COVID-19 in AP: ఏపీ సర్కారు మరో కీలక నిర్ణయం, ప్రతి ఒక్కరికీ ఉచితంగా మూడు మాస్కులు, 5.3 కోట్ల మందికి 16 కోట్ల మాస్కులు పంపిణీ చేయాలని ఏపీ సీఎం ఆదేశాలు
ap govt orders to close all educational instutions in the state due to Covid 19 effect (Photo-PTI)

Amravati, April 12: కరోనా కట్టడికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్న ఏపీ ప్రభుత్వం (Andhra Pradesh Govt) తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో అందరికీ ఉచితంగా మాస్కులు (Free Masks) పంపిణీ చేయనుంది. ప్రతి వ్యక్తికీ మూడు చొప్పున మొత్తం 16 కోట్ల మాస్కుల పంపిణీ చేయాలని సీఎం జగన్‌ (AP CM YS jagan) ఆదేశించారు. కరోనా నివారణ చర్యలపై సీఎం సమీక్ష (CM Jagan Review Metting) నిర్వహించారు.

కరోనా కట్టడిపై కేంద్రం కీలక నిర్ణయం, మూడు జోన్లుగా దేశ విభజన

రాష్ట్రంలో పెద్ద ఎత్తున మాస్క్‌లు పంపిణీ చేయాలని ఆదేశించారు. వీలైనంత త్వరగా మాస్క్‌లను పంపిణీ చేయాలని సూచించారు. హైరిస్కు ఉన్న వారిపట్ల మరింత అప్రమత్తంగా ఉండాలని, రైతు బజార్లు, మార్కెట్లలో సర్కిల్స్, మార్కింగ్స్‌ తప్పనిసరిగా ఉండాల్సిందేనని చెప్పారు. ఎక్కడా కూడా జనం గమిగూడకుండా ఉండేలా చూడాలని జగన్ ఆదేశించారు. ఏపీలో రెడ్ జోన్లుగా 133 ప్రాంతాలు

రాష్ట్రంలో ఉన్న సుమారు 5.3 కోట్ల మందికి, ఒక్కొక్కరికీ 3 చొప్పున 16 కోట్ల మాస్కుల పంపిణీ చేయాలని ఆయన స్పష్టం చేశారు. మాస్కుల వల్ల కొంత రక్షణ లభిస్తుందని.. వీలైనంత త్వరగా పంపిణీ జరగాలని అధికారులను ఆదేశించారు. కరోనా (Covid 19) నివారణా చర్యలపై సీఎం వైఎస్‌ జగన్‌ తన నివాసంలో ఆదివారం సమీక్ష నిర్వహించారు. సీఎస్‌ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్, వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ జవహర్‌ రెడ్డి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. నూతన ఎన్నికల కమిషనర్‌గా రిటైర్డ్‌ జడ్జి జస్టిస్‌ కనగరాజ్‌

Here's AP CMO Tweet

రాష్ట్రంలో 1.43 కోట్ల కుటుంబాల సర్వే పూర్తయిందని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. శనివారం రాత్రికి వరకు 32,349 మందిని ఎన్‌ఎంలు, ఆశావర్కర్లు వైద్యాధికారులకు రిఫర్‌చేశారని.. ఇందులో 9,107 మందికి పరీక్షలు అవసరమని అధికారులు చెప్పారు. అయితే, వీరేకాకుండా మొత్తం 32,349 మందికి కూడా పరీక్షలు చేయాలని సీఎం ఆదేశించారు.

రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్

అదేవిధంగా కోవిడ్‌ కేసులు అధికంగా ఉన్న జోన్లలో 45 వేల వైరస్‌ నిర్ధారణ పరీక్షలకు వైద్య శాఖ సిద్ధమవుతోందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. వైరస్‌ వ్యాప్తి, ఉద్ధృతిని అంచనా వేసేందుకు ఈపరీక్షలు నిర్వహిస్తామని సీఎంకు తెలిపారు. కోవిడ్‌ వ్యాప్తి ఉన్నజోన్లపై ప్రత్యేక దృష్టిపెడుతున్నామని అన్నారు. వృద్ధులు, బీపీ, షుగర్ ఇతరత్రా వ్యాధులతో బాధపడే వాళ్లపై ప్రత్యేక దృష్టిపెట్టాలని ముఖ్యమంత్రి చెప్పారు.

ఎక్కడి వారు అక్కడే, తెలంగాణలో ఏప్రిల్ 30 వరకు లాక్‌డౌన్‌ పొడిగింపు

ఏపీలో ఇప్పటివరకు 417 కరోనా కేసులు నమోదయ్యాయి. వీరిలో విదేశాల నుంచి వచ్చిన వారిలో పాజిటివ్‌ కేసులు 13. వారిద్వారా సోకిన కేసులు సంఖ్య 12. ఢిల్లీ వెళ్లిన వారిలో పాజిటివ్‌ కేసులు 199. వారి ద్వారా సోకిన వారు 161మంది. మిగిలిన పాజిటివ్‌ కేసుల్లో ఇతర రాష్ట్రాలకు వెళ్లడం వల్ల, వ్యాధి సోకిన వారు, వారి ద్వారా, ఇతరత్రా మార్గాల వల్ల కరోనా సోకిన వారు 32మంది ఉన్నారు.