Amaravati, January 27: ఏపీ అసెంబ్లీ (Andhra Pradesh Assembly) చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టిన శాసనమండలి రద్దు తీర్మానాన్ని (Abolish Legislative Council) అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ రోజు జరిగిన అసెంబ్లీ సమావేశంలో సభకు హాజరైన సభ్యులంతా తీర్మానానికి అనుకూలంగా ఓటు వేశారు. అనంతరం తీర్మానం ఆమోదం పొందినట్లు అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించారు. రాజ్యాంగంలోని 169 అధికరణ ప్రకారం రద్దు నిర్ణయం తీసుకున్నట్లు స్పీకర్ తెలిపారు.
మండలి రద్దు తీర్మానానికి మద్దతు ఇచ్చే వారు లేచి నిలబడాల్సిందిగా అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం సూచించారు. దీంతో వైసీపీ ఎమ్మెల్యేలతో (YCP MLA's) పాటు జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్, టీడీపీకి చెందిన వల్లభనేని వంశీ, మద్దాలి గిరిధర్ లేచి నిలబడ్డారు. దీంతో సభ్యులను లెక్కించారు.
ఏపీ శాసనమండలి రద్దుకు దారులు ఏంటీ..?,ఎవరెవరు ఆమోద ముద్ర వేయాలి
అనంతరం ఈ తీర్మానాన్ని వ్యతిరేకించేవారు నిలబడాలని కోరారు. వెంటనే తటస్థులను నిలబడాలని సూచించారు. అయితే సోమవారం నాటి అసెంబ్లీకి సమావేశానికి హాజరుకాకూడదని ప్రతిపక్ష టీడీపీ నిర్ణయించిన విషయం తెలిసిందే.
ఏపీ శాసనమండలి రద్దుకు ఏకగ్రీవ తీర్మానం
కాగా మండలిని రద్దు చేయాలని సోమవారం ఉదయం రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించిన విషయం తెలిసిందే. దీనికి అనుగుణంగా పెద్దల సభను రద్దు చేయాలని తీర్మానించి.. దానిని సీఎం జగన్ శాసనసభ ముందు ఉంచారు. దీనిపై రోజంతా సభ్యులు సుదీర్ఘంగా చర్చించారు. రాజకీయ ప్రయోజనాలకు కాకుండా రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని మండలిని రద్దు (Dissolution Of AP Legislative Council) చేస్తున్నట్లు సభ్యులంతా తమ ప్రసంగాల్లో స్పష్టం చేశారు.
అసెంబ్లీలో ఏపీ శాసన మండలి రద్దు తీర్మానంపై సీఎం వైఎస్ జగన్ (Chief Minister YS Jaganmohan Reddy) మాట్లాడుతూ.. ‘ముఖ్యమైన నిర్ణయంపై నేడు శాసనసభ సమావేశం జరుగుతోంది. మండలి రద్దు అనేది విషయం కాదు.. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. మండళ్లు కచ్చితంగా అవసరం అనుకుంటే ప్రతి రాష్ట్రంలో మండలి ఏర్పాటు అయి ఉండేది.
మూడు రాజధానులపై ఏపీ గవర్నర్ కీలక వ్యాఖ్యలు
ఇప్పుడు 28 రాష్ట్రాల్లో కేవలం 6 రాష్ట్రాలకు మాత్రమే మండళ్లు ఉన్నాయి. మాకు మండళ్లు వద్దని అసోం, మధ్యప్రదేశ్, తమిళనాడు వంటి రాష్ట్రాలు కోరుకున్నాయి. ఆర్టికల్ 169 ప్రకారం మండలి రద్దు అధికారం కూడా శాసనసభకే ఉంది.
బిల్లులను సెలక్ట్ కమిటీకి పంపలేదన్న శాసనమండలి స్పీకర్
అసెంబ్లీ ఆమోదం పొందిన ఈ తీర్మానాన్ని త్వరలోనే కేంద్రానికి పంపనున్నారు. పార్లమెంట్ ఉభయ సభలతో పాటు, రాష్ట్రపతి ఆమోదం తెలిపిన అనంతరం సభ పూర్తిగా రద్దు కానుంది. కాగా ఏపీలో శాసనమండలి రద్దు కావడం ఇది రెండోసారి.
3 రాజధానుల బిల్లు అమోదం, టీడీపీ ఎమ్మెల్యేలపై మండిపడిన ఏపీ సీఎం వైయస్ జగన్
ప్రస్తుతం ఏపీ కాకుండా కేవలం అయిదు రాష్ట్రాలలోనే శాసన మండళ్ళు పనిచేస్తున్నాయి. తెలంగాణ, కర్నాటక, మహారాష్ట్ర, ఉత్తర్ ప్రదేశ్, బీహార్ రాష్ట్రాలలోనే కౌన్సిళ్ళు వున్నాయి. గతంలో మండళ్ళను రద్దు చేసి, తిరిగి పునరుద్ధరణ కోరుతున్న రాష్ట్రాల్లో తమిళనాడు, బెంగాల్, పంజాబ్, అస్సాం, మధ్యప్రదేశ్ వున్నాయి. ఇటీవల రాష్ట్ర హోదా నుంచి కేంద్ర పాలిత ప్రాంతంగా మారిన జమ్మూకశ్మీర్‌లో గత ఆగస్టులో మండలి రద్దైంది. అయితే.. మండలిని ఏర్పాటు చేయాలని కోరుతున్న రాష్ట్రాల్లో రాజస్థాన్, ఒడిషా, ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలున్నాయి.