New Delhi, April 24: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ను (Coronavirus) కంట్రోల్ చేసే చర్యల్లో భాగంగా రోగులకు అందిస్తున్న ప్లాస్మా చికిత్స (Plasma Therapy) సానుకూల ఫలితాలనిస్తోందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Delhi CM Arvind Kejriwal) అన్నారు. లోక్ నాయక్ జై ప్రకాశ్ నారాయణ్ ఆస్పత్రిలో ( LNJP Hospital) నలుగురి కరోనా పేషెంట్లపై ఈ మేరకు నిర్వహించిన క్లినికల్ ట్రయల్స్ విజయవంతమైనట్లు (Plasma Therapy Results) ఆయన పేర్కొన్నారు. ప్లాస్మా చికిత్స అనంతరం ఇద్దరు పేషెంట్లు కోలుకున్నారని.. వారిని త్వరలోనే డిశ్చార్జ్ చేయనున్నట్లు తెలిపారు. వలసవాదులకు అమెరికా షాక్, 60 రోజుల పాటు అమెరికాలోకి ఎవరూ ఉద్యోగాల కోసం రాకుండా నిషేధం, ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు 484 బిలియన్ డాలర్ల ప్యాకేజీ
ఈ క్రమంలో ప్లాస్మా థెరపీని మరింత విస్తృతం చేసేందుకు కేంద్రం నుంచి అనుమతి కోరనున్నట్లు పేర్కొన్నారు. అయితే ఇప్పుడే ఈ థెరపీపై పూర్తి అవగాహనకు రాలేమని కేవలం ప్లాస్మా చికిత్సతో రోగులు కోలుకున్న దాఖలాలు లేవని ఢిల్లీ సీఎం అభిప్రాయపడ్డారు. కాగా కరోనాపై పోరులో ప్రస్తుతానికి ఇదొక్కటే మన ముందున్న మార్గమని పేర్కొన్నారు. అయితే కరోనా నుంచి కోలుకున్న వారు ప్లాస్మా దానం చేయడానికి ముందుకు వస్తేనే ఈ థెరపీని ముందుకు తీసుకువెళ్లే అవకాశం ఉంటుందని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అన్నారు.
Take a Look at the Tweets:
We are happy with the positive results in the 4 patients. Blood & plasma is ready for 2-3 other patients that we have at LNJP hospital, we may give them the plasma therapy today: Dr. SK Sarin, Director, Institute of Liver & Biliary Science pic.twitter.com/iznlTHDme0
— ANI (@ANI) April 24, 2020
At this time, we need those people who have recovered from #COVID19 and are at their homes. We need them to show their patriotism and donate blood plasma: Dr. SK Sarin, Director, Institute of Liver & Biliary Science pic.twitter.com/MdUxtYts0I
— ANI (@ANI) April 24, 2020
ఈ విషయం గురించి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ లివర్ అండ్ బైలరీ సైన్స్ డైరెక్టర్ ఎస్‌కే సరీన్ మాట్లాడుతూ ఎల్‌ఎన్‌జేపీ ఆస్పత్రిలోని మరో ముగ్గురు కరోనా పేషెంట్లకు ఎక్కించేందుకు రక్తం, ప్లాస్మా సిద్ధంగా ఉంది. ఈరోజే వారికి ప్లాస్మా థెరపీ ప్రారంభిస్తాం. ఈ చికిత్స సానుకూల ఫలితాలను ఇవ్వడం సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే కన్వాల్సెంట్ ప్లాస్మా చికిత్సపై పరిశోధనలు జరిపేందుకు ముందుకొచ్చే సంస్థలు దరఖాస్తు చేసుకోవాలంటూ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) సూచించింది. ఢిల్లీలో ఇప్పటి వరకు 2376 కరోనా కేసులు నమోదు కాగా.. 50 మరణాలు సంభవించాయి.