Coronavirus in UP: కరోనా పాజిటివ్ రావడంతో రైల్వే ఉద్యోగి ఆత్మహత్య, ఉత్తరప్రదేశ్‌లో విషాదఘటన, మ‌హిళ‌కు కోవిడ్-19 రావడంతో క్వారంటైన్‌లోకి అక్కడ కాలనీ వాసులు
Representational Image (Photo Credits: Twitter)

Lucknow, April 29: క‌రోనా పాజిటివ్ అని నిర్థార‌ణ కావ‌డంతో రైల్వే ఉద్యోగి (Railway employee) బుధ‌వారం ఆత్మ‌హ‌త్య‌కు పాల్పడ్డాడు. గ‌త కొన్ని రోజులుగా క్వారంటైన్‌లోనే (quarantine) ఉన్న రైల్వే ఉద్యోగికి కోవిడ్-19 ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా పాజిటివ్ అని తేలింది. దీంతో తీవ్ర మాన‌సిక సంఘ‌ర్ష‌ణ‌కు లోనై ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన యుపీలో జరిగింది. ఐసోలేషన్ నుండి పరార్, కరోనాతో 17 కిలోమీటర్లు నడిచి ఇంటికి చేరిన వృద్ధుడు, ఫ్యామిలీ అంతా క్వారంటైన్‌లోకి, పుణేలో ఘటన

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని ( Uttar pradesh) తుండ్లా నివాసి అయిన రైల్వే ఉగ్యోగి (55) ఎఫ్‌హెచ్ మెడిక‌ల్ కాలేజీలో క్వారంటైన్‌లో ఉంచారు. ఇదే కాల‌నీకి చెందిన ఓ మ‌హిళ‌కు క‌రోనా పాజిటివ్ అని తేల‌డంతో కాల‌నీ లోని మిగితా ఉద్యోగుల‌ను కూడా క్వారంటైన్‌లో ఉంచారు. మంగ‌ళ‌వారం నిర్వ‌హించిన ప‌రీక్ష‌లో స‌ద‌రు ఉద్యోగికి క‌రోనా పాజిటివ్ నిర్దార‌ణ కావ‌డంతో మెడిక‌ల్ కాలేజీలోనే ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డిన‌ట్లు పోలీసులు వెల్ల‌డించారు. మృత‌దేహాన్ని పోస్టుమార్టం నిర్వ‌హించి బందువుల‌కు అందిస్తామ‌ని తుండ్లా ఎస్సై కెపి సింగ్ టోమ‌ర్ తెలిపారు. వణికిస్తున్న ముంబై మురికివాడ ధారావి, కొత్తగా 42 పాజిటివ్ కేసులు, ఇండియాలో 31 వేలకు పైగా కోవిడ్-19 కేసులు, ఇండోనేషియాకు ప్రధాని మోడీ భరోసా

ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కరోనా వైరస్ కట్టడికి కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ కోవిడ్-19 (UP Coronavirus) పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో బుధవారం ఉదయం నాటికి అందిన సమాచారం మేరకు మొత్తం కరోనా కేసులు 2,000 మార్క్ ను దాటినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. మంగళవారం ఒక్కరోజులోనే కొత్తగా 57 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు ప్రభుత్వం పేర్కొంది.

యూపీలో మొత్తం ఇప్పటి వరకు 2,043 కరోనా వైరస్ కేసులు నమోదైనట్లు ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం 1,612 మంది కరోనా బాధితులకు చికిత్స అందిస్తున్నట్లు ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. రాష్ట్రంలో కోవిడ్-19 కారణంగా 31 మంది మృతి చెందారు. కరోనా నుంచి 400 మంది బాధితులు కోలుకొని డిశ్చార్జ్ అయినట్లు ప్రభుత్వం తెలిపింది.