Hyderabad, April 28: హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో ప్లాస్మా థెరపీకి (Plasma Therapy in Gandhi Hospital) కేంద్రం అనుమతి లభించింది. కరోనావైరస్ (Coronavirus) నుంచి కోలుకున్న వారి ప్లాస్మాను వైద్యులు సేకరించనున్నారు. సీరియస్ కండీషన్‌లో ఉన్నవారికి ఈ ప్లాస్మా థెరపీ ఉపయోగపడనుంది. కరోనా సోకి ప్రమాదకర స్థితిలో ఉన్న ఉంటే వారికి ప్లాస్మా థెరపీ అందించనున్నారు. ఇటీవలే.. దేశంలోనే తొలిసారి ఓ కరోనా పేషెంట్ ప్లాస్మా థెరపీతో (Plasma Therapy) పూర్తి స్థాయిలో కోలుకున్నాడు. గత 24 గంటల్లో తెలంగాణలో కేవలం 2 పాజిటివ్ కేసులు మాత్రమే నమోదు, రాష్ట్రంలో 1003కు చేరిన మొత్తం కోవిడ్-19 కేసుల సంఖ్య, జిల్లాల వారీగా ప్రస్తుతం కేసుల వివరాలు ఇలా ఉన్నాయి
కరోనా లక్షణాలతో ఢిల్లీ సాకేత్ ప్రాంతంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరిన 49 ఏళ్ల బాధితుడికి చేసిన ప్లాస్మా థెరపీ చేశారు. ఆ థెరపీతో అతడు పూర్తిగా కోలుకున్నాడు. కరోనాకు మందు లేకపోవటంతో ప్రస్తుతం ప్లాస్మా థెరపీనే చేస్తున్నారు. ఈ విధానంలో కరోనా నుంచి కోలుకున్న పేషెంట్ రక్తం నుంచి ప్లాస్మా సేకరిస్తారు. అందులోని యాంటీ బాడీలను కరోనా పేషెంట్లకు ఎక్కిస్తారు. యాంటీ బాడీలో రక్తం లోకి వెళ్లి కరోనా వైరస్ తో ఫైట్ చేస్తాయి.
ఐతే ప్లాస్మా థెరపీ లో బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అయ్యే డోనర్స్ అవసరం ఉంటుంది. ఈ నేపథ్యంలో 32 మంది ప్లాస్మా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారంటూ మంత్రులు కేటీఆర్, ఈటల రాజేందర్‌కు ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ (patients, MIM MP Asaduddin Owaisi) లేఖ పంపారు. కరోనా నియంత్రణపై గుడ్ న్యూస్, సానుకూల ఫలితాలను ఇస్తోన్న ప్లాస్మా చికిత్స, మీడియాకు వెల్లడించిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్
రాష్ట్రంలో మొత్తం కోవిడ్-19 బాధితుల సంఖ్య మంగళవారం ఉదయం నాటికి 1003 కి చేరింది. నిన్న సోమవారం మరో 16 మంది డిశ్చార్జ్ అయ్యారు, కొత్తగా మరణాలేమి నమోదు కాలేదు. మరణాల సంఖ్య 25 గానే ఉంది. కరోనావైరస్ రోగులకు ప్లాస్మా చికిత్స ద్వారా ట్రీట్‌మెంట్, ట్రయల్స్ ప్రారంభించిన ఢిల్లీ సర్కారు, అసలేంటి ఈ చికిత్స ?
రోగ నిరోధక వ్యవస్థ మెరుగ్గా ఉన్నవారిపై కోవిడ్-19 వైరస్ ప్రభావం చాలా తక్కువగా ఉంటుంది. వారి శరీరంలోకి వైరస్ ప్రవేశించగానే, వారిలోని రోగనిరోధక కణాలు (తెల్ల రక్త కణాలు) దాడి చేసి ఆ వైరస్‌ను నాశనం చేస్తాయి. అందుకే కోవిడ్-19 నుంచి పూర్తిగా కోలుకున్న వారి రక్తంలో రోగనిరోధక కణాల సంఖ్య బాగా వృద్ధి చెంది ఉంటుంది. అయితే కొందరిలో రోగనిరోధక శక్తి చాలా బలహీనంగా ఉంటుంది.
అలాంటి వారిపై ఈ వైరస్ తీవ్ర ప్రభావం చూపుతుంది. వారి శరీరంలో రోగనిరోధక కణాలను పెంచగలిగితే వ్యాధిని ఎదుర్కొనే వీలుంటుంది. అందుకు పరిష్కారంగా, కోవిడ్-19 నుంచి పూర్తిగా కోలుకున్న వ్యక్తుల నుంచి ప్లాస్మాను సేకరించి, అదే వైరస్‌తో బాధపడుతున్న మిగతా రోగుల శరీరంలోకి ఎక్కిస్తారు. ఈ వైద్య విధానాన్నే ప్లాస్మా థెరపీ అంటారు.