AP cabinet to meet on January 27 to decide on scrapping Legislative Council ( Photo-Twitter)

Amaravathi, January 24: ఏపీ శాసనమండలి (AP Legislative Council) రద్దు చేయాలనే వార్తలు ఊపందుకున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వ (AP Government) నిర్ణయం ఎలా ఉండబోతుందనేది ఇప్పుడు రాజకీయాల్లో సర్వత్రా ఆసక్తిని రేపుతోంది. ఈ వార్తలకు తెరదించేందుకు దీనిపై ఓ స్పష్టత ఇచ్చేందుకు ఆంధ్రప్రదేశ్‌ మంత్రి మండలి (AP Cabinet) జనవరి 27 న సమావేశం కానుంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (AP CM YS Jagan) అధ్యక్షతన సోమవారం ఉదయం 9.30 గంటలకు ఈ కేబినెట్‌ భేటీ జరగనుంది.

కాగా, రాజకీయ అజెండాతో నడుపుతున్న శాసనమండలిని కొనసాగించాలా.. వద్దా అనే దానిపై సుదీర్ఘంగా చర్చించి నిర్ణయం తీసుకుందామని సీఎం వైఎస్‌ జగన్‌ ఇప్పటికే అసెంబ్లీ స్పీకర్‌ తమ్మినేని సీతారాంను కోరిన సంగతి విదితమే. సీఎం వైఎస్‌ జగన్‌ ప్రతిపాదనకు అంగీకరించిన స్పీకర్‌ సోమవారం ఆ అంశాన్ని శాసనసభలో చర్చించేందుకు స్పీకర్ అనుమతించారు.

బిల్లులపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు

ఏపీ ప్రభుత్వం శాసనసభలో ఆమోదించిన మూడు రాజధానులు..సీఆర్డీఏ చట్టం రద్దు బిల్లును మండలిలో ప్రవేశ పెట్టే సమయం నుండి చివరి నిర్ణయం వరకూ ప్రతిపక్షం అడ్డు పడుతూనే ఉంది. చివరకు మండలి ఛైర్మన్ ప్రతిపక్షం డిమాండ్ మేరకు రెండు బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపిస్తూ తీసుకున్న నిర్ణయం..రాజకీయంగా సంచలనంగా మారింది. దీని పైన ఏపీ ముఖ్యమంత్రి జగన్ సీరియస్ గా ఉన్నారు.

ఏపీ శాసనమండలి రద్దుకు దారులు ఏంటీ..?

మండలి ఛైర్మన్ తీరును శాసనసభలోనే తన ప్రసంగంలో తప్పు బట్టారు. ఇది తప్పు అని ఒకవైపు చెబుతూనే మరో వైపు సెలెక్ట్ కమిటీకి ఎలా పంపిస్తారని ప్రశ్నించారు. మండలి నిర్వహణ కోసం సంవత్సరానికి సుమారు రూ 60 కోట్లు ఖర్చు చేస్తున్నామని..మండలి రద్దు చేద్దామని సభలో చర్చ కూడా జరిగింది. దీంతో.. ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయం ఆమోదం కోసమే ఈ నెల 27 న కేబినెట్ సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.

3 రాజధానుల బిల్లు అమోదం, టీడీపీ ఎమ్మెల్యేలపై మండిపడిన ఏపీ సీఎం వైయస్ జగన్

ఇదిలా ఉంటే అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లుపై టీడీపీ చేస్తున్న ప్రచారం తప్పని తేలిపోయింది. ఏపీ శాసన మండలి చైర్మన్‌ ఎంఏ షరీఫ్‌ అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లుపై స్పష్టతనిచ్చారు. బిల్లు సెలెక్ట్‌ కమిటీకి వెళ్లలేదని, సాంకేతిక కారణాలతో అది మండలిలోనే ఆగిపోయిందని అన్నారు. ఆ ప్రక్రియ పూర్తయితేగానీ వికేంద్రీకరణ బిల్లు సెలెక్ట్‌ కమిటీకి వెళ్లదని చెప్పారు. బిల్లు సెలెక్ట్‌ కమిటీకి వెళ్లిందన్న టీడీపీ ప్రచారం అవాస్తవమని వెల్లడించారు.

రాజధానిలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ వ్యవహారంపై విచారణ

ఇక ‘మూడు రాజధానులు’ బిల్లును టీడీపీ సభ్యులు అడ్డుకోవడంపై రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. గురువారం జిల్లాల వ్యాప్తంగా పలు చోట్ల రాస్తారోకోలు, చంద్రబాబు దిష్టిబొమ్మల దహనాలు నిర్వహించారు. ప్రజలు రోడ్లెక్కి చంద్రబాబు, టీడీపీ సభ్యుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ వెన్నుపోటు రాజకీయాలకు వ్యతిరేకంగా విశాఖపట్నం, కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో నిరసన జ్వాలలు ఎగిసిపడ్డాయి.