Supreme Court of India | Photo-IANS)

New Delhi, April 13: కరోనావైరస్ మహమ్మారి నేపథ్యంలో విధించిన లాక్డౌన్ (Nationwide lockdown) మధ్య విదేశాలలో చిక్కుకున్న భారతీయ పౌరులను తరలించాలని కోరుతున్న పిటిషన్లపై అత్యున్నత ధర్మాసనం (Supreme Court) విచారణ చేపట్టింది.

ఈ కేసులో పలు పిటిషన్లను విచారించిన భారత ప్రధాన న్యాయమూర్తి ఎస్‌ఐ బొబ్డే (Chief Justice of India SA Bobde) నేతృత్వంలోని ధర్మాసనం, విదేశాలలో చిక్కుకున్న ప్రజలందరినీ తిరిగి భారతదేశానికి తీసుకురావడానికి ఇది సమయం కాదని అభిప్రాయపడ్డారు. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.  లాక్‌డౌన్ దెబ్బ, గంగా,యమున నదుల్లోకి స్వచ్ఛమైన నీరు

కాగా ప్రజలు వెళ్లి వారి మనోవేదనలను తెలుసుకోవడానికి సరైన దరఖాస్తు ద్వారా ప్రభుత్వాన్ని అభ్యర్థించవచ్చు. విదేశాలలో చిక్కుకున్న భారతీయ ప్రజలను తిరిగి తీసుకురావడానికి ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుంది" అని ప్రధాన న్యాయమూర్తి బొబ్డే అన్నారు. దీంతో పాటు ఇరాన్‌, అమెరికాలో చిక్కుకున్న వారిని రప్పించాలన్న పిటిషన్లపై సమాధానం చెప్పాలని కేంద్రాన్ని ఆదేశించింది.

లాక్‌డౌన్‌ పొడిగింపుపై రేపు వీడనున్న సస్పెన్స్

ఇక ప్రస్తుత పరిస్థితుల్లో ఎక్కడివారు అక్కడే ఉండటం మేలని సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. విదేశాల్లో ఉన్నవారిని ఇప్పటికిప్పుడు తీసుకురమ్మని ఆదేశించలేమని పేర్కొంది. అదే సమయంలో విదేశాల్లోని భారతీయుల రక్షణకు కేంద్రం చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.

కరోనా కట్టడిపై కేంద్రం కీలక నిర్ణయం, మూడు జోన్లుగా దేశ విభజన

కాగా, కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఇరాన్‌లో చిక్కుకుపోయిన దాదాపు 58 మంది పౌరులను భారత ప్రభుత్వం ప్రత్యేక విమానాల్లో స్వదేశానికి రప్పించిన విషయం తెలిసిందే. అయితే కరోనా విజృంభిస్తున్న కారణంగా పలు దేశాలు లాక్‌డౌన్‌ విధించడంతో ఎక్కడివారు అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. దీంతో తమను స్వదేశానికి తీసుకువెళ్లాలని పలువురు కేంద్రాన్ని అభ్యర్థిస్తున్నారు.

Here's ANI Tweet

తమ దేశంలో చిక్కుకుపోయిన విదేశీ పౌరులకు కరోనా నెగటివ్‌గా తేలితే వారిని స్వదేశానికి పంపిస్తామని యూఏఈ వెల్లడించిన విషయం తెలిసిందే. భారత్‌ సహా పలు దేశాల రాయబార కార్యాలయాలకు ఈ మేరకు సమాచారం అందించినట్లు గల్ఫ్‌ మీడియా పేర్కొంది. మరోవైపు భారత్‌లో చిక్కుకుపోయిన అమెరికా, ఆస్ట్రేలియా, బ్రిటన్‌ పౌరులను ప్రత్యేక విమానాల ద్వారా వెనక్కి పంపుతున్న విషయం విదితమే.