New Delhi, April 29: భారత్‌లో కొన్నిరాష్ట్రాల్లో కరోనా వైరస్ (Coronavirus Outbreak) విజృంభిస్తోంది. గడచిన 24 గంటల్లో కొత్తగా 1,813 పాజిటివ్ కేసులు నమోదు కాగా 71 మంది చనిపోయారని కేంద్ర వైద్యారోగ్యశాఖ తెలిపింది. బుధవారం సాయంత్రం వరకు దేశంలో మొత్తం బాధితుల సంఖ్య ( Coronavirus Cases) 31,787కు చేరింది. ప్రస్తుతం 22,982 మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకు 1,008 మంది ( Coronavirus Deaths) కరోనా వల్ల మరణించారు. బుధవారం సాయంత్రం వరకు 7797 మంది వ్యాధి నుంచి కొలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఐసోలేషన్ నుండి పరార్, కరోనాతో 17 కిలోమీటర్లు నడిచి ఇంటికి చేరిన వృద్ధుడు, ఫ్యామిలీ అంతా క్వారంటైన్‌లోకి, పుణేలో ఘటన
కేరళలో (Kerala) కొత్తగా 10 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇవాళ నమోదయిన కేసులతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 495కి చేరింది. కొత్త కేసుల్లో ముగ్గురు హెల్త్ వర్కర్లు, ఒక జర్నలిస్ట్ ఉన్నట్లు సీఎం పినరయ్ విజయన్ తెలిపారు. అటు యాక్టివ్ కేసుల సంఖ్య 123 ఉండగా..మరో 10 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. అటు ఇవాళ్టి 10 కేసుల్లో 6 కేసులు కొల్లాంలో నమోదైనవేనని ఆయన వెల్లడించారు.
తిరువనంతపురంలో రెండు, కసరగడ జిల్లాలో మరో రెండు నమోదైనట్లు చెప్పారు. మహారాష్ట్రలో (Maharashtra) 400 మంది కరోనా భారీన పడి మరణించారు. అక్కడ కేసుల సంఖ్య 9,318 గా ఉంది. మహారాష్ట్ర తరువాత గుజరాత్ 3,774 కేసులు మరియు 181 మరణాలతో COVID-19తో తీవ్రంగా ప్రభావితమైంది. కరోనా పాజిటివ్ రావడంతో రైల్వే ఉద్యోగి ఆత్మహత్య, ఉత్తరప్రదేశ్‌లో విషాదఘటన, మహిళకు కోవిడ్-19 రావడంతో క్వారంటైన్‌లోకి అక్కడ కాలనీ వాసులు
ఢిల్లీలో ఇప్పటివరకు కనీసం 3,314 కేసులు, 54 మరణాలు నమోదయ్యాయి. రాజస్థాన్, మధ్యప్రదేశ్ వరుసగా 2,364, 2,561 కేసులతో 2 వేల మార్కును దాటాయి. ఉత్తరప్రదేశ్‌లో కనీసం 2,115 కేసులు ఉండగా, తమిళనాడులో ఇప్పటివరకు 2,058 కేసులు నమోదయ్యాయి. 1,000 కి పైగా కేసులు నమోదైన రాష్ట్రాలు తెలంగాణ (1,012), ఆంధ్రప్రదేశ్ (1,332) ఉన్నాయి.
కరోనావైరస్ కేసులను నివేదించిన ఇతర రాష్ట్రాలు మరియు యుటిలను ఓ సారి పరిశీలిస్తే.. పశ్చిమ బెంగాల్ (725), పంజాబ్ (322), ఒడిశా (119), కేరళ (486), జమ్మూ కాశ్మీర్ (565), కర్ణాటక (532) హర్యానా (310), బీహార్ (383), అండమాన్ మరియు నికోబార్ దీవులు (33), అస్సాం (38), చండీగ (్ (56), ఛత్తీస్‌గ h ్ (38), ఉత్తరాఖండ్ (54), హిమాచల్ ప్రదేశ్ (40), జార్ఖండ్ (105), లడఖ్ (22), మణిపూర్ ( 2), అరుణాచల్ ప్రదేశ్ (1), మేఘాలయ (12), మిజోరం (1), పుదుచ్చేరి (8), త్రిపుర (2). గోవాలో ఇప్పటివరకు 7 కేసులు నమోదయ్యాయి.