COVID-19 In Telugu States: తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న కోవిడ్- 19 కేసులు, ఏపీలో 381కి చేరిన కరోనా కేసులు, తెలంగాణలో 487కు చేరిన కరోనావైరస్ కేసులు
Coronavirus in India (Photo Credits: IANS)

Amaravati, April 10: తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు (COVID-19 In Telugu States) రొజు రోజుకు పెరుగుతున్నాయి. కోవిడ్ 19 (COVID-19) కట్టడికి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు (Telugu States CMs) ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా కేసులు నియంత్రణ కావడం లేదు. రోజు రోజుకు సరికొత్త కేసులు నమోదవుతున్నాయి. లాక్ డౌన్ (Lockdown) పటిష్టంగా అమలు చేస్తున్నప్పటికీ కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం లేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కొత్తగా నమోదైన కరోనా కేసులను ఓ సారి పరిశీలిస్తే..

దేశంలో కరోనా కలవరం, 12 గంట‌ల్లో 547 క‌రోనా పాజిటివ్ కేసులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శుక్రవారం ఒక్కరోజే కొత్తగా మరో 16 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఏపీ కోవిడ్-19 నోడల్ అధికారి అర్జా శ్రీకాంత్ తెలిపారు. ఏపీలో ప్రస్తుతం శుక్రవారం సాయంత్రం నాటికి మొత్తం 381 కరోనా వైరస్ పాజిటివ్‌ కేసులు (COVID-19 cases in AP) నమోదైనట్లు ప్రభుత్వం తెలిపింది.

కరోనాతో ప్రపంచానికి ఉగ్రవాద ముప్పు

శుక్రవారం జిల్లాల్లో నమోదైన కరోనా కేసులు ఇలా ఉన్నాయి. గుంటూరు జిల్లాలో 7 కరోనా కేసులు, తూర్పుగోదావరి జిల్లాలో 5 కరోనా కేసులు, కర్నూలు జిల్లాలో 2 కరోనా కేసులు, ప్రకాశం జిల్లాలో 2 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఏపీలో ఇప్పటివరకు కరోనా వల్ల ఆరుగురు మృతి చెందారు.

Here's AP Corona cases list

కరోనా నుంచి కోలుకొని 10 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. వివిధ ఆస్పత్రుల్లో 365 మందికి చికిత్స అందిస్తున్నారు. ఏపీలో జిల్లాల వారీగా కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. అనంతపురం 15, చిత్తూరు 20, తూ.గో. 17, గుంటూరు 58, కడప 29, కృష్ణా 35, కర్నూలు 77, నెల్లూరు 48, ప్రకాశం 40, విశాఖ 20, ప.గో. జిల్లాలో 22 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు ప్రభుత్వం పేర్కొంది.

తెలంగాణ రాష్ట్రంలో శుక్రవారం ఒక్కరోజే కొత్తగా 16 కరోనా పాజిటివ్‌ కేసులు (COVID-19 cases in Telangana) నమోదైనట్లు రాష్ట్ర వైద్యాధికారులు వెల్లడించారు. రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 487కు చేరింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనాతో 12 మంది ప్రాణాలు కోల్పోగా, 45 మంది కోలుకున్నారు.

Here's Telangana Cases list

430 మంది కరోనా బాధితులు ఐసోలేషన్‌ వార్డుల్లో చికిత్స పొందుతున్నారు. కరోనా నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంది. కరోనా పరిస్థితులు, లాక్‌డౌన్‌పై ఎప్పటికప్పుడు సీఎం కేసీఆర్‌ సంబంధిత అధికారులతో సమీక్షలు నిర్వహించి సూచనలు చేస్తున్నారు.