Telangana CM KCR Press Meet on Janata Curfew | File Image of Telangana CM KCR | File Photo

Hyderabad, April 11: తెలంగాణ (Telangana) సరిహద్దు రాష్ట్రాల్లో కొత్త కేసులు భారీగా పెరుగుతుండటంతో లాక్‌డౌన్‌ ఈ నెల 30వ తేదీ వరకు పొడగించినట్లు ముఖ్యమంత్రి కేసీఆర్‌ (Telangana CM KCR) ప్రకటించారు. మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాలతో రాకపోకలు ఉన్నాయి. ఏప్రిల్‌ 30వ తేదీ వరకు లాక్‌డౌన్‌ (Telangana Lockdown) కఠినంగా ఎక్కడ ఉన్నవారు అక్కడే ఉండాలని చెప్పారు.

తెలుగు రాష్ట్రాల్లో లాక్‌డౌన్, రెండు వారాలు పొడిగించాలన్న కేసీఆర్

ఏప్రిల్‌ 30 తర్వాత లాక్‌డౌన్‌ను దశల వారిగా ఎత్తేస్తామని తెలిపారు. దీంతో పాటుగా ఒకటవ తరగతి నుంచి 9వ తరగతి వరకు పరీక్షలు రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు. పరీక్షలు లేకుండానే పై తరగతులకు ప్రమోట్‌ చేస్తామన్నారు. ప్రాజెక్టుల కింద ఏప్రిల్‌ 15వ తేదీ వరకు నీటిని విడుదల చేస్తామని తెలిపారు.

విదేశాల నుంచి మొదటి దశలో వైరస్‌తో వచ్చిన వారంతా ఆస్పత్రి నుంచి కోలుకుని ఢిశ్చార్జ్‌ అయ్యారని సీఎం కేసీఆర్‌ తెలిపారు. మొదటి దశ, రెండవ దశలో మొత్తం 90 మంది డిశ్చార్జ్‌ అయ్యారని పేర్కొన్నారు. వైరస్‌ బారిన పడి 14 మంది మృతి చెందారు. ఇందులో ఇండోనేషియా నుంచి వచ్చిన వారు కూడా ఉన్నారని చెప్పారు. ఇప్పటి వరకు 503 మంది రాష్ట్రంలో వైరస్‌ బారిన పడ్డారని అన్నారు.

లాక్‌డౌన్ వేళ కొడుకు కోసం ఓ తల్లి రాష్ట్రాన్ని దాటింది

ఇప్పడు క్వారంటైన్‌లో 1650 మంది ఉన్నారు. చికిత్స పొందుతున్న వారిలో ఎవరి పరిస్థితి విషమంగా లేదు. ఇప్పుడు చికిత్స పొందుతున్న వారు ఈ నెల 24 లోపు డిశ్చార్జ్‌ అవుతారని తెలిపారు. తొలిదశలో విదేశాల నుంచి వచ్చి క్వారంటైన్‌లో ఉన్న 26 వేల మంది ఇళ్లకు వెళ్లిపోయారు. కొత్త కేసులు నమోదు కాకుంటే ఈ నెలాఖరు వరకు రాష్ట్రంలో పాజిటివ్‌ కేసులు లేకుండా ఉంటామని పేర్కొన్నారు.

Here's ANI Tweet

 

ఇదిలా ఉంటే కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణలో క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న సిబ్బంది కోసం పోలీస్‌శాఖ మొబైల్‌ సేఫ్టీ టన్నెళ్లు తెచ్చింది. పోలీస్‌ సిబ్బంది రక్షణకు మొబైల్‌ సేఫ్టీ టన్నెళ్లు ఏర్పాటు చేస్తున్నట్లు డీజీపీ మహేందర్‌రెడ్డి తెలిపారు. ఇప్పటికే డీజీపీ కార్యాలయం, రాచకొండ కమిషనరేట్‌లో మొబైల్‌ సేఫ్టీ టన్నెళ్లు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇదే తరహాలో రాష్ట్రవ్యాప్తంగా 25 మొబైల్‌ సేఫ్టీ టన్నెళ్లు ఏర్పాటు చేస్తున్నట్లు డీజీపీ తెలిపారు.

కంటైన్మెంట్‌ జోన్లు, లాక్‌డౌన్‌ విధులు, చెక్‌పోస్టుల వద్ద బందోబస్తులో ఉండే సిబ్బందితో పాటు ఇతర కీలక ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది వైరస్‌ బారిన పడకుండా ఉండేందుకు ఈ మొబైల్‌ సేఫ్టీ టన్నెళ్లు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. సిబ్బంది సేఫ్టీ టన్నెల్లోకి వెళ్లి 10 సెకన్లపాటు ఉంటే క్రిమిసంహారక మందు స్ప్రే చేయడం ద్వారా ఏవైనా వైరస్‌లు ఉంటే చనిపోతాయన్నారు.