Amaravati, January 27: ఏపీ క్యాబినెట్ (AP Cabinet) సంచలన నిర్ణయం తీసుకుంది. ఏపీ శాసనమండలిని రద్దు (AP Legislative Council Cancellation) చేస్తూ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. మొదటిది పాలనా వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు (CRDA Cancellation) బిల్లులను శాసనమండలి వ్యతిరేకించి సెలక్ట్ కమిటీకి (Selection committee) పంపిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.
శాసనసభలో వీటికి ఆమోదం తెలిపిన అనంతరం శాసనమండలికి ఈ బిల్లులను పంపించారు. అయితే మండలిలో రూల్ 71 (Rule 71) తీసుకరావడం టీడీపీ ఎమ్మెల్సీలు దీనికి అనుకూలంగా ఓటింగ్ వేయడంతో వైసీపీ షాక్‌కు గురైంది.
మూడు రాజధానులపై ఏపీ గవర్నర్ కీలక వ్యాఖ్యలు
చర్చకు అనుమతించకుండానే..సెలెక్ట్ కమిటీకి ఛైర్మన్ బిల్లులను పంపించడాన్ని సీఎం జగన్ తీవ్రంగా పరిగణించింది. విచక్షణాధికారాన్ని ఉపయోగించి..సెలెక్ట్ కమిటీకి పంపించడం జరిగిందని ఛైర్మన్ షరీఫ్ వెల్లడించారు. దీంతో మండలిని రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
బిల్లులను సెలక్ట్ కమిటీకి పంపలేదన్న శాసనమండలి స్పీకర్
న్యాయ నిపుణులతో సుదీర్ఘంగా చర్చించారు. నేడు జరిగిన సమావేశంలో క్యాబినెట్ మండలి రద్దుకు ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. అనంతరం శాసనసభలో తీర్మానం ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం.
దమ్ముంటే 21మందితో రాజీనామా చేసి రెఫరెండంకి రా
అనంతరం తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపనుంది. పార్లమెంట్ ఉభయసభలు ఆమోదం పొందిన తర్వాత..రాష్ట్రపతి నోటిఫై చేసిన తర్వాతే..శాసనమండలి రద్దు కానుంది.
సీఎం జగన్ (CM YS Jagan)అధ్యక్షతన జరిగిన సమావేశానికి దాదాపు అందరు మంత్రులూ హాజరయ్యారు. మండలి రద్దు అంశాన్ని పిల్లి సుభాష్ చంద్రబోస్ లేవనెత్తగా, కొందరు సీనియర్ మంత్రులు మాత్రం కొన్ని సూచనలు చేసినట్టు సమాచారం.
3 రాజధానుల బిల్లు అమోదం, టీడీపీ ఎమ్మెల్యేలపై మండిపడిన ఏపీ సీఎం వైయస్ జగన్
మరో ఏడాదిలో ఎలాగైనా మండలిలో బలం పెరుగుతుందని, పదవులు లేని పార్టీ నేతలకు స్థానం కల్పించవచ్చని, వారు చెప్పగా, అప్పటికే రద్దుపై ఓ నిర్ణయానికి వచ్చేసిన సీఎం, బిల్లులను అడ్డుకునే సభలు ఎందుకని ప్రశ్నించినట్టు తెలుస్తోంది. దీంతో మంత్రులంతా ఆయన నిర్ణయానికి ఆమోదం పలికారు.
అయితే శాసన మండలి రద్దు ప్రాసెస్ నెలలో పూర్తి కావొచ్చు.. లేదంటే పదేళ్లు పట్టొచ్చు. ఇంత కాలం అని నిర్దిష్ట గడువేం లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సయోధ్యను బట్టి అది ఆధారపడి ఉంటుంది. ఒకవేళ పార్లమెంట్ ఆమోదం లభించకపోతే మాత్రం.. శాసన మండలి రద్దు కష్టమేనని రాజ్యాంగ నిపుణులు అంటున్నారు.
మరికాసేపట్లో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానుండగా, తొలుత కొన్ని బిల్లులకు ఆమోదం పొంది, ఆపై మండలి రద్దు బిల్లును చర్చకు పెడతారని సమాచారం. మండలి రద్దు బిల్లుకు ఆమోదం లభించిన తరువాత అసెంబ్లీ నిరవధికంగా వాయిదా పడనుంది. అయితే, నేటి అసెంబ్లీ సమావేశాలకు హాజరు కారాదని తెలుగుదేశం పార్టీ ఇప్పటికే నిర్ణయం తీసుకుందన్న సంగతి తెలిసిందే.
ఏపీ శాసనమండలి రద్దుకు దారులు ఏంటీ..?,ఎవరెవరు ఆమోద ముద్ర వేయాలి