AP Red Zone Areas: ఏపీలో రెడ్ జోన్లుగా 133 ప్రాంతాలు, రెడ్‌ జోన్, హాట్‌ స్పాట్లు ఇకపై పోలీసుల వలయంలో.., ఆంక్షలు ఉల్లంఘిస్తే కేసుల నమోదు
Andhra Pradesh ys-jaganmohan-reddy-review-meeting (Photo-Twitter)

Amaravati, April 11: ఏపీ రాష్ట్రంలో కరోనా వైరస్ (coronavirus in AP) విజృంభిస్తూనే ఉంది. రోజు రోజుకు కొత్త కొత్త కేసులు నమోదవుతున్నాయి. దీంతో ఏపీ ప్రభుత్వం మరిన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంది. లాక్ డౌన్ పకడ్బందిగా నిర్వహించాలని సీఎం జగన్ (CM Jagan) ఆదేశాలు జారీ చేశారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో 133 ప్రాంతాలను రెడ్ జోన్లుగా (AP Red Zones) రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.

తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న కోవిడ్- 19 కేసులు

ఇందులో గరిష్టంగా నెల్లూరు జిల్లాలో 30 ప్రాంతాలు, కర్నూలులో 22 క్లస్టర్లు ఉన్నాయి.ఈ ప్రాంతాల్లో వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతుంది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం (AP Govt) ఒక ప్రకటన విడుదల చేసింది.

ప్రతి క్లస్టర్ లోనూ వైరస్ నివారణ మరియు ప్రజారోగ్యం చర్యలపై ప్రజల్లో అవగాహన కల్పించడానికి క్వారంటైన్, భౌతిక దూరం పాటించటం,మెరుగైన నిఘా, అనుమానాస్పద కేసులన్నింటీనీ పరిక్షించటం, కాంటాక్ట్స్ అందర్నీ ఐసోలేషన్ లో పెట్టటం మరియు కమ్యునిటీ వ్యాప్తి చెందకుండా కావాల్సిన అన్ని చర్యలు ప్రభుత్వం కట్టుదిట్టంగా అమలు చేస్తోంది. ఎస్‌ఈసీ నిమ్మగడ్డకు భారీ షాక్

కోవిడ్ 19 పాజిటివ్ కేసులున్న ప్రాంతం నుండి 3 కిలోమీటర్లు చుట్టూ ఉన్న ప్రాంతాలన్నీ కంటైన్మెంట్ క్లస్టర్ గా తీసుకోబడుతుంది. కేసుల వ్యాప్తికి అవకాశం ఉన్న 5 కిలో మీటర్ల ప్రాంతం కూడా బఫర్ జోన్ గా గుర్తించారు. గ్రామీణ ప్రాంతాల్లో అయితే బఫర్ జోన్లను 7 కిలోమీటర్ల వరకు కూడా విస్తరించారు. పాజిటివ్ కేసు పేషెంట్ ల పై ఏఎన్ఎం లు, ఆషా వర్కర్లు చే ఖచ్చితమైన నిఘా పెట్టారు.

నూతన ఎన్నికల కమిషనర్‌గా రిటైర్డ్‌ జడ్జి జస్టిస్‌ కనగరాజ్‌

రాష్ట్రంలోని కంటైన్మెంట్‌ (అదుపులో ఉంచడం) క్లస్టర్ల పరిధిలో గుర్తించిన రెడ్‌ జోన్, హాట్‌ స్పాట్లను పోలీస్‌ వలయంలో ఉంచి కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు. ఆ ప్రాంతాల్లోని ప్రజలు బయటకు రాకుండా, బయటి వారు ఆ ప్రాంతంలోకి వెళ్లకుండా పోలీస్‌ గస్తీ ఏర్పాటు చేశారు. అత్యవసరమైతే తప్ప ఎవరినీ బయటకు రానీయడం లేదు. ఆంక్షలను ఉల్లంఘిస్తే కేసుల నమోదుకూ వెనుకాడటం లేదు.

గత నెల కరెంట్ బిల్లే ఈ నెల కట్టండి, స్పష్టం చేసిన ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ నియంత్రణ మండలి

రాష్ట్రంలో ఇప్పటివరకూ జరిగిన నిర్ధారణ పరీక్షలను బట్టి 5.72 శాతం పాజిటివ్‌ కేసులు నమోదైనట్టుగా తేలింది. రాష్ట్రంలో శుక్రవారం సాయంత్రం వరకూ 381 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇవాళ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల వరకూ గుంటూరులో 7, తూర్పు గోదావరిలో 5, కర్నూలులో 2, ప్రకాశం జిల్లాలో 2 కేసులు నమోదు అయ్యాయి. కొత్తగా నమోదు అయిన 16 కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 381కి చేరింది. అలాగే ఆస్పత్రుల్లో 365మంది ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకూ రాష్ట్రవ్యాప్తంగా ఆరుగురు కరోనా బాధితులు మృతి చెందారు.

కంటైన్మెంట్‌ క్లస్టర్లలో చర్యలు ఎలా ఉంటాయి

పాజిటివ్‌ కేసులున్న ప్రాంతం చుట్టూ కిలోమీటరు మేర (హాట్‌ స్పాట్‌), దానికి మూడు కిలోమీటర్ల మేర రెడ్‌ జోన్‌గా పరిగణిస్తున్నారు.

ఆ మొత్తం ప్రాంతాన్ని కంటైన్మెంట్‌ క్లస్టర్‌గా ప్రకటించి.. దానికి చుట్టూ ఉన్న మార్గాలను మూసేసి 28 రోజులపాటు ఆంక్షల్ని కొనసాగిస్తున్నారు.

ప్రతి జోన్‌లో ఎస్‌ఐ ఇన్‌చార్జిగా ఆ ప్రాంత విస్తీర్ణాన్ని బట్టి 10 నుంచి 20 మంది పోలీసులను బందోబస్తుకు వినియోగిస్తున్నారు.

ఈ ప్రాంతాల్లో వైద్య, ఆరోగ్య, రెవెన్యూ, పంచాయతీరాజ్, మున్సిపల్, వలంటీర్లు, నిర్దేశించిన ప్రభుత్వ ఉద్యోగుల్ని మాత్రమే అనుమతిస్తున్నారు.

వాటి పరిధిలోని ప్రతి ఇంటినీ వలంటీర్లు, ఆశా వర్కర్లు సర్వే చేస్తున్నారు. పారిశుద్ధ్య సిబ్బంది ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపడుతున్నారు.

ఆ ప్రాంతాల్లో భోజనం, ఇతర ఆహార పదార్థాలను పంపిణీ చేసేవారు ముందస్తు అనుమతి తీసుకోవాలనే నిబంధన విధించారు.

రెడ్ జోన్ల వివరాలు : నెల్లూరు 30. కర్నూలు 22. కృష్ణా 16. పశ్చిమ గోదావరి 12. గుంటూరు 12. ప్రకాశం 11. తూర్పుగోదావరి 8. చిత్తూరు 7. విశాఖపట్టణం 6. కడప 6. అనంతపురం 3