India COVID-19: కరోనాతో మరో డాక్టర్ మృతి, ఇండియాలో 30 వేలకు చేరువలో కోవిడ్-19 కేసులు, సుప్రీంకోర్టు రిజిస్ట్రార్‌కు క‌రోనా వైర‌స్, లాలూ ప్రసాద్ యాదవ్‌కు పట్టుకున్న క‌రోనా భ‌యం
Coronavirus Outbreak. | (Photo Credits: Pixabay)

New Delhi, April 28: ఇండియాలో 24 గంటల వ్యవధిలో కరోనావైరస్‌తో (Coronavirus Deaths) 51 మంది మరణించారు. కొత్తగా 1594 పాజిటివ్‌ కేసులు నమోదవడంతో మంగళవారం సాయంత్రానికి దేశంలో కరోనా (India COVID-19 Bulletin) సోకిన వారి సంఖ్య 29,974కి చేరింది. ప్లాస్మా థెరఫీ జాగ్రత్తగా చేయకుంటే ప్రాణాలకే ముప్పు, ప్లాస్మా థెరఫీని ఐసీఎంఆర్‌ ప్రయోగాత్మకంగా పరిశీలిస్తోంది, కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడి

దేశవ్యాప్తంగా కోలుకున్నవారి సంఖ్య 7027కు పెరగగా..ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 937కు చేరింది. దేశవ్యాప్తంగా 22010 మంది బాధితులు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అత్యధికంగా మహారాష్ట్ర(8590), గుజరాత్‌(3548), ఢిల్లీ(3108), మధ్యప్రదేశ్‌(2368), రాజస్థాన్‌(2262) రాష్ట్రాల్లో అత్యధికంగా పాజిటివ్‌ కేసులు వెలుగులోకి వచ్చాయి.

జ‌మ్మూకశ్మీర్ లో క‌రోనా పాజిటివ్ కేసులు (Coronavirus Outbreak) రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. కొత్త‌గా 19 పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. గ‌డిచిన 24 గంటల్లో ఈ కేసులు న‌మో‌దవ‌గా..అన్నీ క‌శ్మీర్ డివిజ‌న్ కు చెందిన‌వే. వీటితో జమ్మూక‌శ్మీర్ (Jammu Kashmir)లో ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం కేసుల సంఖ్య‌ 565కు చేరుకుందని ఆ రాష్ట్ర ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రీ (ప్ర‌ణాళిక శాఖ‌) రోహిత్ క‌న్సాల్ వెల్ల‌డించారు. మొత్తం కేసుల్లో 381 కేసులు యాక్టివ్ గా ఉన్నాయన్నారు. ఓ వైపు లాక్ డౌన్ కొన‌సాగుతుండ‌గా..స‌రిహ‌ద్దులోని సున్నిత‌మైన ప్రాంతాల్లో భ‌ద్ర‌తా బ‌ల‌గాలు నిరంత‌రం గ‌స్తీ నిర్వ‌హిస్తున్నాయి.

S. No. Name of State / UT Total Confirmed cases (Including 111 foreign Nationals) Cured/Discharged/Migrated Death
1 Andaman and Nicobar Islands 33 11 0
2 Andhra Pradesh 1259 258 31
3 Arunachal Pradesh 1 1 0
4 Assam 38 27 1
5 Bihar 346 57 2
6 Chandigarh 40 17 0
7 Chhattisgarh 37 32 0
8 Delhi 3108 877 54
9 Goa 7 7 0
10 Gujarat 3548 394 162
11 Haryana 296 183 3
12 Himachal Pradesh 40 22 1
13 Jammu and Kashmir 546 164 7
14 Jharkhand 103 17 3
15 Karnataka 520 198 20
16 Kerala 482 355 4
17 Ladakh 22 16 0
18 Madhya Pradesh 2368 361 113
19 Maharashtra 8590 1282 369
20 Manipur 2 2 0
21 Meghalaya 12 0 1
22 Mizoram 1 0 0
23 Odisha 118 37 1
24 Puducherry 8 3 0
25 Punjab 313 71 18
26 Rajasthan 2262 669 46
27 Tamil Nadu 1937 1101 24
28 Telengana 1004 321 26
29 Tripura 2 2 0
30 Uttarakhand 51 33 0
31 Uttar Pradesh 2043 400 31
32 West Bengal 697 109 20
Total number of confirmed cases in India 29974* 7027 937

దేశంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతోందని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్థన్‌ (Union Minister Dr Harsh Vardhan) అన్నారు. గడిచిన ఏడు రోజుల్లో దేశ వ్యాప్తంగా 80 జిల్లాల్లో ఎలాంటి పాజిటివ్‌ కేసులు నమోదు కాలేదని తెలిపారు. అలాగే 47 జిల్లాల్లో గత 14 రోజులుగా కొత్త కేసులు వెలుగుచూడలేదని, గత 21 రోజుల్లోనూ 39 జిల్లాలో కరోనా కేసులు నమోదుకాలేదని వెల్లడించారు. ఇక గడిచిన 28 రోజుల్లో దేశ వ్యాప్తంగా 17 జిల్లాల్లో కేసులేమీ వెల్లడికాలేదని పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో హర్షవర్థన్‌ వివరాలను వెల్లడించారు. రాష్ట్రాల్లో బస్సుల పునరుద్ధరణపై వారం రోజుల్లో స్పందన తెలపండి, కేంద్రాన్ని ఆదేశించిన సుప్రీంకోర్టు, వలస కార్మికుల సమస్యలపై పిటిషన్ విచారణ

దేశ రాజధాని ఢిల్లీలో పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరగడం ఆందోళనకరంగా ఉందని, దీనిపై స్థానిక అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్ష చేపడుతున్నట్లు మంత్రి వెల్లడించారు. కాగా గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 1543 పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయని తెలిపారు. దీంతో దేశంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 29435కి చేరిందన్నారు. ఇప్పటివరకు 6,869 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి కాగా, 934 మంది మృతిచెందారని తెలిపారు. ప్రస్తుతం దేశంలో 21,632 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయన్నారు.

రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) అధినేత, బిహ‌ర్ మాజీ ముఖ్య‌మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ (Lalu Prasad Yadav) కు క‌రోనా భ‌యం ప‌ట్టుకుంది. క‌రోనా పాజిటివ్ వ‌చ్చిన వ్య‌క్తికి చికిత్స అందించిన వైద్యుడే లాలూ ప్ర‌సాద్‌కు కూడా చికిత్స చేయ‌డంతో ఆందోళ‌న‌క‌ర ప‌రిస్థితి ఏర్పడింది. రాంచీలోని రాజేంద్ర ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (రిమ్స్) ఆసుపత్రిలో ఓ వ్య‌క్తికి క‌రోనా పాజిటివ్ అని తేలింది.

అయితే ఇదే హాస్పిట‌ల్‌లో లాలూ కూడా చికిత్స పొందుతున్నారు. అంతేకాకుండా గ‌త మూడు వారాలుగా లాలూకు చికిత్స అందిస్తున్న డాక్ట‌ర్ ఉమేష్‌ప్ర‌సాద్ క‌రోనా బాధితుడికి కూడా వైద్యం చేశారు. దీంతో కోవిడ్ రోగికి వైద్యం అందించిన ఉమేష్‌ప్ర‌సాద్‌తో పాటు, అత‌ని బృందంలోని అంద‌రినీ క్వారంటైన్‌కు పంపుతున్న‌ట్లు రిమ్స్ ప్ర‌క‌టించింది. అంతేకాకుండా వీరిలో ఎవ‌రికైనా క‌రోనా పాజిటివ్ అని తేలితే, లాలూ ప్ర‌సాద్‌కి కూడా ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తామ‌ని పేర్కొంది.

ప‌శ్చిమ‌బెంగాల్‌లో 60 ఏళ్ల ప్ర‌ముఖ సీనియ‌ర్ ఆర్థోపెడిక్ వైద్యుడు బిప్లాబ్ కాంతిదాస్ గుప్తా ఈ వైర‌స్ కార‌ణంగా సోమ‌వారం చ‌నిపోయారు. రాష్ర్టంలో కోవిడ్ కార‌ణంగా మ‌ర‌ణించిన మొట్ట‌మొద‌టి వైద్యుడు ఈయ‌నే అని అధికారులు వెల్ల‌డించారు. ఇదివ‌ర‌కే శ్వాస‌కోస ఇబ్బందుల‌తో భాద‌ప‌డుతున్నా త‌న క‌ర్త‌వ్యాన్ని వీడ‌కుండా రోగుల‌కు వైద్యు సేవ‌లందించారు.

కోవిడ్ ల‌క్ష‌ణాల‌తో సాల్ట్ లేక్ అనే ప్రైవేట్ హాస్పిట‌ల్‌లో చేర‌గా, అప్ప‌టికే ఆయ‌న ఆరోగ్యం క్షీణించింది. వెంటిలేట‌ర్‌పై చికిత్స పొందుతూ సోమ‌వారం ఆయ‌న మ‌ర‌ణించిన‌ట్లు ఆస్ప‌త్రి వ‌ర్గాలు వెల్ల‌డించాయి. ఆయ‌న మృతిపై ప‌శ్చిమ బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ (CM Mamata Banerjee) సంతాపం ప్ర‌క‌టించారు. మీరు చేసిన త్యాగం ఎప్ప‌టికీ మ‌రిచిపోం అంటూ ఆయ‌న సేవ‌ల‌ను కొనియాడారు. ఈ మేర‌కు ట్వీట్ చేశారు.

Here's Mamata Banerjee Tweet

సుప్రీం కోర్టులో ప‌నిచేసే రిజిస్ట్రార్‌కు క‌రోనా వైర‌స్ సోకిన‌ట్లు ఆదివారం నిర్ధార‌ణ అయింది. ఏప్రిల్ 16న కోర్టుకు వ‌చ్చి విధులు నిర్వ‌హించిన ఆయ‌న త‌ర్వాత రెండు రోజులు జ్వ‌రంతో బాధ‌ప‌డ్డాడు. దీంతో అత‌నికి క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా పాజిటివ్ అని తేలింది. దీంతో అత‌డిని ప్ర‌భుత్వ ఆసుప‌త్రికి త‌రలించి చికిత్స అందిస్తున్నారు. అత‌నితో పాటు ప‌నిచేసిన ఇద్దరు రిజిస్ట్రార్ల‌ను క్వారంటైన్‌లో ఉండాల్సిందిగా ఆదేశించారు.‌ మ‌రోవైపు అధికారులు అత‌డు కోర్టు లోప‌ల, బ‌య‌ట ఎవ‌రెవ‌రిని క‌లిశార‌న్న దానిపై వివ‌రాలు సేక‌రిస్తున్నారు.