US Immigration Ban: వలసవాదులకు అమెరికా షాక్, 60 రోజుల పాటు అమెరికాలోకి ఎవరూ ఉద్యోగాల కోసం రాకుండా నిషేధం, ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు 484 బిలియన్‌ డాలర్ల ప్యాకేజీ
US President Donald Trump (Photo Credits: Getty Images/File)

Washington, Apr 24: కరోనా సంక్షోభంలో కూరుకుపోయిన అమెరికా (America) తమ దేశ పౌరుల కోసం కీలక నిర్ణయం (US Immigration Ban) తీసుకుంది. అమెరికాలోకి కొన్ని రకాలైన వలసలను రానున్న 60 రోజులపాటు నిషేధిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ అయ్యాయి. పులులు, సింహాలకు కరోనావైరస్‌, జూ టైగర్‌ మౌంటైన్‌లో 3 పులులకు, మూడు ఆఫ్రికన్‌ సింహాలకు కోవిడ్-19 పాజిటివ్

దేశ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేసిన కోవిడ్‌-19 (COVID-19 in US) కారణంగా ఉద్యోగ భద్రత కోల్పోతున్న అమెరికన్ల కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ (US President Donald Trump) పేర్కొన్నారు. అమెరికాలోకి ఉద్యోగాల కోసం రావాలనుకుంటున్న వారికే ఈ నిషేధ ఉత్తర్వులు వర్తిస్తాయని, ఇప్పటికే అమెరికాలో ఉంటున్న వారికి ఇవి వర్తించవన్నారు.

కరోనాతో దాదాపు 2 కోట్ల మంది అమెరికన్లు ఉద్యోగాలు కోల్పోయారని, వారికి మళ్లీ ఉపాధి కల్పించాల్సిన అవసరం∙ఉందన్నారు. వలసలకు విరామం ఇవ్వడం ద్వారా.. కరోనా ప్రభావం అంతమై, మళ్లీ ఆర్థిక వ్యవస్థ గాడిన పడ్డాక దేశంలో ఉద్యోగ అవకాశాలు మొదట అమెరికన్లకే లభిస్తాయన్నారు. అమెరికన్లకు కాకుండా, కొత్తగా వచ్చిన విదేశీయులకు ఉద్యోగావకాశాలు కల్పించడం అన్యాయమవుతుందన్నారు. 60 రోజుల తర్వాత నిషేధం తొలగించాలా? కొంతకాలం కొనసాగించడమా? అనేది నిర్ణయిస్తామని చెప్పారు. కరోనావైరస్ మానవ సృష్టే, చైనా వుహాన్ ల్యాబొరేటరీ నుంచి ఈ వైరస్ బయటకు వచ్చింది, నోబెల్‌ గ్రహీత మాంటగ్నియర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

ఇవి అమల్లోకి వచ్చిన తేదీ నాటికి అమెరికా వీసా, లేదా గ్రీన్‌ కార్డ్‌ ఉన్నవారికి ఈ ఉత్తర్వులు వర్తించబోవు. ఆ తేదీ నాటికి విదేశాల్లో ఉన్న, ఎలాంటి ఇమిగ్రంట్‌ వీసా కానీ, లేదా వేరే ఏ అధికారిక ట్రావెల్‌ డాక్యుమెంట్‌ కానీ లేనివారికే అవి వర్తిస్తాయి. ఉద్యోగ నిమిత్తం అమెరికాకు రావాలనుకుంటున్న వైద్యులు, ఇతర వైద్య సిబ్బందికి, ఇన్వెస్ట్‌మెంట్‌ కేటగిరీలో చట్టబద్ధమైన శాశ్వత నివాసితులుగా రావాలనుకుంటున్నవారికి ఈ నిషేధం వర్తించదు. మాయమైన చైనా జర్నలిస్ట్ మళ్లీ ప్రత్యక్షం, వుహాన్‌లోని వైరాలజీ ల్యాబ్‌ను సందర్శించిన తరువాత మాయం, క్వారంటైన్‌లోకి తీసుకువెళ్లారని వెల్లడించిన లీ జహువా

అమెరికన్ల జీవిత భాగస్వాములు, వారి 21 ఏళ్లలోపు పిల్లలు, అమెరికన్లు దత్తత తీసుకోవాలనుకునేవారు నిషేధ పరిధిలోకి రారు. అన్ని రకాల ఇమిగ్రంట్‌ వీసాలపై తాత్కాలిక నిషేధం విధించబోతున్నట్లు ఇటీవల ట్రంప్‌ చెప్పడం తెల్సిందే.

ఐటీ నిపుణులు, వ్యవసాయ కార్మికుల అందుబాటుపై ఈ నిర్ణయం తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుందని పారిశ్రామిక, రాజకీయ వర్గాలు విమర్శించాయి. నవంబర్‌లో అధ్యక్ష ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కరోనాను కట్టడి చేయడంలో తన వైఫల్యాన్ని.. ట్రంప్‌ ఇలా కప్పిపుచ్చుకుంటున్నారని డెమొక్రాట్లు విమర్శలు గుప్పించారు.

ఇదిలా ఉంటే వలసలపై తాత్కాలిక నిషేధం విధిస్తూ అమెరికా జారీ చేసిన ఉత్తర్వులను భారత ప్రభుత్వం అధ్యయనం చేస్తోందని అధికార వర్గాలు తెలిపాయి. ఆ ఉత్తర్వులు భారతీయులపై, భారత్‌–అమెరికాల మధ్య సంబంధాలపై చూపే ప్రభావాన్ని అంచనా వేస్తున్నామని పేర్కొన్నాయి.

ఆర్థిక వ్యవస్థను గాడినపెట్టేందుకు, కరోనా నివారణ చర్యలకు అగ్రరాజ్యం అమెరికా భారీ ప్యాకేజీ ప్రకటించింది. కరోనా ఉపశమన చర్యల్లో భాగంగా 484 బిలియన్‌ డాలర్ల నిధులు కేటాయిస్తూ రూపొందించిన బిల్లును హౌజ్‌ ఆఫ్‌ రిప్రజెంటేటివ్స్‌ గురువారం ఆమోదించింది.

కరోనా కల్లోలం కారణంగా ఆర్థికంగా నష్టాలు చవిచూసిన చిన్న వ్యాపారులను ఆదుకునేందుకు, ఆస్పత్రుల్లో సౌకర్యాలు మెరుగుపరచడం, కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షల నిర్వహణ కోసం ఈ మొత్తాన్ని వెచ్చించాలని పేర్కొంది. డెమొక్రటిక్‌ పార్టీ సభ్యుల సారథ్యంలోని ప్రతినిధుల సభ నిర్ణయాన్ని అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ స్వాగతించారు. గురువారం సాయంత్రం ఈ బిల్లుపై సంతకం చేసి చట్టంగా రూపొందించనున్నట్లు పేర్కొన్నారు.

కాగా కోవిడ్‌-19 దాటికి అమెరికాలో దాదాపు 50 వేల మంది మృత్యువాత పడ్డారు. 23 రాష్ట్రాల్లో కరోనా కొత్త కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. మరికొన్ని రాష్ట్రాల్లో కరోనా లక్షణాలతో బాధ పడుతున్న వారి సంఖ్య గణనీయంగా పడిపోయింది. త్వరలోనే కోవిడ్‌-19కు వ్యాక్సిన్‌ కనుగొనబోతున్నామని ట్రంప్ పేర్కొన్నారు.