COVID-19 in India: దేశంలో కరోనా కలవరం, 12 గంట‌ల్లో 547 క‌రోనా పాజిటివ్ కేసులు, 6412కు చేరిన కోవిడ్ 19 పాజిటివ్ కేసుల సంఖ్య, 504 మంది రికవరీ
Coronavirus Cases in India (Photo Credits: IANS)

New Delhi, April 10: గ‌డిచిన 12 గంట‌ల్లో దేశంలో కొత్త‌గా మ‌రో 547 క‌రోనా పాజిటివ్ కేసులు (COVID 19 in india) న‌మోద‌య్యాయ‌ని, 30 మర‌ణాలు చోటుచేసుకున్నాయ‌ని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్ల‌డించింది. ఇప్ప‌టివ‌ర‌కు భార‌త్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 6412కు చేరుకుంద‌ని పేర్కొంది.

కోవిడ్-19పై పోరాటానికి రాష్ట్రాలకు రూ. 15 వేల కోట్ల అత్యవసర నిధులు

మొత్తం కేసుల్లో 5709 కేసులు (Coronavirus Cases in India) యాక్టివ్ గా ఉండ‌గా..504 మంది కోలుకుని ఆస్ప‌త్రి నుంచి డిశ్చార్జి అయ్యార‌ని, 199 మ‌ర‌ణాలు (Coronavirus deaths in india) చోటుచేసుకున్నాయ‌ని తెలిపింది. దేశ‌వ్యాప్తంగా కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు లాక్ డౌన్ ను మ‌రింత పొడిగించే అవ‌కాశాలున్న‌ట్లు ఇప్పటికే వార్త‌లు వ‌చ్చిన విష‌యం తెలిసిందే.

పర్సనల్‌ ప్రొటెక్టివ్‌ ఇక్వి్‌ప్మెంట్‌ (PPE) సరఫరాకు 20 మంది దేశీయ తయారీదారులు ముందుకొచ్చారు. 1.7 కోట్ల పీపీఈల కోసం ఆర్డర్‌ ఇవ్వగా వాటి సరఫరా మొదలైంది. 49 వేల వెంటిలేటర్ల కోసం ఆర్డర్‌ ఇచ్చాం’’ అని కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ తెలిపారు. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు రూ.15 వేల కోట్ల అత్యవసర నిధుల విడుదలకు కేంద్రం ఆమోదం తెలిపింది.

Here's the tweet:

కాగా.. అంటువ్యాధుల నియంత్రణ నిబంధనలను ఉల్లఘించే వ్యక్తులకు రెండేళ్ల జైలు శిక్ష విధించేలా ఒడిసా ప్రభుత్వం ఓ ఆర్డినెన్స్‌ తెచ్చింది. ఈ నెల 30 వరకు లాక్‌డౌన్‌ పొడిగించాలని నిర్ణయించింది. అప్పటి వరకు రైళ్లు, విమానాలను నడపవద్దని కేంద్రాన్ని కోరింది. ఆ రాష్ట్రంలో ఇప్పటి వరకు 44 కరోనా కేసులు నమోదయ్యాయి.

కాలినడకన 200 కి.మీ ప్రయాణం.. ఆకలి- దప్పికలతో ప్రాణాలు కోల్పోయిన వైనం

ఢిల్లీ సఫ్దర్‌జంగ్‌ ఆస్పత్రిలో పనిచేస్తున్న ఇద్దరు మహిళా వైద్యులపై దాడి చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఇద్దరూ కొవిడ్‌-19 రోగుల వార్డులో సేవలందిస్తున్న వైద్యులు. వారు గౌతమ్‌ నగర్‌లోని పండ్ల మార్కెట్‌లో ఓ దుకాణానికి వెళ్లినప్పుడు అదే ప్రాంతానికి చెందిన వ్యక్తి గుర్తించాడు. ‘దూరంగా ఉండండి.. ఈ డాక్టర్లు ఆస్పత్రి నుంచి వైరస్‌ తెచ్చి ఇక్కడ అంటిస్తున్నారు’ అంటూ రెచ్చిపోయాడు. వైద్యులు నచ్చచెప్పేందుకు ప్రయత్నించగా వారి చేతులు మెలి తిప్పి వెనక్కి తోసేసి పారిపోయాడు.