Deadly coronavirus What is a lockdown Here's what you can and can't do (Photo-PTI)

New Delhi, April 12: కరోనావైరస్ దేశ వ్యాప్తంగా (COVID-19 in India) తన ప్రతాపాన్ని చూపిస్తోంది. దీని కట్టడికి కేంద్రం దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ (India Lockdown) విధించింది. కాగా దేశవ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్‌ను మరికొంతకాలం పొడిగించనున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో దేశాన్ని మూడు జోన్లుగా (3 zones) విభజించాలని కేంద్రం భావిస్తున్నట్టు అధికార వర్గాలు శనివారం తెలిపాయి.

కరోనా కేసులను బట్టి రెడ్‌ ( Red Zone) (వైరస్‌ తీవ్రత అధికంగా ఉన్న ప్రాంతం), ఆరెంజ్‌ (Orange Zone) (తీవ్రత మధ్యస్థంగా ఉన్న ప్రాంతం) , గ్రీన్‌ (Green Zone) (తీవ్రత తక్కువగా ఉన్న ప్రాంతం) జోన్లుగా వీటిని విభజించనున్నట్టు పేర్కొన్నాయి.

ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేసే క్రమంలో ఆరెంజ్‌, గ్రీన్‌ జోన్లలోని కొన్ని పరిశ్రమలు తమ కార్యకలాపాల్ని కొనసాగించుకోవడానికి కొంత వెసులుబాటును కూడా కల్పించనున్నట్టు తెలిపాయి. అలాగే, వైరస్‌ తీవ్రత తక్కువగా ఉన్న ప్రాంతాల్లో వ్యవసాయం, దాని అనుబంధ కార్యకలాపాల్ని అనుమతించే యోచనలో ఉన్నట్టు వివరించాయి. ఇదే సమయంలో నిర్ణీత దూరం వంటి నిబంధనల్ని అందరూ పాటించాలని సూచించాయి.

రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్

దేశంలో కరోనా పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ప్రధానంగా రెండు అంశాలపై కేంద్రం దృష్టి సారించినట్టు పేరు చెప్పడానికి ఇష్టపడని అధికారి ఒకరు పేర్కొన్నారు. ఈ విషయాన్ని ప్రముఖ వార్తా సంస్థ పీటీఐ తెలిపింది.

ఎక్కడి వారు అక్కడే, తెలంగాణలో ఏప్రిల్ 30 వరకు లాక్‌డౌన్‌ పొడిగింపు

వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేసేందుకు హాట్‌స్పాట్లను గుర్తించడం ఒకటైతే, లాక్‌డౌన్‌ ఎత్తివేసిన అనంతరం ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడానికి తీసుకోవాల్సిన చర్యలు రెండోదని ఆ అధికారి పేర్కొన్నారు. దీంట్లో భాగంగా లాక్‌డౌన్‌తో కుదేలైన ఆర్థిక రంగాన్ని గాడిలో పెట్టేందుకు తీసుకోవాల్సిన కార్యాచరణపై సోమవారం నుంచి దృష్టి సారించాలని కేంద్ర మంత్రులకు ప్రభుత్వం సూచించిందని అధికార వర్గాలు తెలిపాయి.

లాక్‌డౌన్, కత్తులతో పోలీసులపై దాడి

ఇదిలా ఉంటే దేశవ్యాప్త లాక్‌డౌన్‌ను మరో రెండు వారాలు పొడిగించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం కొనసాగుతున్న 21 రోజుల లాక్‌డౌన్‌ ఈ నెల 14వ తేదీతో ముగియనున్న సంగతి విదితమే. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ (PM Modi) శనివారం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

దేశంలో 24 గంటల్లో కరోనా కల్లోలం, 40 మంది మృతి

ఈ సందర్భంగా పలువురు సీఎంలు మాట్లాడుతూ లాక్‌డౌన్‌ను ఈ నెల 30 వరకు కొనసాగించాలని సూచించారు. ఈ నేపథ్యంలో ప్రధాని మరో 15 రోజుల లాక్‌డౌన్‌కు సంబంధించిన మార్గదర్శకాలను రెండు మూడు రోజుల్లో విడుదల చేస్తాం’ అని వారితో పేర్కొన్నట్టు తెలిసింది.

రెడ్‌జోన్ల వరకు పరిమితం చేయాలన్న ఏపీ సీఎం జగన్

ఈసారి సంపూర్ణ లాక్‌డౌన్‌ ఉండకపోవచ్చని, ఆర్థిక కార్యకలాపాలకు పునర్జీవం కల్పించేలా కొన్ని మినహాయింపులు ఉండొచ్చని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ‘ప్రజల జీవితాలు, ఆర్థిక వ్యవస్థ రెండూ ముఖ్యమే (జాన్‌ బీ.. జహాన్‌ బీ) ’ అని సీఎంలకు మోదీ సూచించారు. దీనిని బట్టి వైరస్‌ ప్రభావం లేని ప్రాంతాల్లో ఆంక్షలు కొంతమేర సడలించవచ్చని అంచనావేస్తున్నారు. కొన్ని వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలను పునఃప్రారంభించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.