Arvind Kejriwal (Photo Credits: ANI)

New Delhi, April 16: ఢిల్లీ సర్కారు కోవిడ్-19 (COVID-19) మీద పోరాటానికి సరికొత్త నిర్ణయం తీసుకుంది. క‌రోనావైరస్ (Coronavirus) సోకిన వారికి త్వ‌ర‌లోనే ప్లాస్మా చికిత్స (Plasma Therapy) ద్వారా ట్రీట్‌మెంట్ అందించేందుకు ట్ర‌య‌ల్స్ ప్రారంభించింది. ఈ మేరకు ఢిల్లీ ముఖ్య‌మంత్రి అర‌వింద్ కేజ్రీవాల్ (Delhi CM Arvind Kejriwal) గురువారం ప్ర‌క‌టించారు.

గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్న ధారావి, కొత్తగా 11 కేసులు నమోదు

దీనికి సంబంధించి కేంద్రం నుంచి అనుమ‌తి కూడా ల‌భించింద‌ని తెలిపారు. రాబోయే 3-4 రోజుల్లో దీనికి సంబంధించిన ట్ర‌య‌ల్స్ ప్రారంభ‌మ‌వుతుంద‌ని, ఇది విజ‌య‌వంత‌మైతే త్వ‌ర‌లోనే కరోనా రోగుల‌కు ఈ విధ‌మైన చికిత్స అందిస్తామ‌ని వెల్ల‌డించారు.

ప్రపంచంలో కరోనావైరస్ నివారణకు ఇంతవరకు మందు ఎవరు కనుక్కొలేదు. అయితే ప్లాస్మా చికిత్స చాలా ప్రత్యేకమని చెప్పవచ్చు. ఈ ప్లాస్మా థెర‌పీలో క‌రోనా సోకి కోలుకున్న వ్యక్తి శ‌రీరం నుంచి ర‌క్తాన్ని సేక‌రించి.. అందులో ఉండే ప్లాస్మాను వేరు చేస్తారు. ఆ ప్లాస్మాను ప్రాణాపాయ స్థితిలో ఉన్న క‌రోనా రోగి ర‌క్తంలోకి ఎక్కిస్తారు. దీంతో 2 రోజుల్లోనే ఆ రోగి సాధార‌ణ స్థితికి చేరుకుంటాడు. ఈ క్ర‌మంలో క‌రోనా వ‌చ్చి ప్రాణాపాయ స్థితిలో ఉన్నా ఈ విధానం ద్వారా రోగుల‌ను బ‌తికించేందుకు అవ‌కాశం ఉంటుంది.

Here's Delhi CM Tweet

ఈ ప్రక్రియ అగ్ర రాజ్యం అమెరికాతో పాటు చైనాలో విజయవంతం కావడంతో కరోనా అధికంగా ఉన్న ఇటలీ, స్పెయిన్, జర్మనీ, బ్రిటన్ లలో కూడా ప్లాస్మా ధెరపికి వైద్యులు మొగ్గు చూపుతున్నారు. మన దేశంలో కూడా ప్లాస్మా థెరిపికి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ కేరళకు అనుమతిచ్చింది. ఇక భార‌త్‌లో మొత్తం క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 12,759 కు చేరింద‌ని కేంద్ర ఆరోగ్య శాఖ ప్ర‌క‌టించింది. గ‌త 24 గంట‌ల్లోనే 941 కొత్త కేసులు న‌మోదైన‌ట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ లావ్ అగర్వాల్ తెలిపారు. మరణాల సంఖ్య 420గా ఉంది. 1515 మంది రికవరీ అయ్యారు.