Plasma Therapy in India for Coronavirus (Photo Credits: PTI)

New Delhi, April 28: కరోనా సోకిన వారికి వ్యాధిని నయం చేసే నిమిత్తం పలు రాష్ట్రాలు ప్రయోగాత్మకంగా అనుసరిస్తున్న ప్లాస్మా థెరపీపై (Plasma Therapy in India) కేంద్ర ప్రభుత్వం సంచలన ప్రకటన చేసింది. ప్లాస్మా థెరపీ నిర్ధారిత చికిత్స విధానం కాదని, ఇది కేవలం ప్రయోగాత్మక దశలోనే ఉందని కేంద్రం స్పష్టం చేసింది. ప్రస్తుతం ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ICMR) ప్లాస్మా థెరపీపై పరిశోధన జరుపుతోందని కేంద్రం ప్రకటించింది. గాంధీ ఆస్పత్రిలో ఇకనుంచి ప్లాస్మా థెరపీ, కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్, 32 మంది ప్లాస్మా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారంటూ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ లేఖ

కరోనా వైరస్‌కు చికిత్సగా ప్లాస్మా థెరఫీని (Plasma Therapy for COVID 19) వాడవచ్చనేందుకు ఇంకా ఎలాంటి ఆధారాలు లభించలేదని తెలిపింది. ప్లాస్మా థెరఫీని జాగ్రత్తగా చేయకుంటే ప్రాణాలకే ముప్పు ఏర్పడే ప్రమాదం ఉందని పేర్కొంది.కరోనా నుంచి కోలుకునేందుకు ప్లాస్మా థెరపీ నిరూపిత చికిత్స విధానం కాదని, ఈ విధానాన్ని ఎవరూ అనుసరించవద్దని కేంద్రం సూచించింది. ప్లాస్మా చికిత్స విధానాన్ని అనుసరించడం కరోనా బాధితుడికి ప్రమాదకరమని, అంతేకాకుండా చట్ట విరుద్ధమని కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ స్పష్టం చేశారు. కరోనా నియంత్రణపై గుడ్ న్యూస్, సానుకూల ఫలితాలను ఇస్తోన్న ప్లాస్మా చికిత్స, మీడియాకు వెల్లడించిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్

ప్లాస్మా థెరపీ ప్రయోగ దశలోనే ఉందని, ఐసీఎంఆర్ అధ్యయనం పూర్తయ్యే లోపు, ఈ చికిత్స సరైందేనని శాస్త్రీయ నిరూపణ జరిగే వరకూ ప్లాస్మా థెరపీని కేవలం ప్రయోగపరంగానే అనుసరించాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.

Take a Look at the Tweets:

ఇదిలా ఉంటే, ఇప్పటికే ప్లాస్మా థెరపీని దేశంలోని పలు రాష్ట్రాలు అనుసరిస్తున్నాయి. కరోనా నుంచి కోలుకున్న వారు స్వచ్ఛందంగా రక్తాన్ని దానం చేయాలని కోరుతున్నాయి. కేంద్రం తాజా ప్రకటనతో ఆయా రాష్ట్రాలు డైలమాలో పడ్డాయి. దేశంలో 29 వేలు దాటిన కరోనా కేసులు, మహారాష్ట్రలోనే 8 వేలకు పైగా కోవిడ్-19 పాజిటివ్ కేసులు, ఢిల్లీలో 3 వేలు దాటిన కరోనా కేసుల సంఖ్య

గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 1543 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో పాజిటివ్‌ కేసుల సంఖ్య 29,435కి చేరిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ మంగళవారం మీడియా సమావేశంలో వెల్లడించారు. 6868 మంది వైరస్‌ రోగులు కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారని తెలిపారు.

రికవరీ రేటు 23.3 శాతానికి చేరడం, కేసులు రెట్టింపయ్యే డబ్లింగ్‌ రేటు 10.2 రోజులకు పెరగడం ఊరట కలిగించే పరిణామమని అన్నారు. దేశవ్యాప్తంగా మహమ్మారి బారినపడి మరణించిన వారి సంఖ్య 934కు పెరిగిందని చెప్పారు. 17 జిల్లాల్లో 28 రోజులుగా ఎలాంటి కేసులూ వెలుగుచూడలేదని అన్నారు. కరోనా కేసులు అధికంగా ఉన్న గుజరాత్‌కు రెండు కేంద్ర బృందాలు చేరుకున్నాయని తెలిపారు.