి అనిల్ ఫైర్ అయ్యారు. ఇప్పుడు జోలె పట్టి ఇంకా దోచుకోండి అన్నారు. టైమ్ పదిన్నర అయ్యింది.. ఇక జోలె పట్టుకుని వెళ్లండి అని చంద్రబాబుని ఉద్దేశించి మంత్రి అనిల్ అన్నారు.

ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని

ఏపీ అసెంబ్లీలో మూడు రాజధానులపై చర్చ సందర్భంగా ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని షాకింగ్ కామెంట్స్ చేశారు. దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గురించి ప్రస్తావన తెచ్చిన కొడాలి నాని.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు మరణమే వస్తే.. లేకపోతే దేవుడే ప్రత్యక్షమై అడిగితే దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి లాంటి మరణం కావాలని అడుగుతానని మంత్రి కొడాలి నాని భావోద్వేగంగా చెప్పారు. చనిపోయిన తర్వాత కూడా ప్రజల గుండెల్లో వైఎస్ఆర్ బతికే ఉన్నారని చెప్పారు. అలాంటి అదృష్టం ఎంతమందికి వస్తుందన్నారు. వైఎస్ చేసిన మంచి పనులే జగన్ ను గెలిపించాయని చెప్పారు.