Ganga,Yamuna Rivers: లాక్‌డౌన్ దెబ్బ, గంగా,యమున నదుల్లోకి స్వచ్ఛమైన నీరు, ప్రజల అవసరాలకు సరిపోయేలా నీటి నాణ్యత, శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడి
Yamuna River (Photo-PTI)

New Delhi, April 13: కరోనావైరస్ (Coronavirus) వ్యాప్తి కారణంగా అందరూ ఇంటికే పరిమితవ్వడంతో ప్రకృతి మరియు వన్యప్రాణులు అభివృద్ధి చెందుతున్నాయి. అలాగే మన నదులు (Rivers) కూడా పరి శుభ్రంగా మారుతున్నాయి. నివేదికల ప్రకారం, గంగా,యమునా నది (Ganga,Yamuna Rivers) నీటి నాణ్యత గణనీయంగా మెరుగుపడిందని మరియు తాగడానికి కూడా సరిపోతుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.

లాక్‌డౌన్‌ పొడిగింపుపై రేపు వీడనున్న సస్పెన్స్

గంగా కాలుష్య కారకాలలో (Ganga River Pollution) పదోవంతు పరిశ్రమలు, సమీప హోటళ్ళు మరియు ఇతర వనరుల నుండి వస్తాయి. కరోనావైరస్ నియంత్రణకు దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ (Nationwide lockdown) ప్రకటించడంతో ఇవన్నీ మూతపడ్డాయి. ఇవి మూసివేయడంతో నీటి నాణ్యత నలభై నుండి యాభై శాతం మెరుగుపడింది.

గత కొన్ని వారాలుగా, భారీ వర్షపాతం కారణంగా నీటి మట్టం కూడా పెరిగింది. ఇది గత సంవత్సరాలలో ఎన్నడూ జరగని విషయం, సహజంగా చాలా మంది వారు చూస్తున్నదాన్ని కూడా నమ్మలేకపోతున్నారు. లాక్డౌన్ మధ్యలో హరిద్వార్ లోని ఘాట్లు కూడా శుభ్రంగా మారాయి. అక్కడ సముద్ర జీవాలను కూడా నీటిలో స్పష్టంగా చూడవచ్చు. ఈ నదుల్లో చేపలు ఇతర సముద్ర జీవులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కాగా లాక్డౌన్ ఖచ్చితంగా పర్యావరణంపై సానుకూల ప్రభావాన్ని చూపిందనే చెప్పవచ్చు.

కరోనా కట్టడిపై కేంద్రం కీలక నిర్ణయం, మూడు జోన్లుగా దేశ విభజన

ఢిల్లీ పరిసర ప్రాంతాలలో 21 రోజులపాటు విధించిన లాక్ డౌన్ కారణంగా దేశంలో వివిధ రంగాలకు చెందిన పరిశ్రమలు, సంస్థలు, కార్యాలయాలు అన్ని మూతపడ్డాయి. పరిశ్రమల బంద్‌ కారణంగా వాటి నుంచి వచ్చే వ్యర్థాలు నిలిచిపోయాయి. దీంతో వారణాసి, హరిద్వార్‌ ప్రాంతాల్లో ప్రవహించే గంగా నదిలోకి వ్యర్థాలు చేరకపోవడంతో నదిలోని నీరు రోజు రోజుకి శుద్ధి అవుతోంది. అనేక పరిశోధనల అనంతరం ప్రస్తుతం నీటి నాణ్యతలో గొప్ప మార్పు కనిపిస్తోందని, అలాగే తాగడానికి కూడా సరిపోతుందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.

కరోనాపై పోరుకు డాక్టర్‌ వైఎస్సార్‌ టెలిమెడిసిన్‌

గంగా నదిలోకి పదోవంతు కాలుష్యం పరిశ్రమలు, సమీప హోటళ్ల నుంచి వచ్చ చేరుతుందని బెనార‌స్ హిందూ యూనివ‌ర్సిటీ ప్రొఫెస‌ర్ డాక్ట‌ర్ పీకే మిశ్రా వెల్లడించారు. లాక్‌డౌన్‌తో ప్రస్తుతం నది పరివాహక ప్రాంతాల ప్రజలు ఇళ్లలోనే ఉండటం, పరిశ్రమలు పనిచేయకపోవడం కారణంగా దాదాపు 40 నుంచి 50 శాతం వరకు గంగా నది నీరు నాణ్యత పెరిగిందని ఆయన చెప్పారు.

కరోనాపై పోరుకు ఈసీ అండ, ఏడాదిపాటు తమ జీతాల నుంచి స్వ‌చ్ఛంధంగా 30 శాతం కోత

కాగా కేవలం గంగా నది మాత్రమే కాకుండా యమునా నది నీటి నాణ్యత, నీటి పరిమాణంలో గణనీయమైన పెరుగుదల కనిపిస్తోంది. గత కొన్నేళ్లుగా కాలుష్యంతో నిండిన నది ప్రస్తుతం క్లీన్‌గా కనిపిస్తోంది. ఇక రోడ్లపై వాహానాలు తక్కువ ప్రయాణిస్తుండటంతో వాయు కాలుష్యం సైతం కనుమరుగయ్యింది. అలాగే ఇప్పటి వరకు కనిపించని అనేక వలస పక్షులు కూడా తిరిగి వచ్చాయి. రహదారులన్నీ నిర్మానుష్యంగా ఉండటంతో కొన్ని ప్రదేశాల్లో అడవిలో ఉండే జంతువులు కూడా రోడ్లపైకి వస్తున్నాయి.