 
                                                                 Amaravati, April 13: ఏపీలో కరోనా వైరస్ నియంత్రణ (Coronavirus in AP) చర్యల్లో భాగంగా డాక్టర్ వైఎస్సార్ టెలిమెడిసిన్ (Dr YSR Telemedicine) కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి (CM YS Jagan mohan Reddy) ప్రారంభించారు. టోల్ ఫ్రీ నెంబరు 14410కు ఫోన్ చేసి డాక్టర్‌తో మాట్లాడారు. ఈ సందర్భంగా టెలిమెడిసిన్ (Telemedicine) విధానాన్ని పటిష్టంగా అమలు చేయాలని అధికారులను ఏపీ సీఎం వైయస్ జగన్ ఆదేశించారు.
అవసరమైతే వైద్యుల సంఖ్యను పెంచాలని సూచించారు. సోమవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్, వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి తదితరులు హాజరయ్యారు.
Here's AP CM Jagan Launches YSR TeleMedicine
తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో'డా.వైయస్ఆర్ టెలీ మెడిసిన్'కాల్ సెంటర్ ను ప్రారంభించడం జరిగింది.ఈ సందర్భంగా కాల్ సెంటర్ కు ఫోన్ చేసి డాక్టర్ తో మాట్లాడాతూ.
Launched'Dr.YSR TeleMedicine'call center at camp officeTadepalli,today.Had a phone conversation with Doctor from theCall center pic.twitter.com/PBYW2Wta8Z
— SHAIK KHAJAVALI (@khaja18608) April 13, 2020
డాక్టర్ వైఎస్సార్ టెలి మెడిసిన్ ఎలా పనిచేస్తుంది
టెలి మెడిసిన్ అమలు కోసం ప్రత్యేకంగా టోల్ ఫ్రీ నెంబరు 14410 కేటాయించారు. రోగులు 14410 టోల్ ఫ్రీ నెంబరుకు మిస్డ్ కాల్ ఇస్తే చాలు. అక్కడి సిస్టమ్ ఆ మొబైల్ నెంబరును, మొత్తం వివరాలను నమోదు చేసుకుంటుంది. ఆ తర్వాత ఎగ్జిక్యూటివ్∙రోగికి కాల్ చేసి, వారు ఉంటున్న ప్రదేశం, వయసు, రోగ లక్షణాల వంటి పూర్తి వివరాలు తెలుసుకుంటారు. అనంతరం రోగికి ఒక గుర్తింపు సంఖ్య (ఐడీ) ఇస్తారు.
ఏపీలో ప్రవేశ పరీక్షలన్నీ వాయిదా
రోగి వివరాలన్నీ టెలి మెడిసిన్ వ్యవస్థకు కనెక్ట్ అయిన వైద్యులందరికీ కనిపిస్తాయి. ఆ సమయంలో డాక్టర్ల బృందంలో ఎవరో ఒకరు ఆ కాల్‌ను స్వీకరించి, కాల్‌చేసి ఓపీ సేవలు అందిస్తారు. ఆ రోగికి నిర్వహించవలసిన పరీక్షలు, అందించాల్సిన మందులను వైద్యులు తెలియజేస్తారు.వ్యాధి లక్షణాలను బట్టి కోవిడ్–19 అనుమానిత రోగులను గుర్తిస్తారు.
కరోనా నియంత్రణపై రిలయన్స్ శాస్త్రవేత్తల ముందడుగు
ఆ తర్వాత ఎస్‌ఎంఎస్ ద్వారా చికిత్స వివరాలు రోగికి అందుతాయి. అవసరమైన సందర్భాల్లో వీడియో కన్సల్టేషన్‌కూడా ఉంటుంది. అవసరమైతే వీరిని ఏ ఆస్పత్రికి పంపించాలి, ఎక్కడకు పంపించాలన్నదానిపై కూడా వైద్యులు నిర్ణయం తీసుకుని ఆమేరకు వారిని తరలిస్తారు.
ఏపీ సర్కారు మరో కీలక నిర్ణయం, ప్రతి ఒక్కరికీ ఉచితంగా మూడు మాస్కులు
ఈ కార్యక్రమంలో స్వచ్ఛందంగా సేవలందించేందుకు, ఈనెల 11వ తేదీ నాటికే 286 మంది వైద్యులు, 114 మంది ఎగ్జిక్యూటివ్స్ ముందుకు వచ్చారు. వీరంతా ప్రతి రోజూ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మూడు షిఫ్టుల్లో ఆరోగ్య సేవలు అందిస్తారు
 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                     
                     QuickLY
                                                                                QuickLY
                                     Socially
                                                                                Socially
                                     
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                     
                     
                     
                     
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                
