Coronavirus Lockdown: రాష్ట్రాల్లో బస్సుల పునరుద్ధరణపై వారం రోజుల్లో స్పందన తెలపండి, కేంద్రాన్ని ఆదేశించిన సుప్రీంకోర్టు, వలస కార్మికుల సమస్యలపై పిటిషన్ విచారణ
Supreme Court | (Photo Credits: PTI)

New Dlehi, April 28: దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ (Coronavirus Lockdown) కొనసాగుతున్న నేపథ్యంలో వలస కార్మికుల సమస్యలపై ఐఐఎం-అహ్మదాబాద్‌ మాజీ డైరెక్టర్‌-ఇన్‌చార్జి జగదీశ్‌ ఛోకర్‌, న్యాయవాది గౌరవ్‌ జైన్‌ సుప్రీంకోర్టులో (Supreme Court) పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్ వీడియో కాల్ ద్వారా విచారించిన ధర్మాసనం అంతర్‌ రాష్ట్ర బస్సు సేవల పునరుద్ధరణపై (inter-state travel of migrants) కేంద్రం వారం రోజుల్లోగా తన స్పందనను తెలపాలని ఆదేశించింది. జస్టిస్‌ ఎన్‌.వి.రమణ, జస్టిస్‌ సంజయ్‌కృష్ణ కౌల్‌, జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ ఆదేశాలు జారీ చేసింది. షెడ్యూల్డ్ ప్రాంతాల్లో రిజర్వేషన్లు 50 శాతం మించరాదు, తెలుగు రాష్ట్రాలను హెచ్చరించిన సుప్రీంకోర్టు, అప్పటి నియామకాల్లో జోక్యం చేసుకోబోమంటూ వెల్లడి

పిటిషనర్ తరపున సీనియర్‌ న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌ వాదనలు వినిపించారు. లాక్‌డౌన్‌తో వలస కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని, వారు తమ సొంత ఊళ్లకు వెళ్లకుండా ప్రభుత్వాలు వారి హక్కులను కాలరాస్తున్నాయని.. దీనిపై కోర్టు ప్రభుత్వాలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని ఆయన కోర్టును కోరారు. దీనికి ప్రతిగా కేంద్రం తరపున సోలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా తన వాదనలు వినిపించారు. వలస కార్మికుల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఎప్పటికప్పుడు రాష్ట్రాలతో ఈ అంశంపై వాకబు చేస్తోందని సోలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా కోర్టుకు వివరించారు. ఇరువైపులా వాదనలు విన్న ధర్మాసనం.. అంతర్‌ రాష్ట్ర బస్సు సేవల పునరుద్ధరణపై కేంద్రం వారం రోజుల్లోగా తన స్పందనను తెలపాలని ఆదేశించింది. కరోనా భయం, సుప్రీంకోర్టు పాక్షిక మూసివేత, కేసులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ, లాయర్లు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేసుకు హాజరుకావాలి, ఆదేశాలు జారీ చేసిన సీజే

పిటిషన్ విచారణ సంధర్భంగా ధర్మాసనం సీనియర్‌ న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌ కు చురకలు అంటించింది. ప్రశాంత్‌ భూషణ్‌ గతంలో కోర్టు తీర్పులపై ఆరోపణలు, విమర్శలు చేసిన నేపథ్యంలో ఆయనకు ఈ చురకలు అంటించింది. మీకు న్యాయవ్యవస్థ అంటే నమ్మకం లేదు. సుప్రీంకోర్టుపై విశ్వాసం లేదు. అలాంటప్పుడు మీ వాదనలను మేమెందుకు వినాలి?’’ అని సూటిగా ప్రశ్నించింది. ఎక్కడి వాళ్లు అక్కడే ఉండాలి, విదేశాల్లో చిక్కుకున్న వారిని తీసుకురావడానికి ఇది సమయం కాదు, పిటిషన్ విచారణలో సుప్రీంకోర్టు వెల్లడి

దానికి ప్రశాంత్‌ భూషణ్‌ స్పందిస్తూ.. ‘‘నేనెప్పుడూ కోర్టులపై విశ్వాసం లేదని చెప్పలేదు. నేను తప్పు మాట్లాడి ఉండొచ్చు. అయితే.. గతంలో చాలామంది విశ్రాంత న్యాయమూర్తులు కూడా ఇదే అభిప్రాయాన్ని వెల్లడించారు’’ అని పేర్కొన్నారు. ‘‘కోర్టు నా వాదనలు వినకుంటే.. ఈ పిటిషన్‌ నుంచి నేను తప్పుకొంటాను. మరో లాయర్‌ వాదిస్తారు’’ అని తెలిపారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ.. ‘‘మీరు తప్పుకోవాల్సిన అవసరం లేదు. 30 ఏళ్లుగా ఈ కోర్టులో ప్రాక్టీస్‌ చేస్తున్నానని మీరు చెప్పుకొంటారు. ఈ కోర్టు ప్రభుత్వం చెప్పుచేతల్లో బందీ కాదు. కొన్ని తీర్పులు పిటిషనర్లకు అనుకూలంగా.. మరికొన్ని ప్రతికూలంగా వస్తాయనే విషయం మీకు తెలిసి ఉండాలి కదా?’’ అని వ్యాఖ్యానించింది.

లాక్‌డౌన్‌ సమయంలో వినియోగదారులకు అన్‌ లిమిటెడ్‌ కాల్స్‌, డాటా, డీటీహెచ్‌ సౌకర్యాలను ఉచితంగా కల్పించేలా ఆదేశించాలంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఇలాంటి పిటిషన్లు దాఖలు చేయడమేంటని న్యాయమూర్తులు జస్టిస్‌ ఎన్వీ రమణ, ఎస్‌కే కౌల్‌. బీఆర్‌ గవాయ్‌లతో కూడిన ధర్మాసనం ప్రశ్నించింది. దీంతో పిటిషన్‌ను వెనక్కి తీసుకుంటానని న్యాయవాది మనోహర్‌ ప్రతాప్‌ తెలిపారు. మానసిక ఒత్తిడిలో ఉన్నవారు, క్వారంటైన్‌లో ఉన్నవారిని దాని నుంచి దూరం చేసేలా ఆరోగ్య మంత్రిత్వశాఖకు సూచించాలని న్యాయస్థానాన్ని ఆయన అభ్యర్థించారు.