Coronavirus in India | (Photo Credits: PTI)

New Delhi, April 29: భారత్‌లో కరోనావైరస్ కేసులు (COVID-19 in India) పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో భారత్‌లో 73 మంది కరోనాతో (COVID-19 Deaths in India) మరణించారు. దీంతో దేశంలో మొత్తం కరోనా మృతుల సంఖ్య 1007కి చేరింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ బుధవారం ఉదయం హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. ఇప్పటివరకు భారత్‌లో 31,332 కరోనా కేసులు నమోదయ్యాయని తెలిపింది. సుప్రీంకోర్టు రిజిస్ట్రార్‌కు క‌రోనా వైర‌స్, లాలూ ప్రసాద్ యాదవ్‌కు పట్టుకున్న క‌రోనా భ‌యం

7,695 మంది కరోనా నుంచి కోలుకున్నారని, ప్రస్తుతం దేశంలో 22,629 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయని వెల్లడించింది. కాగా అత్యధికంగా మహారాష్ట్రలో 9,318 కరోనా కేసులు నమోదు కాగా, 400 మంది మృతిచెందారు. ఆ తర్వాత గుజరాత్‌లో 3,744, ఢిల్లీలో 3,314, మధ్యప్రదేశ్‌లో 2,387, రాజస్తాన్‌లో 2,364, తమిళనాడులో 2,058, ఉత్తరప్రదేశ్‌లో 2,053 కరోనా కేసులు నమోదయ్యాయి.  ప్లాస్మా థెరఫీ జాగ్రత్తగా చేయకుంటే ప్రాణాలకే ముప్పు, ప్లాస్మా థెరఫీని ఐసీఎంఆర్‌ ప్రయోగాత్మకంగా పరిశీలిస్తోంది, కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడి

కరోనా వైరస్‌ వ్యాప్తి కారణంగా ఉత్పన్నమవుతున్న సవాళ్లను ఎదుర్కోవడానికి భారత్, ఇండోనేషియా మధ్య సన్నిహిత సహకారం అవసరమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ఆకాంక్షించారు. ఈ సంక్షోభ సమయంలో ఇరుదేశాల మధ్య ఔషధ ఉత్పత్తుల సరఫరాకు అంతరాయం కలగకుండా భారత్‌ తనవంతు కృషి చేస్తుందని ఇండోనేషియా అధ్యక్షుడు జోకోవికి హామీ ఇచ్చారు. బ్యాంకు రుణాల ఎగవేత కేసు, బీజేపీపై విమర్శలు ఎక్కుపెట్టిన రాహుల్ గాంధీ, స్కామర్లంతా బీజేపీ సన్నిహిత మిత్రులేనన్న కాంగ్రెస్ ఎంపీ

కరోనా ఉత్పాతంపై జొకోవితో చర్చించినట్టు నరేంద్రమోదీ మంగళవారం ట్వీట్‌ చేశారు. ఇరుదేశాల మధ్య ఉన్న బలమైన ద్వైపాక్షిక సంబంధాలు కరోనా మహమ్మారిపై పోరాడేందుకు ఉపయోగపడతాయని ప్రధాని వ్యాఖ్యానించారు.

Here's PM Tweet

ఇదిలా ఉంటే మహారాష్ట్ర రాజధాని ముంబయిలోని ధారావి స్లమ్‌ ఏరియాలో (Mumbai Slum Area) కరోనా వైరస్‌ కేసులు పెరిగిపోతున్నాయి. మంగళవారం ఒక్కరోజే అక్కడ కొత్తగా 42 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మొత్తంగా ధారవిలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 330కి చేరుకోగా, మృతుల సంఖ్య 18కి చేరుకుంది. నిన్న చనిపోయిన నలుగురిలో ముగ్గురు పురుషులు, ఒక మహిళ ఉన్నారు.

ఇద్దరు మున్సిపల్‌ కార్మికులకు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ కావడంతో.. వారితో పాటు కలిసి పని చేసిన మరో 20 మందిని క్వారంటైన్‌కు తరలించారు. 16 ఏళ్ల బాలికకు కూడా కరోనా సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. మహారాష్ట్రలో ఇప్పటి వరకు 9,318 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. 400 మంది మరణించారు. ఈ వైరస్‌ నుంచి 1,388 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు.