Bronx Zoo Tigers Coronavirus: పులులు, సింహాలకు కరోనావైరస్‌, జూ టైగర్‌ మౌంటైన్‌లో 3 పులులకు, మూడు ఆఫ్రికన్‌ సింహాలకు కోవిడ్-19 పాజిటివ్
Representational Image | (Photo Credits: Unsplash)

New York, APril 24: న్యూయార్క్ లోని ఓ జూలో నాలుగు పులులు, 3 సింహాలకు వైరస్ (Bronx Zoo Tigers Coronavirus) సోకింది. గత నెలలో ఇదే జూలోని నదియా అనే నాలుగు సంవత్సరాల ఆడ పులి కరోనా వైరస్‌ బారిన పడింది. ఆడ మలయన్ పులికి వైరస్ సోకినప్పుడు ఎలా ప్రవర్తించిందో వీటికి అవే లక్షణాలు ఉన్నాయని అధికారులు అంటున్నారు. వాటి ముక్కు, గొంతు, శ్వాస నాళం నుంచి శాంపుల్స్ తీసి వైద్య పరీక్షలకు పంపించామని తెలిపారు. జూలో ఇప్పటి వరకు మొత్తం ఎనిమిది జంతువులు కరోనా బారినపడ్డాయని పేర్కొన్నారు. వైరస్‌ సోకినప్పటికి ఆ జంతువులు మామూలుగానే ఉంటున్నాయని, తింటున్నాయని, దగ్గు కూడా తగ్గిందని తెలిపారు. కరోనా మరో షాక్, పులికి కరోనా వైరస్ పాజిటివ్, న్యూయార్క్‌లోని బ్రాంక్స్ జూ‌లోని ఆడపులికి కోవిడ్ 19. ఖంగుతిన్న అధికారులు

న్యూయార్క్ (New York) నగరంలోని బ్రాంక్స్‌ జూలో నాలుగు పులులకు (Tigers), మూడు సింహాలకు (Lions) కరోనా వైరస్‌ సోకిన విషయాన్ని బుధవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో జూ అధికారులు ధ్రువీకరించారు. అక్కడ ఉన్న జూ టైగర్‌ మౌంటైన్‌లో ఉంటున్న మూడు పులులకు, మరో మూడు ఆఫ్రికన్‌ సింహాలకు పొడి దగ్గుతో కూడిన లక్షణాలు కనిపించాయని, ఓ పులికి మాత్రం లక్షణాలు లేకపోయినా పరీక్షల్లో పాజిటివ్‌ వచ్చిందని వెల్లడించారు. అయితే వాటికి ఎటువంటి ఎనస్థీషియా ఇవ్వలేదని, మల పరీక్ష ద్వారా కరోనాను పరీక్షించామని తెలిపారు.

మల పరీక్ష ద్వారా తమ అనుమానం నిజమైందని, జూలో ఇప్పటి వరకు మొత్తం ఎనిమిది జంతువులు కరోనా బారినపడ్డాయని పేర్కొన్నారు. వైరస్‌ సోకినప్పటికి ఆ జంతువులు మామూలుగానే ఉంటున్నాయని, తింటున్నాయని, దగ్గు కూడా తగ్గిందని తెలిపారు.