Woman Rides 1,400 km for Son: అమ్మా నీకు వందనం, లాక్‌డౌన్ వేళ కొడుకు కోసం ఓ తల్లి రాష్ట్రాన్ని దాటింది, 1400 కిలోమీటర్లు స్కూటీ మీద ప్రయాణం చేసింది
Woman Rides 1,400 km for Son (Photo-ANI)

Hyderabad, April 10: కన్న కొడుకు కోసం ఓ తల్లి పెద్ద సాహసమే చేసింది! లాక్‌డౌన్‌తో నెల్లూరు జిల్లాలో (Nellore Dt) చిక్కుకున్న కుమారుడిని తీసుకొచ్చేందుకు స్కూటీపై ఏకంగా 1400 కిలోమీటర్లు ప్రయాణించింది. ఇన్ని ఆంక్షల మధ్య ఎన్నో ఇబ్బందులను భరిస్తూ కొడుకును తీసుకొచ్చింది. ధ్రిల్లింగ్ సినిమా స్టోరీని తలపించే ఈ తెలంగాణ (Telangana) రాష్ట్రంలో జరిగింది. ఆ తల్లి కొడుకు కోసం తెలంగాణ రాష్ట్రం నుంచి ఏపీ (AP) రాష్ట్రానికి స్కూటీలో ప్రయాణించింది.

తెలంగాణలో బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేయటంపై నిషేధం విధింపు

వివరాల్లోకి వెళ్తే.. నిజామాబాద్‌ (Nizamabad) జిల్లా బోధన్‌కు చెందిన రజియాబేగం (Razia Begum) ప్రభుత్వ పాఠశాలలో ప్రధానోపధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. ఆమెకు ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె. 12 ఏళ్ల క్రితం భర్త మృతి చెందాడు. పెద్ద కుమారుడు ఇంజినీరింగ్ చేస్తుండగా.. చిన్న కుమారుడు ఇంటర్ పూర్తిచేశాడు. ఎంబీబీఎస్ (MBBS) ప్రవేశ పరీక్ష కోసం సిద్ధమవుతున్నాడు.

హైదరాబాద్‌లోని నారాయణ మెడికల్‌ అకాడమీలో కోచింగ్‌ తీసుకుంటున్నాడు. నెల్లూరుకు చెందిన నిజాముద్దీన్‌ స్నేహితుడు కూడా బోధన్‌లో ఇంటర్‌ చదివాడు. స్నేహితుడి తండ్రి ఆరోగ్యం బాగా లేకపోవడంతో మార్చి 12న నిజాముద్దీన్‌ నెల్లూరు వెళ్లాడు.

Here's ANI Tweet

లాక్‌డౌన్‌ కారణంగా అతడు అక్కడే చిక్కుకుపోయాడు. ఆందోళనకు గురైన రజియా బేగం బోధన్‌ ఏసీపీ జైపాల్‌రెడ్డికి పరిస్థితిని వివరించారు. ఆయన ఇచ్చిన అనుమతి పత్రంతో 700 కిలోమీటర్ల దూరంలో ఉన్న నెల్లూరుకు సోమవారం ఉదయం స్కూటీపై (Woman Rides 1,400 km for Son) బయల్దేరారు. మంగళవారం మధ్యాహ్నం అక్కడకు చేరుకున్నారు.

12 గంట‌ల్లో 547 క‌రోనా పాజిటివ్ కేసులు

కుమారుడితో కలిసి అదే స్కూటీపై తిరుగు ప్రయాణమై బుధవారం మధ్యాహ్నానికి కామారెడ్డి చేరుకున్నారు. కొడుకును చూడాలనే తపన తనను అంత దూరం వెళ్లేలా చేసిందని రజియా తెలిపారు. చాలా చోట్ల పోలీసులు ఆపారని, బోధన్‌ ఏసీపీ ఇచ్చిన పత్రాన్ని చూపించడంతో అనుమతించారని వివరించారు.

నెల్లూరు వెళ్లాలి.. దారిలో ఏమన్నా దొరుకుతాయో లేదో అనుకొన్నారు. తన వెంట రొట్టెలు తీసుకెళ్లారు. పెట్రోల్ బంక్ వద్ద ఆగి పెట్రోల్ కొట్టించుకొని.. కాసేపు రెస్ట్ తీసుకున్నారు. అల్పహారం, టీ తీసుకొని తిరిగి బయల్దేరేదానినిని గుర్తు చేసుకున్నారు. కానీ లాక్ డౌన్ కావడంతో రోడ్లు నిర్మానుష్యంగా ఉన్నాయని.. రాత్రి పూట భయమేసిందని చెప్పుకొచ్చారు.