A deserted street in amid coronavirus lockdown (Photo Credits: IANS)

Hyderabad, April 11: లాక్‌డౌన్ (India Lockdown) 21 రోజులు గడువు ఏప్రిల్ 14తో పూర్తి అవుతున్న నేపథ్యంలో దాన్ని పొడిగించాలా వద్దా అనే విషయంపై ఈ రోజు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ (PM Modi Video conference) నిర్వహించారు. కరోనా కేసులు ( Coronavirus) పెరుగుతున్న నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహంపై ప్రధాని అన్ని రాష్ట్రాల సీఎంలతో తన కార్యాలయం నుంచి చర్చించారు.

లాక్‌డౌన్ కొనసాగించాలనే అంశంపై వారి సూచనల్ని స్వీకరించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో మెజార్టీ ముఖ్యమంత్రులు (chief ministers) లాక్‌డౌన్ పొడిగించాలని కోరారు. అయితే తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రధాని మోదీతో ఏం చెప్పారో ఓ సారి చూద్దాం.

ఏపీలో రెడ్ జోన్లుగా 133 ప్రాంతాలు

తెలంగాణ సీఎం కేసీఆర్‌ 

లాక్‌డౌన్‌ను మరో రెండు వారాలు కొనసాగించాలని ప్రధాని మోదీని తెలంగాణ సీఎం కేసీఆర్‌ (Telangana CM KCR) కోరారు. ప్రధానితో వీడియో కాన్ఫరెన్స్‌లో కేసీఆర్‌ మాట్లాడుతూ.. కరోనా వ్యాప్తిని నిరోధించడంలో లాక్‌డౌన్‌ బాగా ఉపయోగపడిందని తెలిపారు. రైతులు నష్టపోకుండా, నిత్యావసరాలకు ఇబ్బంది కలకుండా.. ఫుడ్‌ ప్రాసెసింగ్‌ ఇండస్ట్రీ నడిచేలా చూడాలన్నారు. రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పత్తులు ప్రభుత్వం కొనుగోలు చేస్తోందని, రాష్ట్రానికి కేంద్రం ఆర్థికసాయం చేయాలని కోరారు. అప్పులు, రాష్ట్రం చెల్లించాల్సిన నెలసరి చెల్లింపుల విషయంలో రాష్ట్రాలకు వెసులుబాటు కల్పించాలన్నారు.

తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న కోవిడ్- 19 కేసులు

వచ్చే ఖరీఫ్‌లో విత్తనాలు, ఎరువులు అందేలా చూడాలని, రైస్‌ మిల్లులు, ఆయిల్‌ మిల్లులు, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు నడిచేలా చూడాలన్నారు. వ్యవసాయాన్ని నరేగాతో అనుసంధానం చేయాలని, కరోనాను ఎదుర్కోవడానికి వ్యూహాత్మక ఆర్థిక విధానం అవసరమని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. క్వాంటిటేటివ్ ఈజింగ్ విధానాన్ని ఆర్‌బీఐ అనుసరించాలని, రాష్ట్రాలు చెల్లించే అప్పుల చెల్లింపుల్ని 6 వారాలు వాయిదా వేయాలని, ప్రధాని అధ్యక్షతన కేంద్ర మంత్రులతో టాస్క్‌ఫోర్స్‌ వేయాలని మోదీకి కేసీఆర్‌ విజ్ఞప్తి చేశారు. కరోనాపై జరిగే యుద్ధంలో భారత్‌ తప్పక గెలుస్తుందని మోదీతో కేసీఆర్‌ ధీమాగా చెప్పారు.

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌

లాక్‌డౌన్‌ను రెడ్‌జోన్ల వరకు పరిమితం చేయాలని ప్రధాని నరేంద్ర మోదీకి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి (AP CM YS Jagan) తన అభిప్రాయంగా చెప్పారు. జనం గుంపులు గుంపులుగా ఉండకుండా నియంత్రణ చర్యలు తీసుకోవచ్చని మోదీకి జగన్‌ తెలిపారు. రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న జగన్‌ తన అభిప్రాయాలను పంచుకున్నారు. 'రాష్ట్రవ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమలు చేస్తున్నాం. కరోనా కట్టడికి ప్రధానిగా మీరు తీసుకున్న చర్యలను బలంగా సమర్థిస్తున్నా. మాల్స్‌, సినిమా హాళ్లు, ప్రార్థనా మందిరాలు, ప్రజారవాణా, పాఠశాలలపై లాక్‌డౌన్‌ కొనసాగాలి.

నూతన ఎన్నికల కమిషనర్‌గా రిటైర్డ్‌ జడ్జి జస్టిస్‌ కనగరాజ్‌

ప్రధానిగా మీరు సూచించే వ్యూహంతో ముందుకు సాగుదాం. వ్యవసాయ రంగంపై లాక్‌డౌన్‌ తీవ్ర ప్రభావం చూపిస్తుంది. వ్యవసాయ ఉత్పత్తుల రవాణా గణనీయంగా తగ్గింది. 90శాతం పరిశ్రమలు కరోనా ప్రభావంతో మూతపడ్డాయి. రాష్ట్రాలకు ఆదాయం కూడా రాని పరిస్థితి నెలకొంది. సహాయ, సంక్షేమ కార్యక్రమాలకు నిధుల కొరత ఏర్పడింది. 676 మండలాల్లో 37 మండలాలు రెడ్‌జోన్‌లో ఉండగా..44 మండలాలు ఆరెంజ్‌ జోన్‌లో ఉన్నాయని' జగన్‌..ప్రధాని మోదీకి వివరించారు.